Friday, February 22

Latest News

నిరుద్యోగ భృతి రూ.3016/- :: బడ్జెట్ కేటాయింపులు రూ.1810 కోట్లు

నిరుద్యోగ భృతి రూ.3016/- :: బడ్జెట్ కేటాయింపులు రూ.1810 కోట్లు

Breaking News, Latest News, Latest Updates
రాష్ట్రంలో నిరుద్యోగ భృతిని నెలకు రూ.3016లు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. అందుకనుగుణంగా 2019-20 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో రూ.1810 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించినట్టు బడ్జెట్ మీటింగ్ లో సీఎం వెల్లడించారు. దాంతో అధికారులు విధి విధానాలను తయారు చేసే పనిలో ఉన్నారు. 1) నిరుద్యోగ భృతి అమలు చేయాలంటే ఎవర్ని నిరుద్యోగులుగా గుర్తించాలి ? 2) ఎంత వరకు చదివిన వాళ్ళని గుర్తించాలి ? 3) ఏజ్ లిమిట్ ఎంతవరకు ఉండాలి ? ఈ అంశాలను పరిశీలించి అధికారులు నిబంధనలను తయారు చేయబోతున్నారు.  వీటిని లెక్కలోకి తీసుకుంటే రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని ఇవ్వొచ్చు అన్న దానిపైనా నిర్ణయం తీసుకుంటారు. అంతేకాకుండా... వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతిని ఎలా అమలు చేస్తున్నారన్న దానిపైనా స్టడీ చేయాలని నిర్ణయిం
1.30 లక్షల ఉద్యోగాలకు RRB నోటిఫికేషన్ రిలీజ్

1.30 లక్షల ఉద్యోగాలకు RRB నోటిఫికేషన్ రిలీజ్

Breaking News, Latest News, Latest Notifications
దేశవ్యాప్తంగా రైల్వేల్లో ఖాళీగా ఉన్న నాలుగు కేటగిరీలకు సంబంధించి 1.30 లక్షల ఉద్యోగాలకు RRB నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. RRB ప్రకటన ప్రకారం నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ లో ( NTPC), పారా మెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీల్లో 30వేలకు పైగా ఉద్యోగాలు, లెవల్ -1 కేటగిరీలో లక్ష పోస్టులకు నోటిఫికేషన్ వెలువడనుంది. అంటే మొత్తం లక్షా 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తోంది RRB. నాన్ టెక్నికల్ కేటగిరీలకు 28 ఫిబ్రవరి 2019 నుంచి ఆన్ లైన్ రిజిష్ట్రేషన్స్ మొదలవుతాయి. అలాగే పారా మెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్, ఐసోలేటెడ్ స్టాఫ్ పోస్టులకు 8 మార్చి 2019 నుంచి ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు. 1) Opening of Online Registration of Applications (NTPC) - 28th Feb, 2019 @10.00hrs 2) Opening of Online Registration of applicants (Para Medical) - 8th March, 2019@10.00 Hrs 3) Opening of onl
మంత్రులకు శాఖల కేటాయింపు

మంత్రులకు శాఖల కేటాయింపు

Breaking News, Latest News, Latest Updates
రాష్ట్రంలో ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన పది మంది మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శాఖలను కేటాయించారు. 1) జగదీష్ రెడ్డి - విద్యా శాఖ 2) తలసాని శ్రీనివాస్ యాదవ్ - పశుసంవర్థక శాఖ 3) నిరంజన్ రెడ్డి - వ్యవసాయ శాఖ 4) ఎర్రబెల్లి దయాకర్ రావు - పంచాయతీ రాజ్ శాఖ 5) ఈటల రాజేందర్ - వైద్య, ఆరోగ్య శాఖ 6) కొప్పుల ఈశ్వర్ - సంక్షేమ శాఖ 7) ఇంద్రకరణ్ రెడ్డి - అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ 8) సీహెచ్ మల్లారెడ్డి - కార్మిక శాఖ 9) శ్రీనివాస్ గౌడ్ - ఎక్సైజ్, క్రీడలు, టూరిజం, యువజన సర్వీసులు 10) వేముల ప్రశాంత్ రెడ్డి - రోడ్లు, భవనాలు, రవాణా శాఖ కీలకమైన ఆర్థిక, రెవెన్యూ, ఐటీ శాఖలను తన దగ్గరే ఉంచుకున్నారు సీఎం కేసీఆర్.  మహమూద్ అలీకి ఇప్పటికే హోంశాఖ ను కేటాయించారు.
ఆ యాప్స్ తో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ !

ఆ యాప్స్ తో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ !

