Monday, September 23

CURRENT AFFAIRS – OCT 25

రాష్ట్రీయం
01) ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఎప్పటి నుంచి గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2018 జరగనుంది ?
జ: 2018 నవంబర్ 1 నుంచి మూడు రోజుల పాటు
02) ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనా జస్టిస్ రమేశ్ రంగనాధన్ అంతకుముందు తెలంగాణ, ఏపీ ఉమ్మడి హైకోర్టుకు ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ప్రధానన్యాయమూర్తిగా పనిచేశారు ?
జ: జులై 30, 2016 నుంచి జులై 6, 2018 వరకూ
03) నవంబర్ 2 నుంచి 4 వరకూ హైదరాబాద్ ట్రెడా ప్రాపర్టీ షో జరుగుతోంది. ట్రెడా అంటే ?
జ: తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా)
04) హైదరాబాద్ లోని రక్షణ పరిశోధనా అభివృద్ధి ప్రయోగశాల ( DRDL) డైరక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ దశరథ్ రామ్

జాతీయం
05) 2018 సంవత్సరానికి సియోల్ శాంతి పురస్కారం ఏ భారతీయ నేతకి లభించింది ?
జ: ప్రధాని నరేంద్ర మోడీ
06) సీబీఐకి తాత్కాలిక డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: మన్నెం నాగేశ్వరరావు
07) ఘర్షణ పడుతున్న ఎవర్ని కేంద్ర ప్రభుత్వం సెలవులపై పంపింది ?
జ: అలోక్ వర్మ, ఆస్థానా
08) దేశంలో 5 హైకోర్టులకు కొత్తగా ప్రధాన న్యాయమూర్తుల నియామకం జరిగింది. ఎక్కడెక్కడ ?
జ: బొంబాయి - జస్టిస్ ఎన్.హెచ్ పాటిల్
కోల్ కతా - జస్టిస్ డి.కె.గుప్తా
గువాహటి - జస్టిస్ ఎ.ఎస్ బొపన్న
ఉత్తరాఖండ్ - జస్టిస్ రమేశ్ రంగనాధన్
సిక్కిం - జస్టిస్ విజయ్ కుమార్ బిస్త్
09) సమాజసేవ చేస్తున్న కార్పొరేట్ సంస్థలు, వాలంటీర్లను కలుపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్, వెబ్ పోర్టల్ ఏది ?
జ: సెల్ఫ్ ఫర్ సొసైటీ
(నోట్: ఈ పోర్టల్, యాప్ ను ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు )
10) ఆఫీసుల్లో లైంగిక వేధింపులను కట్టడి చేసేదుకు నిబంధనావళిని రూపొందించేందుకు ఏర్పాటైన మంత్రుల బృందానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ?
జ: కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్
11) శాంతా బయోటెక్స్ తయారు చేసిన పోలియో వ్యాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందస్తు అనుమతి ఇచ్చింది. ఆ వ్యాక్సిన్ పేరేంటి ?
జ: శాన్ ఐపీవీ
12) దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచి భారత్ స్టేజ్ -IV ( BS-IV) వెహికిల్స్ మాత్రమే అమ్మాలని వాహన తయారీదారులకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది ?
జ: 2020 ఏప్రిల్ 1 నుంచి
13) బడికి వెళ్ళే పిల్లల భద్రతను పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన ఏ యాప్ ను బెంగళూరులో ఆవిష్కరించారు ?
జ: స్మార్ట్ పికప్
14) ఇజ్రాయెల్ నుంచి రూ.5,683 కోట్లతో భారత్ కొనుగోలు చేస్తున్న అధునాతన క్షిపణి వ్యవస్థ ఏది ?
జ: బరాక్ -8
15)విశాఖపట్నంలో వెస్టిండీస్ తో జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్ తో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 10 వేల పరుగులు పూర్తి చేశాడు. ఎన్ని ఇన్నింగ్స్ లో ఈ రికార్డు సాధించాడు ?
జ: 205 ఇన్నింగ్స్ లో
16) వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా 10వేల పరుగుల మైలురాయి చేరుకున్న క్రికెటర్ ఎవరు ?
జ: విరాట్ కోహ్లీ
(నోట్: గతంలో సచిన్ 259 ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించాడు.)

అంతర్జాతీయం
17) అమెరికా ఆరోగ్య రక్షణ రంగంలో మార్పుల కోసం కృషి చేస్తున్న హెల్త్ కేర్ 50 ప్రతిభాశీలురులో చోటు దక్కించుకున్న ముగ్గురు భారతీయ అమెరికన్లు ఎవరు ? (ప్రఖ్యాత టైమ్స్ మేగజైన్ ఈ జాబితాని రూపొందించింది )
జ: దివ్యానాగ్, రాజ్ పంజాబీ, గవాండే
18) టైమ్స్ మేగజైన్ రూపొందించిన హెల్త్ కేర్ 50లో చోటు పొందిన NRI దివ్యానాగ్ ఏ అంశంపై పరిశోధనలు చేస్తున్నారు ?
జ: వైద్యులు, పరిశోధనలకు ఉపయోగపడే యాపిల్ వాచ్ సిరీస్-4లో యాప్ ను రూపొందించారు
19) హెల్త్ కేర్ 50లో చోటు పొందిన NRI రాజ్ పంజాబీ దేనిపై పరిశోధనలు చేస్తున్నారు ?
జ: వైద్య సదుపాయం లేని ప్రాంతాల్లో ఆరోగ్య రక్షణ కార్యకర్తలకు శిక్షణ అందించే టెక్నాలజీ
20) హెల్త్ కేర్ 50లో చోటు సంపాదించిన NRI గవాండే ఏ అంశంపై పరిశోధనలు చేస్తున్నారు ?
జ: తక్కువ ఖర్చుతో కార్పొరేట్ ఆరోగ్యసేవలు అందించడం

PC/SI -Mains-100మాక్ + 10 గ్రాండ్ టెస్టులు

మెయిన్స్ కి Statements మోడల్ లో కొత్తవి రెడీ చేస్తున్నాం

అక్టోబర్ 31లోపు ఫీజులు చెల్లిస్తే 200 మాక్ టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/