Friday, February 21

CURRENT AFFAIRS – MAY 11

రాష్ట్రీయం
01) ఉమ్మడి పరిశోధనలు, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోడం, విద్యార్థులు - బోధనా సిబ్బంది మార్పిడి కార్యక్రమాల అమలుపై హైదరాబాద్ కి చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) అమెరికాకి చెందిన ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: పిట్స్ బర్గ్
02) ఎయిర్ హెల్ప్ సంస్థ నిర్వహించిన ప్రపంచంలోని 10 ఉత్తమ విమానాశ్రయాల్లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి ఎన్నో స్థానం దక్కింది ?
జ: 8వ స్థానం
03) రూ.350 కోట్లతో ఆరు టవర్లతో GMR బిజినెస్ పార్క్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో
04) నీటి వృధాని అరికట్టే కొత్తరకం పరికరాన్ని వరంగల్ S.R. ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు కనుగొన్నారు. దీని పేరేంటి ?
జ: సాగ్లీ
05) ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కో-ఆపరేటివ్ ( ఇఫ్ కో) డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: మాధవరెడ్డి గారి దేవేందర్ రెడ్డి
(నోట్: మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ గా పనిచేస్తున్నారు )

జాతీయం
06) రక్తపింజరి జాతికి చెందిన, వేడిని పసిగట్టే కొత్త రకం సర్పంను మన దేశంలో ఎక్కడ కనుగొన్నారు ?
జ: అరుణాచల్ ప్రదేశ్ లోని పశ్చిమ కామెంగ్ జిల్లాలో
(నోట్: రష్యన్ జర్నల్ హెర్పెటాలజీ లో ఈ పాము గురించి ప్రచురించారు. పిట్ వైపర్ పాము అంటారు. ఇది 70యేళ్ళకి మళ్ళీ కనిపించింది )
07) గ్రామీణ, సెమీ అర్బన్ విద్యార్థులు, నిరుద్యోగులు ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాదించడానికి హైదరాబాద్ లోని ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ (ఇఫ్లూ) కొత్తగా తీసుకొస్తున్న యాప్ పేరేంటి ?
జ: ఇంగ్లిష్ ప్రొ
08) భారత్ ఏ దేశంతో కలసి గోవా సముద్ర తీరంలో నౌకా విన్యాసాలను నిర్వహిస్తోంది ?
జ: ఫ్రాన్స్
09) బ్రిటన్ కు చెందిన ప్రసిద్ధ బొమ్మల బ్రాండ్ హామ్ లేస్ ను కొనుగోలు చేసిన భారతీయ దిగ్గజ సంస్థ ఏది ?
జ: రిలయన్స్ బ్రాండ్స్ (రు.620 కోట్లు పెట్టుబడి పెట్టింది )
10) ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: బాలీవుడ్ నటి దియా మీర్జా
11) IPL ప్రస్తుత సీజన్ లో ఫైనల్స్ కి చేరిన రెండు క్రికెట్ జట్టులు ఏవి ?
జ: ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్

అంతర్జాతీయం
12) 2024 నాటికి సాంకేతిక ఉపకరణాలతో పాటు మనుషులను కూడా చంద్రుడి పైకి పంపేందుకు ఉద్దేశించిన ల్యాండర్ ను ప్రపంచలోనే అత్యంత సంపన్నుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఆవిష్కరించారు. దాని పేరేంటి ?
జ: బ్లూ మూన్ లూనార్ ల్యాండర్
13) కిందటేడాది డిసెంబర్ లో UAEలో జరిగి టీ10లీగ్ లో అవినీతికి పాల్పడినందుకు శ్రీలంకకు చెందిన ఏయే ఆటగాళ్ళను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సస్పెండ్ చేసింది ?
జ: నువాన్ జోయ్సా, ఆవిష్క గుణవర్ధనే
14) భూటాన్ రాజథాని థింపూలో జిగ్మే డోర్జీ వాంగ్ ఛుక్ జాతీయ రిఫరల్ ఆసుపత్రిలో బుమ్ తాప్ అనే 40యేళ్ళ వ్యక్తికి ఆపరేషన్ చేసి వార్తల్లోకి ఎక్కిన లోటే షేరింగ్ ఎవరు ?
జ: భూటాన్ ప్రధాని
15) ప్రమాదకర భూశకలాల నుంచి భూమిని రక్షించడానికి డిడిమోస్ అనే జంట గ్రహశకల వ్యవస్థను ఢీకొట్టబోతున్న వ్యోమనౌక పేరేంటి ?
జ: ద డబుల్ ఆస్టరాయిడ్ రీడైరక్షన్ టెస్ట్ (డ్రార్ట్)
(నోట్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా దీన్ని ప్రయోగిస్తోంది. 2022లో ఈ ప్రయోగం నిర్వహిస్తున్నారు )

 

తెలుగు వర్డ్ వెబ్ సైట్ (అన్ని రకాల వార్తల కోసం- whats app గ్రూపు)
https://chat.whatsapp.com/BIVy17lY3Ga7MIXNdQXjSB

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true

మాస్టర్స్ టీవీ - For a Real News ( అన్ని వార్తలకు ఈ ఛానెల్ ను subscribe చేయండి)
https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