Wednesday, June 19

CURRENT AFFAIRS – OCT 7

రాష్ట్రీయం
01) తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు ఎప్పుడు ఎన్నికలు జరగనున్నాయి ?
జ: డిసెంబర్ 7న ( ఫలితాలు డిసెంబర్ 11న )
02) తెలంగాణ రాష్ట్ర నూతన ఆవిష్కరణల కేంద్రం ( TSIC) కింద ఎన్ని స్టార్టప్ లను ఎంపిక చేశారు ?
జ: 10
03) ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం క్వాల్కామ్ రూ.3వేల కోట్ల పెట్టుబడితో తమ ఉత్పత్తుల అభివృద్ధి కేంద్రాన్ని రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయనుంది ?
జ: కోకాపేటలో
04) కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన పోషణ్ అభియాన్ అవార్డులు ఏ జిల్లాకు ఎక్కువగా దక్కాయి ?
జ: ఆదిలాబాద్ జిల్లా

జాతీయం
05) ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆ రాష్ట్రాలు ఏవి ?
జ: రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్ గఢ్, తెలంగాణ
06) ఏయే రాష్ట్రాల్లో ఎన్నెన్ని అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి ?
జ: రాజస్థాన్ : 200
మధ్యప్రదేశ్ : 230
మిజోరం : 40
ఛత్తీస్ గఢ్ 90
తెలంగాణ : 119
07) తొలి రెండు దశల్లో ఎక్కడ ఎన్నికలు జరగనున్నాయి ?
జ: ఛత్తీస్ గఢ్ ( నవంబర్ 11, 20 )
08) మూడో దశలో ఎక్కడ ఎన్నికలు జరుగుతాయి ?
జ: మధ్యప్రదేశ్, మిజోరం ( నవంబర్ 28 )
09) నాలుగో దశలో ఎక్కడెక్కడ ఎన్నికలు జరుగుతాయి ?
జ: రాజస్థాన్, తెలంగాణ ( డిసెంబర్ 7 )
10) కేంద్ర ప్రభుత్వ ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ - ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య అభియాన్ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?
జ: 2018 సెప్టెంబర్ 23
11) ఆయుష్మాన్ భారత్ కింద దేశంలోని 10.74 కోట్ల మందికి ఏడాదికి ఎంత మొత్తం ఆరోగ్య బీమా కల్పించనున్నారు ?
జ: రూ.5 లక్షలు
12) అణ్వాయుధాలను మోసుకెళ్ళ గలిగే దేశీయ క్షిపణి పృథ్వీ-2 ని రాత్రివేళ కూడా విజయవంతంగా ఎక్కడ ప్రయోగించారు ?
జ: ఒడిశాలోని చాందీపూర్ లో (350 కిమీ దూరంలోని లక్ష్యాలను ఛేదించింది)
13) 2018 అక్టోబర్ 7 నుంచి ప్రో కబడ్డీ లీగ్ సీజన్ - 6 ప్రారంభమైంది. మొత్తం ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి ?
జ: 12 జట్లు

అంతర్జాతీయం
14) ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో ఎన్ని కొత్త పదాలను చేర్చారు
జ: 1400
15) అంతర్జాతీయ నేర పోలీస్ విభాగం ( ఇంటర్ పోల్ ) అధ్యక్షుడిని చైనా నిర్భంధించింది. ఆయన పేరేంటి ?
జ: మెంగ్ హంగ్ వెయ్