Tuesday, September 25
Log In

Latest Notifications

పంచాయతీకి వయో పరిమితి పెంచరా ?

పంచాయతీకి వయో పరిమితి పెంచరా ?

Latest News, Latest Notifications
జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు సంబంధించి ఇంకా గందరగోళం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,355 పోస్టుల భర్తీ బాధ్యతను ప్రభుత్వం tspsc కి కాకుండా పంచాయతీ రాజ్ శాఖకు అప్పగించింది. 2017 రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 190 ప్రకారం రాష్ట్రంలో జరిగే అన్ని ప్రభుత్వ రిక్రూట్ మెంట్స్ లో అభ్యర్థుల వయో పరిమితిని 44 యేళ్ళ వరకూ లెక్కలోకి తీసుకోవాలి. ఇప్పటి వరకూ tspsc జారీ చేసిన నోటిఫికేషన్లు అన్నింటిలో అదే పరిస్థితి కొనసాగింది. కానీ అందుకు విరుద్ధంగా పంచాయతీ రాజ్ శాఖ ఇచ్చిన నోటిఫికేషన్ లో 39 యేళ్ళుగా పేర్కొన్నారు. అయితే పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయాన్ని తప్పుబడుతూ హైకోర్టును ఆశ్రయించిన 9 మందికి మాత్రం ఊరట కలిగించింది. 44 యేళ్ళ వరకూ ఉన్న అభ్యర్థులు అప్లయ్ చేసుకోడానికి పర్మిషన్ ఇచ్చింది. దాంతో కోర్టును ఆశ్రయించిన 9 మందికి మాత్రమే జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్ రాసుకోడానికి అనుమతి లభించింది. అ
మున్సిపల్ శాఖలో 111 ఇంజనీర్ పోస్టులు

మున్సిపల్ శాఖలో 111 ఇంజనీర్ పోస్టులు

Latest News, Latest Notifications
రాష్ట్ర పురపాలక శాఖలో 111 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని TSPSC ద్వారా భర్తీ చేయనున్నారు. పురపాలక శాఖ పబ్లిక్ హెల్త్ విభాగంలో 87 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టులు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ ( MAE) లో 24 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. వీటిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
పంచాయతీ కార్యదర్శుల పరీక్ష వాయిదా

పంచాయతీ కార్యదర్శుల పరీక్ష వాయిదా

Latest News, Latest Notifications
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఎంట్రన్స్ టెస్ట్ అక్టోబర్ 10కి వాయిదా పడింది.  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,355 పోస్టులకు పంచాయతీ రాజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.  షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 4న ఎగ్జామ్ నిర్వహించాల్సి ఉంది.  ఈ ఎగ్జామ్ కోసం 5,69,447 మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకున్నారు.  30 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఈ ఎగ్జామ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.  ప్రశ్నాపత్రాలను JNTU తయారు చేసింది. ప్రాంతీయ కేంద్రాల గుర్తింపు వాటిని కోఆర్డినేటర్ల ఏర్పాటులో ఈ యూనివర్సిటీ భాగం పంచుకుంది.   ప్రశ్నాపత్రాలు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటాయి.  వాయిదాకి కారణలను పంచాయతీ రాజ్ శాఖ ఇంకా వివరించలేదు.  RRBతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల ఎంట్రన్స్ టెస్టులను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల నుంచి వస్తున్న రిక్వెస్ట్ మేరకు పరీక్షను వాయిదా వేసినట్టు తె
హడావిడిగా పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్…! సడన్ గా ఎగ్జామ్ డేట్ !!

హడావిడిగా పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్…! సడన్ గా ఎగ్జామ్ డేట్ !!

