Friday, February 28

CURRENT AFFAIRS – SEPT 24

రాష్ట్రీయం
01) అమీర్ పేట నుంచి ఎల్బీ నగర్ వరకూ మెట్రో రైలు మార్గాన్ని ఇవాళ మధ్యాహ్నం 12.15 గంటలకు గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నారు. ఈ రూట్ లో ఎన్ని కిలోమీటర్ల మార్గం కవర్ అవుతుంది ?
జ: 16 కి.మీ.
02) మెట్రో రైలు ఎండి ఎవరు ?
జ: NVS రెడ్డి
03) మై జర్నీ అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఇది ఎవరి రాజకీయ సామాజాకి జీవితం ఆధారంగా రాసిన పుస్తకం ?
జ: టీడీపీ నేత దేవేందర్ గౌడ్
04) రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ కి ప్రభుత్వం ప్రతియేటా ఎంత మొత్తం నిధులు కేటాయిస్తోంది ?
జ: రూ.700 కోట్లకు పైగా
(నోట్: ఆయుష్మాన్ భారత్ కింద కేంద్రం రూ.280 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది )

జాతీయం
05) దేశంలో 50 కోట్ల మందికి ఆరోగ్య బీమా కల్పించేందుకు ఉద్దేశించిన ఆయుష్మాన్ బారత్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు ?
జ: జార్ఖండ్ లోని రాంచీ దగ్గర
( జనరల్ నాలెడ్జ్ లో వివరంగా ఇచ్చాం )
06) ఈశాన్య రాష్ట్రాల్లోనే మొదటిసారిగా ఎక్కడ విమానాశ్రయాన్ని ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు ?
జ: గ్యాంగ్ టక్ కి 33 కిమీ దూరంలోని పాక్యాంగ్ లో (రూ.605 కోట్ల వ్యయంతో నిర్మించారు)
07) శత్రు క్షిపణులను మార్గ మధ్యంలోనే కూల్చేసే రెండంచెల బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవ్థ (BMD) ని ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి 2018 సెప్టెంబర్ 23న విజయవంతంగా ప్రయోగించారు. దాని పేరేంటి ?
జ: పృథ్వి డిఫెన్స్ వెహికిల్ (PDA)
(నోట్: వాతావరణానికి 50 కిమీ ఎత్తులో శత్రు క్షిపణులను కూల్చేస్తుంది )
08) ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో ఏ విమానానికి 16వ స్థానం దక్కింది ?
జ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (6.34 కోట్ల మంది ప్రయాణీకులు)
09) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) ఛైర్మన్ ఎవరు ?
జ: రజనీశ్ కుమార్
10) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను కూడా విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో RRB లు ఎన్ని ఉన్నాయి ?
జ: 56 ( 36కు కుదించాలని భావిస్తున్నారు )
11) మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ ప్రాజెక్టుకు సంబంధించి ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్ భావిస్తోంది ?
జ: రష్యాతో (గతంలోనే ఫ్రాన్స్ తో అగ్రిమెంట్ కుదుర్చుకుంది )
12) రష్యాకి చెందిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ వ్యవస్థ పేరేంటి ?
జ: గ్లోనాస్
13) దేశంలో 5G టెలికం సేవలు ప్రారంభించేందుకు ఏయే సంస్థలతో BSNL ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: జపాన్ కి చెందిన సాఫ్ట్ బ్యాంక్, NTT కమ్యూనికేషన్స్ తో

అంతర్జాతీయం
14) నూలు వడికే రాట్నం ప్రాముఖ్యాన్ని వివరిస్తూ మహాత్మాగాంధీ గుజరాతీలో యశ్వంత్ ప్రసాద్ అనే వ్యక్తికి రాసిన ఉత్తరం బోస్టన్ లో వేలం వేశారు. దీని ధర ఎంత పలికింది ?
జ: రూ.4.57 లక్షలు
15) వరల్డ్ ఎయిర్ పోర్ట్ ట్రాఫిక్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన ఎయిర్ పోర్ట్ ఏది ?
జ: అమెరికాలోని అట్లాంటా హార్ట్స్ ఫీల్డ్ - జాక్సన్ విమానాశ్రయం ( 10.39 కోట్ల మంది ప్రయాణీకులు )

పంచాయతీ సెక్రటరీలకు మాక్ టెస్టులు +5గ్రాండ్ టెస్టులు (TM) సెకండ్ పేపర్ పై ప్రత్యేక శ్రద్ధ

పూర్తి వివరాలకు కింది లింక్ క్లిక్ చేయండి :

https://telanganaexams.com/gp-secy-mock/