Saturday, March 23

CURRENT AFFAIRS – OCT 6

రాష్ట్రీయం
01) హైదరాబాద్ లో జరిగిన ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆర్గాన్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ 29వ వార్షికోత్సవానికి ఎవరు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ?
జ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
02) సుద్దాల హన్మంతు జానకమ్మల జాతీయ పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు ?
జ: ప్రజాకవి జయరాజ్
03) దేశంలోనే మొదటిసారిగా మానవ వ్యర్థాలను ఆధునిక పద్దతుల్లో శుద్ధి చేసి నీటిని ఉత్పత్తి చేసే ఫీకల్ సెప్టెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జ: వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం అమ్మవారిపేటలో

జాతీయం
04) రష్యా నుంచి ఏ అధునాతన గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: S-400 ట్రయంఫ్ (రూ.36.9 వేల కోట్లు )
( జనరల్ నాలెడ్జ్ లో ప్రత్యేకంగా ఇచ్చాం. చూడగలరు )
05) 2022లో భారత్ చేపట్టే మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ కు సాంకేతిక సహకారం అందించేందుకు ముందుకొచ్చిన దేశం ఏది ?
జ: రష్యా
06) భారత్ - రష్యా మధ్య 19వ ద్వైపాక్షిక వార్షిక సమావేశం జరిగాక అంతరిక్షం, రైల్వేలు, అణుశక్తి, విద్య, ఎరువులు తదితర రంగాల్లో ఎన్ని ఒప్పందాలు కుదిరాయి ?
జ: 8 ఒప్పందాలు
07) ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ( IISF 2018) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలను ఎవరు ప్రారంభించారు ?
జ: కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్
08) ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (PBL) లో ప్రస్తుతం 8 జట్లు ఉన్నాయి. కొత్తగా ఏ జట్టు జాయిన్ అవుతోంది ?
జ: పుణే సెవన్ ఏసెస్

అంతర్జాతీయం
09) లైంగిక హింసపై పోరాటానికి గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతికి ఎవరు ఎంపికయ్యారు ?
జ: కాంగో డాక్టర్ మక్వీజ్, ఇరాక్ యువతి నాదియా
10) ఇరాక్ లో ఐసిస్ ఉగ్రవాదులతో ఇబ్బందులు పడుతున్న యాజిదీల దయనీయ స్థితిని వివరిస్తూ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నాదియా రాసిన పుస్తకం ఏది ?
జ: ది లాస్ట్ గర్ల్