Latest News, Latest Notifications
కొండంత సిలబస్ - నెగిటివ్ మార్కింగ్ విధానం అధికారుల తొందరపాటుతో సర్కార్ కీ ఇబ్బందులు జూనియర్ పంచాయతీ కార్యదర్శి నియామకాల విషయంలో అధికారులు మొదటి నుంచి ప్రదర్శిస్తున్న తొందరపాటుతనం నిరుద్యోగ అభ్యర్థులకు క్షోభ మిగులుస్తోంది. రాష్ట్రంలో కొత్త జోన్స్ కి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయగానే.. హడావిడిగా 9,355 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు. ఈ హడావిడిలో తమ వెబ్ సైట్ పేరు కూడా తప్పుగా ఇస్తూ ప్రకటన విడుదల చేశారు. దాంతో మీడియాతో పాటు అభ్యర్థులు కూడా ఆ తప్పు వెబ్ సైట్ పేరుతో వెతికి గందరగోళంలో పడ్డారు. తెల్లారి దినపత్రికల్లోనూ వెబ్ సైట్ పేర్లు తప్పుగా ప్రచురితం అయ్యాయి. సోషల్ మీడియాలో అభ్యర్థులు గగ్గోలు పెట్టారు. చివరకు వెబ్ సైట్ అడ్రస్ దొరికింది. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తెల్లారి సాయంత్రం తర్వాత వాటి వివరాలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు. గతంలో ఏ ఎగ్జామ్ కీ లేనివిధంగా
పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్ అక్టోబర్ 4

పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్ అక్టోబర్ 4

Latest News, Latest Notifications
జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల ఎగ్జామ్ అక్టోబర్ 4కు వాయిదా వేసింది ప్రభుత్వం. నిరుద్యోగుల నుంచి వస్తున్న విజ్ఞప్తితో 5 రోజులు extend చేసింది. అలాగే ద‌ర‌ఖాస్తు గ‌డువును కూడా ప్రభుత్వం పొడిగించింది. ఇవాళ్టితో ముగియాల్సిన ఫీజు చెల్లింపు గ‌డువును ఈ నెల 14 వ‌ర‌కు పొడిగించారు. రేప‌టితో ముగియాల్సిన ద‌ర‌ఖాస్తు గ‌డువును ఈ నెల 15 వ‌ర‌కు extend చేశారు. నియామక పరీక్షను అక్టోబర్ 4న నిర్వహించనున్నట్లు ప్రకటించారు అధికారులు. ద‌ర‌ఖాస్తు చేయ‌డంలో ఎదురువుతున్న ఇబ్బందుల‌పై నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞాపనలతో స్పందించింది ప్ర‌భుత్వం. మంత్రి జూప‌ల్లి కృష్ణారావు సూచ‌న‌ల‌తో గ‌డువు పొడిగిస్తూ నియామ‌క ప్ర‌క్రియ క‌మిటీ క‌న్వీన‌ర్ నీతూ ప్ర‌సాద్‌ ఉత్త‌ర్వులు జారీ చేశారు. (ఎం. విష్ణుకుమార్, సీనియర్ జర్నలిస్ట్, www.telanganaexams.com )
అసెంబ్లీ రద్దుతో నోటిఫికేషన్లు ఆగుతాయా ?

అసెంబ్లీ రద్దుతో నోటిఫికేషన్లు ఆగుతాయా ?

Latest News, Latest Notifications
రాష్ట్రంలో అసెంబ్లీ రద్దయింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆపద్దర్మ ప్రభుత్వం కొనసాగుతోంది... ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నడుస్తున్న నోటిఫికేషన్ల సంగతేంటి ... ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొనసాగుతాయా... వాటిని రద్దు చేస్తారా... రిజల్ట్స్ ఇస్తారా... కొత్త వాటి పరిస్థితి ఏంటి... ఇది నిరుద్యోగులను ఇబ్బంది పెడుతున్న ప్రశ్నలు. రాబోయే ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న చాలామంది నిరుద్యోగులకు చదవాలో... వద్దా... అర్థం కాని సందిగ్దంలో పడ్డారు. ఈ డౌట్స్ ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తోంది... తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్ సైట్. అసెంబ్లీ రద్దు తర్వాత ఆపద్దర్మ ప్రభుత్వం నడుస్తోంది. కొత్త నోటిఫికేషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఈ ప్రభుత్వానికి ఉండదు కాబట్టి ... కొత్త కొలువులకు ప్రకటనలు వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అయితే ఇప్పటికే నోటిఫికేషన్లు రిలీజ్ చేసి... ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకటించినవి కొనస
ఎగ్జామ్స్ వాయిదా పడవు !

ఎగ్జామ్స్ వాయిదా పడవు !

