CURRENT AFFAIRS MAY 9 & 10

తెలంగాణ
01) మధ్యాహ్నం భోజన పథకం నిర్వహణకు కమిటీ ఏర్పాటైంది. దీనికి ఎవరు కన్వీనర్ గా ఉంటారు ?
జ: విద్యాశాఖ కమిషనర్
02) వచ్చే ఐదేళ్ళల్లో తెలంగాణలో ఎన్ని కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారులతో దక్షిణాదిలో రాష్ట్రం అగ్రస్థానానికి చేరనుంది ?
జ: 3,155 కిలోమీటర్లు
03) రాష్ట్రం ఏర్పడే నాటికి ఎన్ని కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయి ?
జ: 2,527 కిమీ
04) 4.16 లక్షల లైట్ల వెలుగుతో ఆసియానే అతి పెద్ద LED ప్రాజెక్టును ఎక్కడ విజయవంతంగా అమలు చేస్తున్నారు
జ: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో
05) రాష్ట్రంలో కల్యాణ లక్ష్మి పథకానికి ప్రభుత్వం ఎంత మొత్తం ఆర్థిక సాయం చేస్తోంది ?
జ: రూ.1,00,116 లు
06) IMA మెడికో అవార్డ్స్ 2019 లో బెస్ట్ ఫిమేల్ హెల్త్ కేర్ లీడర్ గా అవార్డును పొందినది ఎవరు ?
జ: డాక్టర్ సంగీతా రెడ్డి ( అపోలో హాస్పిటల్స్ ఎండీ )
07) ఏ లోక్ సభ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల తీరును అధ్యయనం చేయాలని హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ( ISB)ని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజిత్ కుమార్ కోరారు ?
జ: నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం ( మొత్తం 185 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేశారు )
08) సైబర్ నేరాలు, మోసాల నియంత్రణఖు డేటా చౌర్యాన్ని నిరోధించేందుకు తెలంగాణ, హైదరాబాద్ సైబర్ క్లస్టర్ లు సంయుక్తంగా హైదరాబాద్ లో డేటా చౌర్య నిరోధక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి. ప్రపంచంలోనే ఇది రెండోది. మొదటి కేంద్రం ఎక్కడ ఉంది ?
జ: ది హేగ్ నగరంలో

జాతీయం
09) షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ డైరెక్టర్ గా ఎవరు పదవీ బాధ్యతలు స్వీకరించారు ?
జ: సునీల్ కుమార్ బాబు
10) రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ ను ఏర్పాటు చేశారు ?
జ: 338 అధికరణం
11) అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య మధ్యవర్తిత్వ కమిటీ తన మధ్యంతర నివేదికను సమర్పించింది. ఈ కమిటీలో సభ్యులు ఎవరు ?
జ: సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎఫ్.ఎం. కలీపుల్లా
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్
ప్రముఖ సీనియర్ అడ్వకేట్ శ్రీరామ్ పంచు
12) ఏ రంగంలో సహకారానికి భారత్ - జపాన్ ISE ఫుడ్స్ మధ్య పరస్పర అంగీకార ఒప్పందం జరిగింది ?
జ: పౌల్ట్రీ ఫామ్స్
13) ఐక్యరాజ్యసమితిలో శాంతి కార్యక్రమంలో పాల్గొన్న ఏ ఇద్దరు భారతీయులకు అరుదైన గౌరవం లభించింది ?
జ: శిఖా గార్గ్, జితేందర్ కుమార్
14) దేశంలో ఆధునిక న్యాయ విద్య పితగా (Modern Legal Education in India )పిలుచుకునే పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇటీవల చనిపోయారు. ఆయన ఎవరు ?
జ: NR మాధవ మీనన్
15) భారతీయ లిపిలోని ప్రతులను చదవడానికి బహుభాషా ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ ను వాడే విధానాన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది ?
జ: ఐఐటీ మద్రాస్
16) అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లోనూ సింథటిక్ ఎపర్చరు రాడార్లను ఉపయోగించి వాతావరణ పరిస్థితులు, సరహద్దుల్లో చొరబాట్లను గుర్తించడానికి, రాత్రి వేళల్లో నిర్ధుష్ట సమాచారం సేకరించడానికి వీలుగా ఏ శాటిలైట్ ప్రయోగాన్ని ఇస్రో ఈనెల 22న నిర్వహించనుంది ?
జ: PSLV-C 46
17) భారత్ ఫుట్ బాల్ హెడ్ కోచ్ గా నియమితులైన క్రొయేషియకి చెందిన క్రీడాకారుడు ఎవరు ?
జ: ఐగర్ స్టిమాక్
(నోట్: 53 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. 1996 యూరో కప్ లో క్రొయేషియా తరపున దేశానికి ప్రాతినిధ్యం వహించాడు )
18) 2600 ఎలో రేటింగ్ పొందిన మూడో అతి పిన్న వయస్కుడిగా రికార్డు సాధించిన కేరళకి చెందిన చెస్ ఆటగాడు ఎవరు ?
జ: నిహాల్ సరీన్

అంతర్జాతీయం
19) 11వ ఆర్కిటిక్ కౌన్సిల్ మినిస్టీరియల్ మీటింగ్ ఎక్కడ జరిగింది
జ: లప్పీ అరీనా, ఫిన్ లాండ్
20) ఐక్యరాజ్యసమితిలోని ఏ సంస్థకి చైనా అభ్యర్థిని ఓడించి భారతీయురాలు జగ్జీత్ పవాడియా తిరిగి బాధ్యతలు స్వీకరించారు ?
జ: ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ (INCB)
21) 2019 రెడ్ క్రాస్ డే యొక్క థీమ్ ఏది ?
జ: # Love
22) వరల్డ్ వెటర్నరీ డే 2019 యొక్క థీమ్ ఏది ?
జ: వ్యాల్యూ ఆఫ్ వ్యాక్సినేషన్

తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానెల్ ను ఈ కింది లింక్ ద్వారా SUBSCRIBE చేసుకోండి... ఉచితంగా వీడియో పాఠాలు అందుకోండి

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true