Breaking News, Latest News, Latest Trends
థర్డ్ పార్టీ యాప్స్ తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటీవల కాలంలో చాలా యాప్స్ అందుబాటులోకి రావడంతో బ్యాంకు ఖాతాల్లోని నగదును ఒక ఖాతా నుంచి మరో చోటికి బదిలీ చేయడం జనానికి ఈజీ అయింది. ప్రస్తుతం అన్ని బ్యాంకులు కూడా సొంతంగా యాప్స్ ను అందుబాటులోకి తెచ్చాయి. అయితే కొన్ని యాప్స్ క్యాష్ బ్యాక్స్, రివార్డు పాయింట్లు ఇస్తామని ప్రకటిస్తుండటంతో చాలామంది ఏది పడితే అది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. పైగా వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని తమ మిత్రులు, బంధువులకు ఇన్విటేషన్స్ కూడా పంపుతున్నారు. కస్టమర్లను ఆకట్టుకోడానికి కొన్ని యాప్స్ అయితే మీ అకౌంట్ లో ఫలానా వ్యక్తి వెయ్యి రూపాయలు డిపాజిట్ చేశారు... ఈ లింక్ తో యాప్ డౌన్లోడ్ చేసుకొని... వెయ్యి రూపాయల గిఫ్ట్ పొందండి అంటూ ఊరిస్తున్నాయి. జాగ్రత్త... ఇలాంటి యాప్స్ తోనే మోసగాళ్ళు మీ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులను దోచేస్తారు. థర్డ్ పార్టీ యాప్
పోలీస్ ఉద్యోగార్ధులకు తీపి కబురు. హైదరాబాద్ లో రైట్ ఛాయిస్ పోలీస్ అకాడమీ ప్రారంభం.

పోలీస్ ఉద్యోగార్ధులకు తీపి కబురు. హైదరాబాద్ లో రైట్ ఛాయిస్ పోలీస్ అకాడమీ ప్రారంభం.

Latest News, Latest Trends
అంకితభావం.. క్రమశిక్షణ.. చిత్తశుద్ధే పెట్టుబడిగా.. స్థాపించిన అతి కొద్ది కాలంలోనే వందలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన రైట్ ఛాయిస్ సంస్థ ఆధ్వర్యంలో దిల్ షుక్ నగర్ లో పోలీస్ అకాడమీ ప్రారంభం కానుంది. 2 మార్చి 2019న దిల్ షుఖ్ నగర్ లోని భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్ (చైతన్యపురి బస్టాప్ ఎదురుగా)లో ఉదయం 9గంటలకు ఎస్.ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ అభ్యర్థుల కోసం రాష్ట్రంలోని అగ్రశ్రేణి ఫ్యాకల్టీలచే భారీ అవగాహనా సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు.. నమస్తే తెలంగాణా ఎడిటర్ శ్రీ కట్టా శేఖర్ రెడ్డి గారు(తెలంగాణా సంస్కృతి ), ఆర్.సి రెడ్డి సీనియర్ ఫ్యాకల్టీ చిట్టినాయుడు సార్ (రీజనింగ్ అర్థమెటిక్ ), కరీం సార్ ( హిస్టరీ ), మోహన్ సార్ ( జనరల్ సైన్స్), వీరితో పాటు తెలంగాణా ఉద్యమ చరిత్ర గ్రంధ రచయిత వి. ప్రకాశ్ గారు ఈ అవగాహనా సదస్సుకు హాజరై విద్యార్థులకు మెయిన్స్ లో ఎక్కువ మార్కులు సాధించేందుకు కావాల్సిన
దక్షిణ మధ్య రైల్వేలో 12 వేల ఉద్యోగాలు – దేశంలో 1.31లక్షలు : ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్స్

దక్షిణ మధ్య రైల్వేలో 12 వేల ఉద్యోగాలు – దేశంలో 1.31లక్షలు : ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్స్

Latest News, Latest Notifications
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న 12,433 పోస్టుల భర్తీకి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్, రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ ద్వారా వీటిని భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈనెలాఖరులోపే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు లోకో పైలెట్ : 2781 పోస్టులు ట్రాక్ మెయింటైనర్ : 3940 పోస్టులు పాయింట్స్ మెన్ : 884 పోస్టులు టెక్నీషియన్ : 2475 పోస్టులు హెల్పర్ : 1646 పోస్టులు జూనియర్ ఇంజనీర్లు : 707 పోస్టులు రైల్వే శాఖలో భారీగా ఖాళీలు ఉన్నాయని ఇటీవలే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దానికి తగ్గట్టుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు తమ పరిధిలో ఉన్న ఖాళీల లెక్క తీశారు. అలాగే దేశవ్యాప్తంగా ప్రస్తుతంతో పాటు వచ్చే ఏడాది ఖాళీ అయ్యే పోస్టులు కూడా కలుపుకుంటే 2.30 లక్షల ఉద్యో్గాలు ఖాళీ ఏర్పడతాయి. వీటిల్లో 1.31 లక్షల
వెబ్ సైట్లో పోలీస్ ఫిట్నెస్ టెస్టుల పెర్ఫార్మెన్స్ షీట్స్

