Sunday, February 23

CURRENT AFFAIRS – SEPT 20

రాష్ట్రీయం
01) ఎల్బీ నగర్ టు అమీర్ పేట మెట్రో రైల్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది ?
జ: 2018 సెప్టెంబర్ 24 నుంచి (గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నారు )
02) ప్రాపర్టీ కన్సల్టెంట్ కోలియర్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్వహించిన సర్వేలో టెక్నాలజీ కార్యకలాపాలు ప్రారంభించడానికి, విస్తరించడానికి ఆసియాలో హైదరాబాద్ కి ఏ స్థానం లభించింది
జ: 7వ స్థానం

జాతీయం
03) ముస్లిం మహిళలకు తక్షణం విడాకులు ఇచ్చేందుకు వీలున్న ట్రిపుల్ తలాక్ పద్దతిని నేరంగా పరిగణిస్తూ కేంద్ర కేబినెట్ ఆర్టినెన్స్ చేసింది. దీని ప్రకారం ట్రిపుల్ తలాక్ చెబితే ఎన్నేళ్ళు జైలు శిక్ష పడనుంది ?
జ: మూడేళ్ళు
04) భారత్ - రుమేనియా ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 70యేళ్ళయిన సందర్భంగా ఆ దేశంలో పర్యటిస్తున్న భారత్ ప్రముఖుడు ఎవరు ?
జ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
05) రాష్ట్ర మాతగా ఆవుని గుర్తిస్తూ ఏ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు ?
జ: ఉత్తరాఖండ్
06) భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్ బోర్డులో ఎవరిని నియమించారు ?
జ: డాక్టర్ సుబ్రహ్మణ్య జైశంకర్ ( మాజీ విదేశాంగ కార్యదర్శి)
07) ఏ దేశ సరిహద్దుల్లో స్మార్ట్ కంచెను భారత్ నిర్మిస్తోంది ?
జ: పాకిస్తాన్ సరిహద్దుల్లో
08) పరిశ్రమల్లో కాలుష్యాన్ని చెక్ చేసేందుకు స్టార్ రేటింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది ?
జ: ఒడిషా
09) కాశి : సీక్రెట్ ఆఫ్ ది బ్లాక్ టెంపుల్ - పుస్తక రచయిత ఎవరు ?
జ: వినీత్ బాజ్ పాయ్
10) టెక్నాలజీ కార్యకలాపాలు ప్రారంభించడానికి, విస్తరించడానికి ఆసియాలోనే అత్యుత్తమ నగరంగా ఏది నిలిచింది ?
జ: బెంగళూరు ( ప్రాపర్టీ కన్సల్టెంట్ కోలియర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. )
11) ఇటీవల ప్రారంభించిన ఈ-సహజ్ పోర్టల్ దేనికి సంబంధించినది ?
జ: Security clearance to businesses
12) ఆదిత్య బిర్లా రిటైల్ కి చెందిన మోర్ సూపర్ మార్కెట్ చెయిన్ లో రూ.4,200 కోట్లు పెట్టుబడి పెట్టిన ప్రపంచ ఆన్ లైన్ రిటైల్ సంస్థ ఏది ?
జ: అమెజాన్
13) స్వయంగ్ సిద్ధ పేరుతో మానవ అక్రమ రవాణాపై యుద్దం మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: పశ్చిమబెంగాల్
14) వ్యవసాయంలో సంస్కరణలు తెచ్చేందుకు ఏ సంస్థతో కలసి గ్రీన్ అగ్రికల్చర్ ప్రాజెక్టును భారత్ చేపట్టనుంది ?
జ: FAO ( Food and Agriculture Organization )
15) స్కిల్ ఇండియా క్యాంపెయిన్ పై సంతకం చేసిన నటీ నటులు ఎవరు?
జ: అనుష్క శర్మ, వరుణ్ ధావన్
16) ఇస్రో తన మొదటి స్పేస్ టెక్నాలజీ ఇంక్యూబేషన్ సెంటర్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది ?
జ: త్రిపుర
17) భారత మొదటి మహిళా ఐఏఎస్ అధికారి ఇటీవల చనిపోయారు. ఆమె పేరేంటి ?
జ: అన్నా రాజం మల్హోత్రా
18) అటమిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: కమలేష్ నీల్ కాంత్ వ్యాస్
19) 2018 అక్టోబర్ 6న మొదలయ్యే ప్రతిష్టాత్మక సుల్తాన్ జొహర్ కంప్ జూనియర్ హాకీలో భారత్ జట్టు పాల్గొంటోంది. ఈ పోటీలను ఏ దేశం నిర్వహిస్తుంది.
జ: మలేషియా

అంతర్జాతీయం
20) అవినీతి కేసులో అరెస్టయిన మలేసియా మాజీ ప్రధాని ఎవరు ?
జ: నజీబ్ రజాక్
21) సెప్టెంబర్ 16 న నిర్వహించిన 2018 ఇంటర్నేషన్ డే ఫర్ ది ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఓజోన్ లేయర్ యొక్క థీమ్ ఏంటి ?
జ: Keep Cool and Carry on : The Montreal Protocol
22) మౌంట్ ఎవరెస్ట్ ఫ్రెండ్షిప్ ఎక్సర్ సైజెస్ పేరుతో సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న దేశాలు ఏవి ?
జ: నేపాల్, చైనా
23) 2018 ట్రాక్ ఆసియా కప్ సైక్లింగ్ టోర్నమెంట్ ఏ దేశంలో జరగనుంది ?
జ: భారత్

పంచాయతీ సెక్రటరీలకు మాక్ టెస్టులు +5గ్రాండ్ టెస్టులు (TM)

https://telanganaexams.com/gp-secy-mock/