Wednesday, February 26

CURRENT AFFAIRS – SEPT 23

రాష్ట్రీయం
01) ఖరీఫ్ పంటను కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో 3,140 కొనుగోలు కేంద్రాలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కేంద్రం మద్దతు ధర కింద ఏ గ్రేడ్ ధాన్యంనకు క్వింటాకి ఎంత మొత్తాన్ని చెల్లించనున్నారు ?
జ: రూ.1,770
02) రాష్ట్ర పారిశ్రామిక మౌళిక సదుపాయాల సంస్థ ( TSIIC) ఛైర్మన్ ఎవరు ?
జ: గ్యాదరి బాలమల్లు
03) రాష్ట్రంలో మరో కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవి ఏంటి
జ: భద్రాచలం, ఆసిఫాబాద్, సారపాక
04) విష్ణు కుండినుల కాలం నాటి శివాలయం గుండం, నివాస నిర్మాణాల జాడలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఎక్కడ వెలుగులోకి తెచ్చింది ?
జ: మెదక్ జిల్లా టేక్మల్ మండలం వేలుపుగొండ
05) రేణ, మాయని దర్వాజ, ఆమె లాంటి పుస్తకాల్లో తెలంగాణ పల్లెపదాలను , సామెతలను అక్షీకరించిన తెలంగాణ రచయిత చనిపోయారు. ఆయన ఎవరు ?
జ: చైతన్య ప్రకాశ్

జాతీయం
06) ఒడిశాలోని తాల్చేర్ లో 13వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ఎరువుల కర్మాగారాన్ని ఎవరు ప్రారంభించారు ?
జ: ప్రధాని నరేంద్ర మోడీ
07) ఝార్సుగూడలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన విమానాశ్రయం ఏది
జ: వీర్ సురేంద్ర సాయ్
08) జార్ఖండ్ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ యోజన కింద వైద్య సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఇన్సూరెన్స్ సంస్థ ఏది ?
జ: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
09) డ్రోన్ తయారీ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణయించింది ?
జ: ఆంధ్రప్రదేశ్
10) కమ్యూనిస్ట్ లీడర్ కొండపల్లి కోటేశ్వరమ్మ జీవిత చరిత్ర పేరేంటి ?
జ: నిర్జన వారధి
( నోట్: ఏపీలోని విశాఖలో 19 సెప్టెంబర్ 2018 నాడు చనిపోయారు )
11) ఇటీవల DRDO ప్రయోగించిన స్వదేశీ స్వల్పకాలిక బాలిస్టిక్ క్షిపణి ప్రహార్ ఎన్ని కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను చేధించగలదు ?
జ: 150 కిమీ.
12) బీమా రంగంలోకి ప్రవేశించేందుకు ఏ సంస్థతో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: బజాజ్ అలియంజ్ లైఫ్ ఇన్సూరెన్స్
13) మెక్సికో దేశ అత్యున్నత పౌర పురస్కారం సివిలియన్ హానర్ ఆఫ్ మెక్సికో ఎవరికి ప్రదానం చేశారు ?
జ: రఘుపతి సింఘానియా
(నోట్: జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ , ఎండీ )
14) 2018 సెప్టెంబర్ 22 నాడు నరోపా ఫెస్టివల్ లో భాగంగా అతి పెద్ద లడఖీ డ్యాన్స్ తో గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కిన ఉత్సవం ఎక్కడ జరిగింది ?
జ: లడఖ్, జమ్ము కశ్మీర్
15) 91వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో భారత్ నుంచి ప్రదర్శించే సినిమా ఏది ?
జ: విలేజ్ రాక్ స్టార్స్
( జీకే లో వివరంగా ఇచ్చాం)
16) మానవ రహిత అంతరిక్ష ప్రయోగం గగన్ యాన్ కోసం ఇస్రో ఎక్కడ మూడో లాంఛ్ ప్యాడ్ ను నిర్మిస్తోంది ?
జ: శ్రీహరి కోట, ఆంధ్రప్రదేశ్

అంతర్జాతీయం
17) ఇటీవల వార్తల్లోకి వచ్చిన దంబుల్లా వేర్ హౌస్ ఎక్కడ ఉంది ?
జ: శ్రీలంక
18) 2018 అక్టోబర్ 13నాడు మహా బిజ్ 2018 పేరుతో ఇంటర్నేషనల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరగనుంది ?
జ: దుబాయ్
19) ప్రపంచ క్యాన్సర్ ఫ్రీ డే లేదా వరల్డ్ రోజ్ డే ని ఎప్పుడు నిర్వహిస్తారు
జ: సెప్టెంబర్ 22

పంచాయతీ సెక్రటరీలకు మాక్ టెస్టులు +5గ్రాండ్ టెస్టులు (TM)

https://telanganaexams.com/gp-secy-mock/