Thursday, February 27

General Knowledge

తెలంగాణలో వరి సాగు

General Knowledge, Latest News
1) రాష్ట్రవ్యాప్తంగా అంచనాలకు మించి వరి సాగైంది. మొత్తం 25.44 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి 2) రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం : 23.75 లక్షల ఎకరాలు. ఇప్పుడు 107 శాతానికి చేరుకుంది 3) రాష్ట్రంలో అన్ని రకాల పంటల సాగు సాధరణ విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు. ప్రస్తుతం 1.03 కోట్ల ఎకరాల్లో సాగవుతోంది. 4) 12 జిల్లాల్లో లోటు వర్షపాతం కొనసాగుతోంది 5) సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, జోగుళాంబ, నల్లగొండ, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో లోటు వర్షపాతం 6) ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో అధికవర్షపాతం నమోదైంది.

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్

General Knowledge, Latest News
- అందరికీ బ్యాంకు ఖాతాలు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 28 ఆగస్టు 2014లో అమల్లోకి తెచ్చింది. నాలుగేళ్ళ పాటు అమల్లో ఉండేలా పథకం రూపొందించగా, దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. - దేశంలో బ్యాంకు ఖాతాలు లేని 7.5 కోట్ల మంది ఖాతా తెరిచి, రూపే డెబిట్ కార్డులను పంపిణీ చేయాలన్నది మొదట లక్ష్యంగా పెట్టుకున్నారు. ^ ప్రస్తుత ఖాతాలు : 32.41 కోట్లు, వీటిల్లో సొమ్ము : రూ.81,200 కోట్లు - ఖాతాదారులకు మొదట్లో 1లక్ష రూపాయల ప్రమాద బీమా, మరణిస్తే రూ.30వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత కేంద్ర ఈ మొత్తాన్ని రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఉచిత బీమా సౌకర్యం రూ.2 లక్షలు చేశారు. - మొదట్లో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం రూ.5 వేలు ( 6 నెలల పాటు ఖాతాను నిర్వహించాలి ) ఇప్పుడు రూ.10 వేలు చేశారు - ఖాతాదారుల్లో మహిళలు 53శాతం మంది ఉన్నారు.  

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి గొగొయ్ ?

General Knowledge
- ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్ర తన తర్వాత CJI గా జస్టిస్ రంజన్ గొగొయ్ పేరును ప్రతిపాదించారు - CJI దీపక్ మిశ్రా 2018 అక్టోబర్ 2 న పదవీ విరమణ చేస్తున్నారు - తర్వాత ప్రధాన న్యాయమూర్తి పేరును సిఫార్సు చేయాల్సిందిగా న్యాయ మంత్రిత్వ శాఖ దీపక్ మిశ్రాకి లేఖ రాసింది - సర్వోన్నత న్యాయస్థానంలో మిశ్రా తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి గొగొయ్ - ఈ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే 2018 అక్టోబర్ 3న గొగొయ్ CJIగా ప్రమాణం చేస్తారు. ఆయన ఈ పదవిలో 2019 నవంబర్ 17 వరకూ కొనసాగుతారు - అసోమ్ కి చెందిన జస్టిస్ గొగొయ్ 1978లో బార్ కౌన్సిల్ లో చేరారు. - 2001 ఫిబ్రవరి 28న గువహాటి హైకోర్టులో పర్మినెంట్ జడ్జిగా నియమితులయ్యారు. - 2010 సెప్టెంబర్ లో పంజాబ్, హరియాణా హైకోర్టుకి బదిలీ. 2011 ఫిబ్రవరిలో అదే కోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా నియామకం - 2012 ఏప్రిల్ లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి

రాష్ట్రంలో ఓటర్ల లెక్కలు

General Knowledge
రాష్ట్రంలో మొత్తం ఓటర్లు : 2,61,36,776 మంది ఇందులో పురుషులు: 1,32,68,676 మంది మహిళా ఓటర్లు : 1,28,65,193 మంది 2018 జనవరి 4 జాబితా ప్రకారం మొత్తం ఓటర్లు 2,53,27,785 అంటే గతం కంటే 8,08,991 మంది అదనంగా నమోదు అయ్యారు. ఇందులో పురుషులు : 4,03,483 మంది, మహిళలు: 3,89,617 మంది, థర్డ్ జండర్స్ : 168 మంది అదనంగా పెరిగారు. పోలింగ్ కేంద్రాల సంఖ్య : 32,573

