Tuesday, February 25

CURRENT AFFAIRS – SEPT 28 & 29

రాష్ట్రీయం
01) యాసంగి (రబీ) సీజన్ లో రైతు బంధు కోసం ప్రభుత్వం ఎన్ని కోట్లు మంజూరు చేసింది ?
జ: రూ.5,900 కోట్లు
02) ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్న హైదరాబాద్ అమ్మాయి ఎవరు
జ: అరుంధతి రెడ్డి

03) పర్యాటక ప్రాంతాల్లో మెరుగైన సేవల కల్పనకు జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న సంస్థ ఏది ?
జ: GHMC

జాతీయం
04) మహిళలందరికీ శబరిమలలో ప్రవేశం కల్పించాలని తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి ఎవరు నేతృత్వం వహించారు ?
జ: ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర
05) సర్జికల్ స్ట్రైక్స్ ( మెరుపుదాడుల) ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా రాజస్థాన్ లోని జోధ్ పుర్ లో పరాక్రమ్ పర్వ్ ప్రదర్శనను ఎవరు ప్రారంభించారు ?
జ: ప్రధాని నరేంద్ర మోడీ
(నోట్: 2016 సెప్టెంబర్ లో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పాక్ శిబిరాలపై భారత సైన్యం మెరుపు దాడులు జరిపింది )

06) వివాహేతర సంబంధం నేరం కాదని తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం IPCలోని ఏ సెక్షన్ రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పింది ?
జ: సెక్షన్ 497
07) లోక్ పాల్, లోకాయుక్తపై అన్వేషణకు కేంద్రం నియమించిన కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు ?
జ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్
08) 21వ శతాబ్దపు దిగ్గజాల్లో లండన్ లో అవార్డు అందుకున్న భారత సంతతి వ్యక్తి ఎవరు ?
జ: సంజీవ్ గుప్తా
09) బధిరుల టీ 20 ప్రపంచకప్ ఈసారి ఎక్కడ జరగనుంది ?
జ: భారత్ ( గురుగ్రామ్ లో )
10) ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, CEO గా ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
జ: పద్మజ చంద్రూ
11) దేశవ్యాప్తంగా పశుగణన కార్యక్రమం ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ జరగనుంది
జ: 2018 అక్టోబర్ 1 నుంచి 20 వరకూ
12) ఫార్చ్యూన్ మేగజైన్ ప్రకటించిన అమెరికా వెలుపల 50 మంది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారుల్లో భారత్ కు చెందిన ఎవరికి చోటు దక్కింది ?
జ: GIC ఛైర్మన్ అలైస్ వైద్యన్
13)ఆసియా క్రికెట్ వన్డే కప్ ను భారత్ గెలుచుకుంది. ఏ దేశంపై గెలుపొందింది ?
జ: బంగ్లాదేశ్ పై 3 వికెట్ల తేడాతో గెలిచింది
14) ఆసియా కప్ ను భారత్ ఇప్పటిదాకా ఎన్ని సార్లు గెలుచుకుంది ?
జ: ఏడో సారి
15) ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ జట్టుకి భారత్ కెప్టెన్ గా ఎవరు వ్యవహరిస్తారు ?
జ: హర్మన్ ప్రీత్ కౌర్
16) జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో పురుషుల 3వేల మీటర్ల సీపుల్ చేజ్ లో 37యేళ్ళ రికార్డును బద్దలు కొట్టిన అథ్లెట్ ఎవరు ?
జ: అవినాశ్

17) భారత గిరిజనులకు బ్రాండ్ అంబాసిడార్ గా ఎవరి పేరును కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది ?
జ: ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్

పంచాయతీ సెక్రటరీలకు మాక్ టెస్టులు +5 గ్రాండ్ టెస్టులు (TM) సెకండ్ పేపర్ పై ప్రత్యేక శ్రద్ధ

పూర్తి వివరాలకు కింది లింక్ క్లిక్ చేయండి :

https://telanganaexams.com/gp-secy-mock/