వెబ్ సైట్లో పోలీస్ ఫిట్నెస్ టెస్టుల పెర్ఫార్మెన్స్ షీట్స్

Latest News
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షల్లో అభ్యర్థులకు సంబంధించిన పెర్ఫార్మెన్స్ షీట్ ( ప్రతిభా పత్రం) ను వెబ్ సైట్ లో పెడతామని తెలంగాణ స్టేట్ పోలీస్ నియామక మండలి తెలిపింది. ప్రస్తుతం ఫిట్నెస్ టెస్టులు పూర్తయ్యాక ఈ షీట్ ను అభ్యర్థులకు అందిస్తున్నారు. అయితే ఈ షీట్స్ కోసం అభ్యర్థులు ఎక్కువసేపు క్యూలో ఉండాల్సి వస్తోంది. అప్పటికే టెస్టులు పూర్తిచేసిన అభ్యర్థులు మళ్ళీ వెయిటింగ్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అభ్యర్థుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని షీట్స్ ని వెబ్ సైట్ లో పెడతామని మండలి ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. త్వరలోనే ఈ వివరాలు అందుబాటులోకి తెస్తామన్నారు. దేహదారుఢ్య పరీక్షల్లో ఎవరికి వారే వ్యక్తిగతంగా ఈ వివరాలను వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షల వివరాలను సీసీ కెమెరాల్లో చిత్రీకరిస్తున్నామనీ.. వీటి ఆధారంగా షీట్స్ తయారు చేస్తామన్న
FBO పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు వీళ్ళే !

FBO పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు వీళ్ళే !

Latest News, Latest Notifications
ఫారెస్ట్ బీట్ అధికారుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడిచింది. 2017 ఆగస్టు 15న దీనికి సంబంధించి 48/2017 నోటిఫికేషన్ ను విడుదల చేసింది TSPSC. దీనికి 29 అక్టోబర్ 2017 నాడు రాత పరీక్ష నిర్వహించింది. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు జులై, 2018 లో ఫిట్నెస్ టెస్టులు నిర్వహించారు. అందులో క్వాలిఫై అయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లుగా ఎన్నికైన వారి జాబితాను చివరకు ఇవాళ www.tspsc.gov.in వెబ్ సైట్ లో ఉంచారు. tspsc వెబ్ నోట్ కోసం క్లిక్ చేయండి fbo-web-note పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి FBO-SELECT-RESULT
ఐసెట్ 2019 షెడ్యూల్ రిలీజ్

ఐసెట్ 2019 షెడ్యూల్ రిలీజ్

Latest News, Latest Updates
కాకతీయ యూనివర్సిటీ నిర్వహించే... TS ఐసెట్ 2019 షెడ్యూల్ ను విడుదల చేశారు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి,ఐసెట్ చైర్మన్, విసి ప్రో. సాయన్న. 2019లో MBA, MCA ఎంట్రెన్స్ పరీక్షల షెడ్యూల్ రిలీజైంది. ఈనెల 21న నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది మే 23, 24 తేదీల్లో ICET నిర్వహిస్తారు మార్చి 7 నుంచి ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్ ఫీజులు: SC/ST లకు రూ.450 ఇతరులు రూ.650 500 రూపాయల అపరాధ రుసుము మే 6నుంచి 10 వరకు 2000 రూపాయలతో మే11 నుంచి 14 వరకు 5000 రూపాయలతో మే15 నుంచి 17వరకు 10,000 అపరాధ రుసుము మే 18 చివరి తేదీ వరకు .. 19మే నుంచి హాల్ టిక్కెట్స్ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు ప్రిలిమినరీ కీని మే 29న విడుదల చేస్తారు. అభ్యంతరాల స్వీకరణకు జూన్ 1 వ తేదీ వరకూ టైమ్ ఇస్తారు 3 జూన్ 2019న పరీక్ష ఫలితాలు విడుదల అవుతాయి మన రాష్ట్రంలో 10 సెంటర్లలో, ఏప