Saturday, August 17

CURRENT AFFAIRS – NOV 24

తెలంగాణ
01) ప్రపంచ జలమండలి బోర్డు గవర్నర్ పదవికి పోటీపడుతున్న తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఎవరు ?
జ: వి.ప్రకాశ్
02) ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ నిర్వహించిన సదస్సులు రైతు బంధు పథకంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినది ఎవరు ?
జ: వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి

జాతీయం
03) భారత్ పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరల్లో నిర్మిస్తున్న నడవా పేరేంటి ?
జ: కర్తార్ పుర్ సాహిబ్ నడవా
04) కర్తార్ పుర్ సాహిబ్ నడవాకి భారత్ లో ఎవరు శంకుస్థాపన చేస్తున్నారు ?
జ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (ఈనెల 26న)
05) హిందూస్తానీ శాస్త్రీయ సంగీత స్రష్ట, సితార్, సుర్ బహార్ (బాస్ సితార్) వాదనంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖుడు ఢిల్లీలో మరణించారు. ఆయన ఎవరు ?
జ: ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్
06) మహిళా ఓటర్లు ఓట్లు వేయడానికి ఏ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంగ్వారీ పేరుతో పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేసింది ?
జ: చత్తీస్ గఢ్
07) వర్షాలు కురిసినప్పుడు నదులు, రిజర్వాయర్లలో పెరిగే నీటి పరిమాణాన్ని కచ్చితంగా లెక్కించడానికి భారత వాతావరణ శాఖ ప్రవేశపెట్టిన వ్యవస్థ ఏది ?
జ: ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్ క్యాస్టింగ్ అప్రోచ్
08) ప్రస్తుతం భారత వాతావరణశాఖ (IMD) చీఫ్ ఎవరు ?
జ: కె.జె.రాజేశ్
09) మహిళా సాధికారతన కోసం నారీ శశక్తీకరణ సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ?
జ: ఉత్తరప్రదేశ్
10) భారత జీవిత బీమా సంస్థ (LIC) ప్రీమియంలను ఆన్ లైన్ చెల్లించడానికి అనుమతిస్తూ ఏ సంస్థతో ఒప్పంద కుదుర్చుకుంది ?
జ: పేటీఎం
11) భారత జీవిత బీమా సంస్థ (LIC) ఛైర్మన్ ఎవరు. హెడ్డాఫీస్ ఎక్కడ ఉంది ?
జ: వి.కె శర్మ ( ముంబై )
12) పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నందుకు ఇంటర్నేషనల్ గ్రీన్ ఆపిల్ అవార్డు లో సిల్వర్ విభాగంలో గెలుచుకున్న భారతీయ సంస్థ ఏది ?
జ: మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
13) పాలల్లో కల్తీని కనిపెట్టేందుకు స్మార్ట్ ఫోన్ బేస్డ్ సిస్టమ్ ను అభివృద్ధి చేసిన విద్యా సంస్థ ఏది ?
జ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్

అంతర్జాతీయం
14) 11వ ఆసియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది ?
జ: కువైట్ సిటీ
15) United Nationsl Environment Program (UNEP) కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: జోస్ మ్యూసుయా (టాంజానియా)
16) United Nationsl Environment Program (UNEP) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
జ: నైరోబీ, కెన్యా

PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు
ప్రారంభం అయ్యాయి.  ఫీజు చెల్లిస్తే 200టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/

Friends,
తెలంగాణ ఎగ్జామ్స్ నుంచి యూట్యూబ్ ఛానెల్స్ ఓపెన్ చేశాం. subsribe చేయండి
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true
మాస్టర్స్ టీవీ - For a Real News ( అన్ని వార్తలకు ఈ ఛానెల్ ను subscribe చేయండి)
https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