CURRENT AFFAIRS – MAY 8

తెలంగాణ
01) తెలంగాణలో తమ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించిన అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఏది ?
జ: పిట్స్ బర్గ్ వర్సిటీ
02) తెలంగాణ రామిరెడ్డిగా పిలిచే తొలితరం ఉద్యమకారుడు 101 యేళ్ళ వయసులో చనిపోయారు. ఆయన పేరేంటి ?
జ: గుండా రామిరెడ్డి

జాతీయం
03) ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ బౌద్ధ ఉత్సవంలో మాట్లాడేందుకు నాలుగు రోజుల పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏ దేశంలో పర్యటించనున్నారు ?
జ: వియత్నాం
04) ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో అత్యధికులు ఫాలో అవుతున్న రెండో వ్యక్తిగా ఎవరు రికార్డు సృష్టించారు ?
జ: ప్రధాని నరేంద్రమోడీ
(నోట్: ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ లో మోడీని 11.09 కోట్ల మంది ఫాలో అవుతున్నట్టు సెమ్ రష్ సంస్థ తెలిపింది. మొదటి స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నిలిచారు. 18.27 కోట్ల మంది ఫాలోవర్స్ )
05) ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ని వీవీ ప్యాట్స్ చీటీలను లెక్కించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది ?
జ: ఐదు వీవీ ప్యాట్స్
06) అక్షయ తృతీయ సందర్బంగా 2019 మే 7న చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో ఏయే పుణ్యక్షేత్రాల ప్రదేశాలు కవర్ అవుతాయి ?
జ: గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్
07) మైక్రోసాఫ్ట్ సంస్థ నిర్వహించిన ఇమేజిన్ కప్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో భారత్ కు చెందిన ముగ్గురు విద్యార్థులు రెండో స్థానంలో రన్నరప్ గా నిలిచారు. వీరు తయారు చేసిన ప్రయోగం ఏది ?
జ: స్మార్ట్ ఆటోమేటెడ్ కాలుష్య నిరోధక, ఔషధ బట్వాడా మాస్క్
08) గిర్ జాతీయ అటవీ పార్క్ ఎక్కడ ఉంది ?
జ: గుజరాత్ రాష్ట్రంలో
09) విద్యార్థులకు అవసరమైన శిక్షణకు ఉపయోగపడే ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ యాప్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు ?
జ: నటుడు మహేశ్ బాబు

అంతర్జాతీయం
10) అంధులకు మార్గదర్శకం చేసేందుకు ఉద్దేశించిన స్మార్ట్ సూట్ కేస్, యాప్ ను జపాన్ లోని టోక్యో విశ్వవిద్యాలయం, వాసెడా వర్సిటీ పరిశోధకులు రూపొందించారు. దీని పేరేంటి ?
జ: బి బీప్
11) భారత్ , బ్రెజిల్, దక్షిణాఫ్రియా (IBSA) పర్వతారోహకుల సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది ?
జ: కొచ్చిన్, కేరళ
12) పర్యావరణ సంక్షోభంపై G7 మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది ?
జ: మెట్జ్, ఫ్రాన్స్
13) ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది మిడ్ వైఫ్ - యొక్క థీమ్ ఏంటి ?
జ: Midwives : Defenders off Women's Rights
14) ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
జ: జెనీవా, స్విట్జర్లాండ్