Monday, July 22

CURRENT AFFAIRS – MAY 16 & 17

తెలంగాణ
01) 2019 అక్టోబర్ 11,12 తేదీల్లో హైదరాబాద్ లో జరగబోతున్న మరో అంతర్జాతీయ సదస్సు ఏది ?
జ: వరల్డ్ డిజైన్ అసెంబ్లీ
02) తెలంగాణ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ గండికోట శ్రీదేవి ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటిదాకా ఆమె ఎక్కడ పనిచేస్తున్నారు ?
జ: అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తి
03) గద్వాల జిల్లా బీచుపల్లి ఆయిల్ ఫ్యాక్టరీని పునరుద్దరించే బాధ్యతను ఏ సంస్థకు అప్పగించారు ?
జ: తెలంగాణ ఆయిల్ ఫెడ్ జాతీయ పాడి అభివృద్ధి మండలి ( NDDB)

జాతీయం
04) గతంలో ఎన్నడూ లేని విధంగా రాజ్యాంగంలోని ఏ అధికరణాన్ని ఉపయోగించి పశ్చిమబెంగాల్ లో ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ కుదించింది ?
జ: 324వ అధికరణం
05) పాక్ F16 యుద్ధవిమానాన్ని ధీటుగా ఎదుర్కొన్నందుకు భారత్ వింగ్ కమాండర్ అభినందన్ కి ఇటీవల ఏ గౌరవం దక్కింది ?
జ: IAF ఫాల్కన్ స్లేయర్స్, అమ్రామ్ డాడ్చర్స్ బ్యాడ్జీలను ప్రకటించింది (ఆయన ప్రాతినిధ్యం వహించిన భారత వైమానిక దళం యూనిట్ సభ్యలందరికీ ఇచ్చారు )
06) డిజిటల్ చెల్లింపుల సేవలు అందించే సంస్థ మాస్టర్ కార్డ్ మన దేశంలో వచ్చే ఐదేళ్ళల్లో ఎన్ని కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది ?
జ: రూ.7 వేల కోట్లు
07) రూ.2వేల కోట్ల పెట్టుబడితో మాస్టర్ కార్డ్ సర్వీస్ హబ్ ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ ప్రకటించారు ?
జ: పుణె
08) ముంబైలోని మజాగోన్ డాక్ యార్డ్ లో ప్రారంభించిన 4వ స్కార్వీన్ - క్లాస్ సబ్ మెరైన్ ఏది ?
జ: INS వేలా
09) దక్షిణాసియా క్రీడల్లో పతకం సాధించిన యువ స్విమ్మర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన పేరేంటి ?
జ: ఎంబీ బాలక్రిష్ణన్

అంతర్జాతీయం
10) ఉగ్రవాదం, విద్వేషాన్ని వ్యాప్తి చేయకుండా నిరోధించేందుకు ఏ సోషల్ మీడియా దిగ్గజం లైవ్ స్ట్రీమింగ్ పై ఆంక్షలు విధించింది ?
జ: ఫేస్ బుక్
11) టెక్ దిగ్గజం యాపిల్ మొదటిరోజుల్లో తయారు చేసిన యాపిల్ 1 కంప్యూటర్ ను వేలంలో అమ్మేందుకు క్రిస్టీస్ సంస్థ ప్రయత్నిస్తోంది. మొదటి యాపిల్ కంప్యూటర్ ను ఎప్పుడు తయారు చేశారు ?
జ: 1976లో
12) ప్రపంచంలోనే మొదటిసారిగా ఏ దేశపు జాతీయ చట్టసభ పర్యావరణ, వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ?
జ: బ్రిటన్
13) ఆసియా సహకార చర్చలు (ACD) 16వ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది ?
జ: దోహా, ఖతార్
14) ప్రపంచ ఆస్తమా దినోత్సవం 2019 థీమ్ ఏది ?
జ: స్టాప్ (STOP) ఫర్ ఆస్తమా