కేంద్ర ప్రభుత్వ పథకాలు (Part-2) – QUICK REVISION

General Knowledge, Latest News, భార‌త‌, తెలంగాణ రాష్ట్ర విధానాలు, ప‌థ‌కాలు
( 2nd part ) 11) ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజన - 2016 మే 1న ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రారంభమైంది. - దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న ( పేద కుటుంబాలు ) మహిళల పేరుతో ఉచితంగా LPG (వంట గ్యాస్‌) కనెక్షన్లు ఇస్తారు. - మొదటి మూడేళ్ళలో 5 కోట్ల కనెక్షన్లు ఇస్తారు. 12) హృదయ్‌ - HRIDAY (Heritage City Development and Augmentation Yojana - వారసత్వ నగరాల సంరక్షణ కోసం 2015 జనవరి 21న ఈ పథకం ప్రారంభమైంది. - మొదటి దశలో 12 నగరాలను ఎంపిక చేశారు. ఇందులో తెలంగాణ నుంచి వరంగల్, ఏపీ నుంచి అమరావతి ఉన్నాయి. ఇవి కాకుండా... వారణాసి (ఉత్తరప్రదేశ్‌), పూరి (ఒడిశా), అమృత్‌సర్‌ (పంజాబ్‌), అజ్మీర్‌ (రాజస్థాన్‌), గయ (బీహార్‌), మధుర (ఉత్తరప్రదేశ్‌), కాంచీపురం (తమిళనాడు), వేలంగిణి (తమిళనాడు), బాదామీ (కర్ణాటక) తోపాటు ద్వారక (గుజరాత్‌). 13) ప్రధానమంత్రి కృషి సంచాయ్‌ యోజన - వ్యవసాయరంగం, గ్రామాలకు న

జాతీయ క్రీడల దినోత్సవం – ఆగస్ట్ 29

General Knowledge
1) భారత హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఆగస్ట్ 29న జాతీయ క్రీడల దినోత్సవం నిర్వహిస్తారు 2) ది విజార్డ్, ది మెజీషియన్ అని ఆయన్ని పిలుస్తారు 3) 1928, 1934, 1936ల్లో ఒలింపిక్స్ లో భారత్ కి గోల్డ్ మెడల్ సంపాదించిపెట్టాడు 4) 1926 నుంచి 1948 వరకూ తన కెరీర్ లో 400 గోల్స్ సాధించాడు 5) ధ్యాన్ చంద్ ఆటో బయోగ్రఫీ ‘గోల్’ పేరుతో వెలువడింది. ( 1952లో స్పోరట్ అండ్ పాస్ట్ టైమ్, మద్రాస్ సంస్థ దీన్ని ప్రచురించింది)

కేంద్ర ప్రభుత్వ పథకాలు (1) – QUICK REVISION

General Knowledge, Latest News, భార‌త‌, తెలంగాణ రాష్ట్ర విధానాలు, ప‌థ‌కాలు
1) ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) - ఒక దేశం - ఒక పథకం అనే నినాదంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. - పథకానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అశిష్ కుమార్ భుటానీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. మే 2020 వరకూ ఈ పదవిలో కొనసాగుతారు - 2016 జనవరి 13 నుంచి అమల్లోకి తెచ్చిన ఈ స్కీమ్ కింద ప్రకృతి విపత్తులు, చీడ పీడలతో రైతులు పంట నష్టపోయినప్పుడు త్వరగా బీమా సౌకర్యం, ఇతర సాయం అందించేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. - గతంలో జాతీయ వ్యవసాయ బీమా పథకం, పునర్వవస్థీకరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం పథకాలను తొలగించి... ఒకే పథకంగా PMFBY తెచ్చారు - ఈ స్కీమ్ కోసం రైతులు ఖరీఫ్ కి అయితే 2శాతం, రబీకి అయితే 1.5శాతం ప్రీమియం చెల్లించాలి. ఉద్యాన, వాణిజ్య పంటలకైతే 5శాతం ప్రీమియం చెల్లించాలి. 2) ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన - 2015 జూన్‌ 25న ప్రధాని ఆవాస్‌ యోజనను ప్రారంభించారు. - ఈ పథకం కింద పేదలకు రెండు కోట్ల ఇళ్లు నిర్మ

