Monday, September 23

CURRENT AFFAIRS – SEPT 21

రాష్ట్రీయం
01) రాష్ట్రంలో మూడు కొత్త రహదారులకు కేంద్ర ఆమోదం తెలిపింది. అవి ఏవి
జ: 1) హైదరాబాద్ నుంచి కొత్తగూడెం - 234 కిమీ
2) మెదక్ నుంచి రుద్రూరు - 9115 కిమీ
3) బోధన్ నుంచి భైంసా - 54 కిమీ
02) వాల్మీకి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఉత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
జ: ఆశ్వయుజ పౌర్ణమి రోజున
03) హైదరాబాద్ శివారుల్లోని కొల్లూరులో ప్రొడక్ట్ ఇంజనీరింగ్, రీసెర్చ్, డెవలప్ మెంట్, ఐటీ, ఐటీ అనుబంధ కార్యకలాపాలకు 20 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రమఖ ఆటో మొబైల్ కంపెనీ ఏది ?
జ: హ్యూందాయ్ మొబీస్

జాతీయం
04) దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో సర్జికల్ స్ట్రైక్స్ డే ని ఎప్పుడు నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశాలిచ్చింది ?
జ: సెప్టెంబర్ 29న
05) చిన్న మొత్తాల పొదుపుపై కేంద్ర ప్రభుత్వం ఎంత శాతం వడ్డీ పెంచాలని నిర్ణయించింది ?
జ: 0.4%
06) స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి భారత్ ప్రయోగించిది. దాని పేరేంటి ?
జ: ప్రహార్
07) స్వదేశీ తయారీ స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రహార్ ను ఎక్కడ నుంచి ప్రయోగించారు ?
జ: ఒడిశాలోని చాందీపూర్ ITR నుంచి
08) భారత్ కోసం ఫ్రాన్స్ కంపెనీ డస్సాల్ ఏవియేషన్ తయారు చేసిన మొదటి రాఫెల్ ఫైటర్ జెట్ ను ఎవరు నడిపారు ?
జ: IAF డిప్యూటీ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ రఘునాథ్ నంబియార్
09) ఫ్రాన్స్ నుంచి రాఫెల్ ఫైటర్ జెట్ల సరఫరా 2019 నుంచి మొదలవుతుంది. అయితే మొత్తం ఎన్ని జెట్స్ సరఫరా అవుతాయి ?
జ: 36 - రూ.58 వేల కోట్లు
10) ఎయిర్ ఇండియా లిమిటెడ్ బోర్డు ( AIL) అనధికార స్వతంత్ర డైరక్టర్ గా ఎవరిని క్యాబినెట్ అపాయింట్ మెంట్స్ కమిటీ నియమించింది.
జ: డి.పురంధేశ్వరి
11) పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండ తుపానుగా మారుతోంది. దీనికి ఏమని పేరుపెట్టారు ?
జ: దయె
12) దయె తుఫానుకి ఆ పేరు పెట్టిన దేశం ఏది ?
జ: మయన్మార్

అంతర్జాతీయం
13) ప్రపంచంలో ఎంతమంది పేదరికంలో ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది ?
జ: 130 కోట్ల మంది
( జీకెలో వివరాలు ఉన్నాయి. చూడగలరు )
14) జపాన్ లో ప్రధాని షింజో అబే మరో 3యేళ్ళ ప్రధానిగా కొనసాగే అవకాశం కలిగింది. ఇప్పటికి 3 సార్లు ఆయన ఈ పదవికి ఎన్నికయ్యారు. షింజో అబే పార్టీ ఏది ?
జ: లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ (2021 వరకూ ఈ పదవిలో కొనసాగుతారు )

పంచాయతీ సెక్రటరీలకు మాక్ టెస్టులు +5గ్రాండ్ టెస్టులు (TM)

https://telanganaexams.com/gp-secy-mock/