Saturday, April 20

CURRENT AFFAIRS – NOV 25 & 26

తెలంగాణ
01) తెలంగాణ రాష్ట్ర తొలి బార్ కౌన్సిల్ ఛైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: ఎ.నరసింహారెడ్డి
02) లోక్ నాయక్ ఫౌండేషన్ సాహితీ పురస్కారం ఈ ఏడాదికి ఎవరికి లభించింది ?
జ: అంపశయ్య నవీన్

జాతీయం
03) కర్ణాటకలోని బెంగళూరులో చనిపోయిన కన్నడ నటుడు అంరీశ్ మొదటిసారి ఎప్పుడు లోక్ సభలో ఎంపీగా అడుగుపెట్టారు ?
జ: 12వ లోక్ సభలో
04) ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ విమానాశ్రయానాకి ఎవరి పేరు పెట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి
05) ఇండిగో విమానాలను నిర్వహించే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఛైర్మన్ కన్నుమూశారు. ఆయన పేరేంటి ?
జ: దేవదాస్ మల్యా
06) బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, చెత్త వేసినా లక్ష వరకూ జరిమానా విధించేందుకు ఏ మున్సిపాలిటీలో చట్టాన్ని సవరించారు ?
జ: కోల్ కతా నగర పాలక సంస్థ
07) ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో 48 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన మహిళా బాక్సర్ ఎవరు ?
జ: మేరీ కోమ్
08 మేరీ కోమ్ ఇప్పటిదాకా 6 స్వర్ణాలు సాధించింది. మొదటగా ఆమెకు ఏ ఏడాదిలో స్వర్ణ పతకం లభించింది ?
జ: 2005లో
09) ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్ లో భారత్ స్టార్ దీప కర్మాకర్ కి ఏ అవార్డు దక్కింది ?
జ: కాంస్యం
10) ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఎలెవన్ కెప్టెన్ గా ఎవరు ఎంపికయ్యారు ?
జ: భారత బ్యాటింగ్ స్టార్ హర్మన్ ప్రీత్ కౌర్
11) ఢిల్లీ తెలుగు అకాడమీ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డును ఎవరికి ప్రదానం చేసింది ?
జ: నటుడు రాజేంద్ర ప్రసాద్
12) DTA 30 వార్షికోత్సవం సందర్భంగా ప్రతిభా పురస్కారం అందుకున్న నటుడు ఎవరు ?
జ: ఆలీ

అంతర్జాతీయం
13) అత్యంత విలువైన అమెరికా కంపెనీగా ఏ సంస్థ నిలిచింది ?
జ: మైక్రో సాఫ్ట్
14) మైక్రో సాఫ్ట్ ప్రస్తుత మార్కెట్ విలువ ఎంత ?
జ: 75,330 కోట్ల డాలర్లు
15) ఆయిల్ పై ట్యాక్సులను వ్యతిరేకిస్తూ ఏ దేశంలో భారగా నిరసన ప్రదర్శనలు జరిగాయి ?
జ: ఫ్రాన్స్