Wednesday, June 26

CURRENT AFFAIRS – SEPT 5

రాష్ట్రీయం
01) సిద్ధిపేట జిల్లాలో మలేసియాకి చెందిన DXN కంపెనీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమను స్థాపించనుంది. ఏ పారిశ్రామిక పార్కుల్లో ఈ కంపెనీ నిర్మాణం జరుగుతోంది ?
జ: మందపల్లిలోని పారిశ్రామిక పార్కులో
02) గోకుల్ ఛాట్, లుంబినీ పార్క్ జంట పేలుళ్ళ కేసులో తుది తీర్పును ప్రత్యేక కోర్టు వెల్లడించింది. ఈ పేలుళ్ళు ఎప్పుడు జరిగాయి ?
జ: 2007 ఆగస్ట్ 25 నాడు
03) రూ.476.25 కోట్లతో మంజీరా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకానికి ఏ డ్యామ్ నుంచి నీటిని తీసుకుంటారు ?
జ: నిజాం సాగర్ డ్యామ్
04) హైదరాబాద్ లో F-16 ఫైటర్ జెట్ రెక్కల తయారీని 2020 నుంచి చేపట్టాలని అమెరికాకి చెందిన లాఖీడ్ మార్టిన్ కంపెనీ నిర్ణయించింది. భారత్ కు చెందిన ఏ కంపెనీతో టై అప్ అవుతుంది ?
జ: టాటా కంపెనీతో
05) ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగులకు ఎంత శాతం కోటా పెంచుతూ రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ?
జ: 4శాతం ( గతంలో 3శాతం ఉండేది )
06) విద్యుత్ పొదుపు, సౌర విద్యుత్ వినియోగం, నీటి నిర్వహణ విధానం, LED దీపాల ఏర్పాటు తదితర అంశాల్లో శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏ అవార్డు లభించింది ?
జ: ఎక్స్ లెంట్ ఎనర్జీ ఎఫీషియంట్ యూనిట్ అవార్డు

జాతీయం
07) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ఎవరు ?
జ: రజనీష్ కుమార్ (హెడ్ క్వార్టర్స్ : ముంబై )
08) డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు ?
జ: డాక్టర్ ఎస్ ఈశ్వర రెడ్డి
09) దేవి అహిల్యాబాయ్ హోల్కర్ పుష్ప్ పెండ్రా ఎయిర్ పోర్ట్ ఎక్కడ ఉంది ?
జ: ఇండోర్ (మధ్యప్రదేశ్ )
10) బెట్లా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: జార్ఖండ్
11) భారత్ - బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు భద్రతాదళాల 47వ ద్వైవార్షిక సమావేశం ఎక్కడ జరిగింది ?
జ: న్యూఢిల్లీ
12) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) డైరక్టర్ జనరల్ ఎవరు ?
జ: కెకే శర్మ
13) సింగ్ ఫన్ వన్యమృగ సంరక్షణా కేంద్రాన్ని ఏనుగుల సంరక్షణ కేంద్రంగా గుర్తించాలని నిర్ణయించిన రాష్ట్రం ఏది ?
జ: నాగాలాండ్
14) దక్షిణకొరియాలో జరుగుతున్న ప్రపంచ సీనియ్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో 50మీ. పురుషుల పిస్టల్ విభాగంలో స్వర్ణం నెగ్గిన భారత షూటర్ ఎవరు ?
జ: ఓం ప్రకాశ్
15) సుప్రీంకోర్టు చరిత్రలో మొదటిసారిగా ముగ్గురు సిట్టింగ్ మహిళా జడ్జీల బెంచీ కేసుల విచారణను చేపట్టనుంది. ఆ ముగ్గురు జడ్జీలు ఎవరు ?
జ: జస్టిస్ భానుమతి, జస్టిస్ ఇందిరా, జస్టిస్ ఇందూ మల్హోత్రా

అంతర్జాతీయం
16) పాకిస్తాన్ అధ్యక్షుడుగా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: డాక్టర్ ఆరిఫ్ అల్వీ
(నోట్: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ అధికార తెహ్రిక్ - ఇ- ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు )
17) లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్ కంపెనీగా అమెజాన్ అవతరించింది. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన రెండో కంపెనీ అమెజాన్. మొదటి కంపెనీ ఏది ?
జ: యాపిల్ (ఐ ఫోన్స్ తయారీ సంస్థ )
18) ఆసియా గేమ్స్ లో Most Valuable Player గా నిలిచిన మొదటి మహిళా అథ్లెట్ రికాకో ఇకీ ఏ దేశానికి చెందిన వారు ?
జ: జపాన్
19) 2018 ప్రపంచ కొబ్బరి దినోత్సవం యొక్క థీమ్ ఏంటి ?
జ: Coconut for Good Health, Wealth & Wellness