Friday, February 21

CURRENT AFFAIRS – SEPT 25 & 26

రాష్ట్రీయం
01) రాష్ట్రంలో ఎప్పటి నుంచి బతుకమ్మ సంబురాలు మొదలవుతున్నాయి ?
జ: 2018 అక్టోబర్ 9 నుంచి
02) కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ఏ రోజున నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ?
జ: సెప్టెంబర్ 27న
03) కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కష్టపడి పనిచేస్తున్న ఇంజనీర్లు, కార్మికుల సేవలను గుర్తిస్తూ వచ్చిన సంకలనం ముఖచిత్రాన్ని మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. ఆ సంకలనం పేరేంటి ?
జ: జలనిధి కాళేశ్వరం
04) కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం అమృత్ లో తెలంగాణకి ఎన్నో స్థానం దక్కింది ?
జ: నాలుగో స్థానం
05) హైదరాబాద్ మెట్రో ఎండి ఎవరు ?
జ: ఎన్ వీ ఎస్ రెడ్డి
06) అర్జున అవార్డు దక్కించుకున్న తెలుగమ్మాయి ఎవరు ?
జ: నేలకుర్తి సిక్కి రెడ్డి ( బ్యాడ్మింటన్ డబుల్స్ లో రాణించినందుకు )
07) వెనిస్ లో జరిగిన ప్రపంచ కిక్ బాక్సింగ్ లో క్రెడిట్,జూనియర్ విభాగాల్లో భారత్ కి 3 పతకాలు తెచ్చిన తెలంగాణ చిన్నారులు ఎవరు?
జ: పెండెం చందన (10) (మంచిర్యాల), మైత్రి (13) (హైదరాబాద్ )

జాతీయం
08) సిక్కింలో తొలి ఎయిర్ పోర్ట్ ని పాక్యోంగ్ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అయితే దీంతో దేశంలో ఎయిర్ పోర్టుల సంఖ్య ఎంతకు చేరుకుంది ?
జ: 100కి
09) భారత సైన్యాధిపతి ఎవరు
జ: జనరల్ బిపిన్ రావత్
10) జైలు సంస్కరణలపై పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది ?
జ: మాజీ న్యాయమూర్తి జస్టిస్ అమితవ రాయ్
11) రెండేళ్ళ క్రితం పాక్ ఆక్రమిత కశ్మీర్ లో మెరుపుదాడుల్లో పాల్గొన్న జవాన్, తాంగ్దర్ సెక్టార్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయారు. ఆయన పేరేంటి ?
జ: లాన్స్ నాయక్ సందీప్ సింగ్
12) ఈ ఆర్థిక సంవత్సరంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మొత్తం ఎంత ?
జ: 1 బిలియన్ డాలర్లు ( రూ.7వేల కోట్లు )
( ఈ శాఖ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ )
13) అంగారక కక్ష్యలోకి ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) నాలుగేళ్ళు పూర్తిచేసుకుంది. మామ్ ను ఇస్రో ఎప్పుడు ప్రయోగించింది. ఎప్పుడు అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది ?
జ: ప్రయోగం: 2013 నవంబర్ 5, కక్ష్యలోకి: 2014 సెప్టెంబర్ 24న
14) సంపన్న భారతీయుల జాబితాలో మొదటిస్థానంలో ఉన్న వ్యాపారవేత్త, బిలియనీర్ ఎవరు ?
జ: ముకేశ్ అంబానీ ( బార్ క్లేస్ హురున్ ఇండియా లిస్ట్ లో )(రూ.3.71లక్షల కోట్లు )
15) ఉజ్వల భవిత కలిగిన శక్తిమంత సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ ఇండియా ఏ పేరుతో రూపొందించింది?
జ: టైకూన్స్ ఆఫ్ టుమారో
16) టైకూన్స్ ఆఫ్ టుమారోలో చోటు సంపాదించుకున్న క్రీడాకారిణి ఎవరు ?
జ: పీవీ సింధూ
17) రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకున్న క్రీడాకారులు ఎవరు ?
జ: విరాట్ కోహ్లీ, మీరా బాయి చాను
18) దీర్ఘకాలిక అనారోగ్యంతో ఢిల్లీలో తుది శ్వాస విడిచిన ఆల్ ఇండియా రేడియో వ్యాఖ్యాత ఎవరు ?
జ: జన్ దేవ్ సింగ్
19) రెండేళ్ళ క్రితం వన్డే క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోనీ తిరిగి దుబాయ్ లో ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇది మ్యాచ్ కెప్టెన్ గా ఎన్నోది ?
జ: 200 వ మ్యాచ్

అంతర్జాతీయం
20) మాల్దీవుల అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
జ: ఇబ్రహీం మొహమెద్ సోలిహ్ (ఇబు)
21) మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు?
జ: అబ్దుల్లా యమీన్
22) ఐక్యరాజ్యసమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు ?
జ: యాంటోనియో గుటెరెస్

పంచాయతీ సెక్రటరీలకు మాక్ టెస్టులు +5 గ్రాండ్ టెస్టులు (TM) సెకండ్ పేపర్ పై ప్రత్యేక శ్రద్ధ

పూర్తి వివరాలకు కింది లింక్ క్లిక్ చేయండి :

https://telanganaexams.com/gp-secy-mock/