Tuesday, April 23

CURRENT AFFAIRS – MAY 05

రాష్ట్రీయం
1) రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకం 2018 మే 10 నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభిస్తారు ?
జ: కరీంనగర్ జిల్లా శాలపల్లి
2) బాలల న్యాయ చట్టం - 2015 అమల్లో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ చిన్నారుల సంరక్షణకు బాలల న్యాయ నిధిని ఎంత మొత్తంతో తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసింది ?
జ: రూ.కోటి తో
3) తెలంగాణ తొలి దళిత కవి మాదిగ మహాయోగిపై తెలంగాణ వికాస సమితి రూపొందించిన పుస్తకాన్ని ఎంపీ కవిత ఆవిష్కరించారు. ఆ రచయిత పేరేంటి ?
జ: దున్న ఇద్దాసు
4) NTPC దక్షిణ ప్రాంత ED గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
జ: దిలీప్ కుమార్

జాతీయం
5) వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి హోదాలో తొలి విదేశీ పర్యటన కోసం వారం రోజుల పాటు ఏ దేశాలకు వెళ్తున్నారు ?
జ: లాటిన్ అమెరికా దేశాల్లో
6) దేశంలో మొదటిసారిగా వ్యవసాయ రంగ అభివృద్ధికి కృత్రిమ మేథస్సును వినియోగించే దిశగా నీతి ఆయోగ్ ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: ఐబీఎం సంస్థ
(నోట్: అభివృద్ధిలో వెనుకబడిన మొత్తం 115 జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకను పెంచేందుకు ఉద్దేశించింది ఈ ప్రాజెక్టు. )
7) దేశవ్యాప్తంగా ఉన్నతవిద్యను పర్యవేక్షించేందుకు UGC, AICTE, NCTE లను విలీనం చేస్తూ ఏ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది ?
జ: హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవల్యూషన్ అండ్ రెగ్యులేషన్ అథారిటీ - హీరా
8) ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్ సమయాన్ని రాతరి 11.55 నిమిషాల వరకూ పొడిగించేందుకు ఎక్స్చేంజీలకు సెబీ అనుమతి ఇచ్చింది. ఈ టైమ్ ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది ?
జ: అక్టోబర్ 1 నుంచి
9) వచ్చే దశాబ్దంలో వేగవంతమైన వృద్ధిని సాధించే ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ అగ్ర స్థానంలో ఉంటుందని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది. భారత్ లో వృద్ధి శాతం ఎంత ఉండొచ్చని అంచనా వేసింది ?
జ: 7.9శాతం
10) దేశంలో రెండో అతి పెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ CEO ఎవరు ?
జ: సలీల్ పరేఖ్
11) గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించిన ఏ వెయిట్ లిఫ్టర్ పై క్రమశిక్షణారాహిత్యం కింద భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య సస్పెన్షన్ వేటు వేసింది ?
జ: పూనమ్ యాదవ్

అంతర్జాతీయం
12) నోబెల్ పురస్కార కమిటీ సభ్యుల్లో ఒకరు లైంగిక నేరాల్లో నిందితుడిగా ఉండటంతో ఏ విభాగంలో పురస్కారాలను ఈ ఏడాది ఇవ్వడం లేదని స్వీడిష్ కమిటీ ప్రకటించింది ?
జ: సాహిత్య పురస్కారం
13) భూతాపానికి ప్రధాన కారణమైన కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి ప్రమాదకర స్థాయిలో పెరుగుతోందని హవాయ్ లోని మౌనా లోవా అబ్జర్వేటరీ సంస్థ చెబుతోంది. ఏప్రిల్ మొత్తం గాల్లో CO2 సరాసరి పరిమాణం ఎంతగా నమోదైంది ?
జ: 410 PPM ( పార్ట్స్ పర్ మిలియన్ )