బతుకమ్మ చీరలు

General Knowledge
1) రాష్ట్రంలో గత ఏడాది నుంచి బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీచేస్తోంది 2) మొత్తం 1.08 కోట్ల బతుకమ్మ చీరలను మహిళలకు పంచుతారు 3) బతుకమ్మ ఒక్కో చీర రూ.280 4) తెల్ల రేషన్ కార్డు ఉన్న 18యేళ్ళు నిండిన ప్రతి మహిళకు చీర ఇస్తారు. 5) చేనేత కార్మికులకు రూ.60కోట్లతో నేతన్నకు చేయూత పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.

గగనయాన్

General Knowledge
1) అంతరిక్షంలోకి భారతీయుడిని పంపేందుకు అవసరమయ్యే కీలక పరిజ్ఞానంపై 2004లో కసరత్తు మొదలైంది 2) 2022 కల్లా భారతీయుడిని అంతరిక్షంలోకి పంపనున్నారు 3) GSLV మార్క్ 3 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తారు 4) వ్యోమ నౌకను 300-400కిమీ ఎత్తులోని భూ దిగువ కక్ష్యలో దీన్ని ప్రవేశపెడతారు 5) గగనయాన్ ప్రాజెక్ట్ వ్యయం రూ.10వేల కోట్ల లోపు 6) భూమి నుంచి ప్రయోగించాక 16 నిమిషాల్లో ఈ వ్యోమ నౌక నిర్దేశిత కక్ష్యలోకి చేరుతుంది 7) వ్యోమగాములు ఐదు నుంచి ఏడు రోజుల పాటు రోదసీలో ఉంటారు 8) అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారతీయుడు రాకేశ్ శర్మ నుంచి ఇస్రో సలహాలు, సూచనలు తీసుకుంటుంది. రాకేశ్ శర్మ 1984లో రష్యా ప్రయోగించిన సోయుజ్ టీ - 11 వాహన నౌకలో అంతరిక్షంలోకి ప్రయాణించారు.

MOST EXPECTED GK BITS -2

General Knowledge
(VRO, SI, CONSTABLE, GROUP-IV అభ్యర్థులకు ఉపయోగం) 1) గవర్నర్ జనరల్ గా ఫోర్ట్ విలియం... గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఏ చట్టంతో మారాడు ? జ: 1833 చార్టర్ చట్టం 2) దిన్ ఇ ఇల్లాహీ మతాన్ని అంగీకరించింది ఎవరు ? జ: బీర్బల్ 3) ప్రపంచంలో రెండో ఎత్తయిన శిఖరం ఏది ? జ: కే 2 ( గాడ్విన్ ఆస్టిన్ ) 4) సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ? జ: ఖాట్మండూ, నేపాల్ 5) సిటీ ఆఫ్ జాయ్ రాసింది ఎవరు ? జ: డొమినిక్ లాపీరే 6) భారత్ లో ఏ పదవినిరాజ్యాంగం పేర్కొన లేదు ? జ: ఉప ప్రధానమంత్రి 7) బాక్సైట్ ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది ? జ: ఆస్ట్రేలియా 8) ప్రస్తుతం అమల్లో ఉన్న టోకు ధరల సూచీ ఆధార సంవత్సరం ఏది ? జ: 2004-2005 9) దేశంలో అతి పొడవైన ప్యాసింజర్ రైల్ రూట్ ఏది ? జ: కన్యాకుమారి నుంచి జమ్ము తావి 10) చండీగఢ్ ను డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్ ఎవరు ? జ: లీ కోర్బూజియర్ 11) భారత్ - పాక్ మధ్య ఉన్న సరిహద్దు