Latest News, Latest Notifications
కొత్త జోనల్ విధానంతో రాష్ట్రంలో ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన పరీక్షలు యధావిధిగా నిర్వహించాలని నిర్ణయించారు. కొత్త జోనల్ విధానం అమల్లోకి రావడంతో ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు చేసి ... తాజాగా ప్రకటనలు జారీ చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే అలాంటి పరిస్థితి ఉండబోదు. దీనిపై న్యాయ నిపుణులతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమావేశమయ్యారు. అలాగే కొత్తగా విడుదల చేసే ప్రకటనల విషయంలోనూ ఎలాంటి అడ్డంకులు ఎదురు కాబోవని అంటున్నారు. ఏదైనా ఉద్యోగ ప్రకటన జారీ చేసినప్పుడే ... ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేసే మార్పులు, చేర్పులకు లోబడి ప్రకటనలో సవరణలు ఉంటాయని పేర్కొన్నారు. దాంతో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ యధావిధిగా నిర్వహించాలని ప్రభుత్వ వర్గాలు నిర్ణయించాయి. జోనల్ విధానం ప్రకటించక ముందు వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఈనె
పంచాయతీ కార్యదర్శుల నోటిఫికేషన్ రిలీజ్

పంచాయతీ కార్యదర్శుల నోటిఫికేషన్ రిలీజ్

Latest News, Latest Notifications
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు పంచాయతీ రాజ్ శాఖ పూర్తి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి NOTIFICATION   Note: పంచాయతీ కార్యదర్శులకు తక్కువ టైమ్ లో ఎలా ప్రిపేర్ అవ్వాలో ఆర్టికల్ ఇస్తాను.  అలాగే ప్రత్యేకంగా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ప్లాన్ చేస్తున్నాం.  2 రోజుల్లో వివరాలు తెలియజేస్తాం. (గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ కొత్త చట్టం లాంటి అంశాలే కీలకం )
పంచాయతీ కార్యదర్శులకు నోటిఫికేషన్ జారీ

పంచాయతీ కార్యదర్శులకు నోటిఫికేషన్ జారీ

Latest News, Latest Notifications
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. సెప్టెంబర్ 3 నుంచి 11 వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తారు సెప్టెంబర్ 10 వరకూ ఫీజుల చెల్లింపునకు అవకాశం మొత్తం 9,355 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ కొత్తగా నియమించే జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు 3ఏళ్ల వరకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. తర్వాత వాళ్ల పనితీరు బట్టి regularise చేస్తారు. ప్రొబేషన్ టైం లో వారికి రూ.15వేలు జీతం చెల్లిస్తారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శి ల నియామకం లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తారు. రాష్ట్రంలో మొత్తం 12వేల751 గ్రామ పంచాయితీ లు ఉన్నాయి. వీటిల్లో 3వేల562 మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు. అర్హతలు, ఇతర నిబంధనలు 1) జూనియర్ పంచాయతీ కార్యదర్శి కి అర్హత డిగ్రీ 2) వయస్సు 18-39 యేళ్ళ మధ్య (జనరల్ అభ్యర్తులు ), SC/ST/BC లకు ఐదేళ్ళు, PHC లకు పదేళ్ళు వయో పరిమితి మినహాయింపు
పంచాయతీ కార్యదర్శులకు డిగ్రీ అర్హత, విధివిధానాలు ప్రకటన

పంచాయతీ కార్యదర్శులకు డిగ్రీ అర్హత, విధివిధానాలు ప్రకటన

Latest News, Latest Notifications
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ నియామకాలను tspsc ద్వారా కాకుండా శాఖాపరమైన కమిటీ ద్వారా భర్తీ చేస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. అందుకనుగుణంగా పంచాయతీ రాజ్ అండ్ రూరల్ ఎంప్లాయ్ మెంట్ కమిషనర్ ఛైర్ పర్సన్ గా మొత్తం 8 మంది సభ్యులతో కమిటీని నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. 1) ఛైర్ పర్సన్ : కమిషనర్, PR & RE, హైదరాబాద్ ఇతర సభ్యులు 2) రిజిష్ట్రార్, JNTU, హైదరాబాద్ 3) అడిషినల్ సెక్రటరీ, PR & RD Dept., 4) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, SERP, Hyd 5) GAD శాఖ నుంచి ప్రతినిధి 6) ఫైనాన్స్ శాఖ నుంచి ప్రతినిధి 7) న్యాయశాఖ నుంచి ప్రతినిధి 8) డిప్యూటీ కమిషనర్, PR & RE -కన్వినర్ ఈ పోస్టులను 1) JNTU 2) పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు 3) తెలంగాణ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ బోర్డు ల