Friday, February 28

CURRENT AFFAIRS – MAR 9

తెలంగాణ
01) తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (TSMSIDC) ఛైర్మన్ పదవీ కాలాన్ని పెంచారు. ఈ పదవిలో ఎవరు ఉన్నారు ?
జ: పరియడా క్రిష్ణ మూర్తి
02) ఎన్నికల్లో ఓటు శాతం పెంచేందుకు ఏ పేరుతో కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం అమలు చేయనుంది ?
జ: సంకల్ప
(నోట్: మీ ఓటు ద్వారా మీ ప్రేమను చూపించండి పేరుతో స్కూల్ పిల్లలకు సంకల్ప పత్రాలను ఇస్తారు. వాటిపై తల్లిదండ్రుల సంతకాలు చేసుకొని తిరిగి ఈసీ అధికారులకు సమర్పించాలి )
03) హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన TRS అభ్యర్థి ఎవరు ?
జ: ఎం.ఎస్. ప్రభాకర్

జాతీయం
04) అయోధ్య వివాదంపై మధ్యవర్తిత్వం కోసం ఎవరి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని సుప్రీంకోర్టు నియమించింది ?
జ: జస్టిస్ కలీపుల్లా
05) జస్టిస్ కలీపుల్లా నేతృత్వంలో అయోధ్య మధ్యవర్తిత్వ త్రిసభ్య కమిటీలో మిగిలిన సభ్యులు ఎవరు ?
జ: ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్, న్యాయవాది శ్రీరాం పంచు
06) ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడికి గౌరవ డాక్టరేట్ అందించిన యూనివర్సిటీ ఏది ?
జ: యూనివర్సిటీ ఆఫ్ పీస్ ( ఐరాస ఆధ్వర్యంలోని వర్సిటీ)
07) వెంకయ్యనాయుడికి ఎక్కడ జరిగిన కార్యక్రమంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అవార్డు ప్రదానం చేశారు ?
జ: కోస్టారికా రాజధాని సాన్ జోస్
08) కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి ఎవరు నియమితులయ్యారు ?
జ: సుభాష్ చంద్ర గార్గ్
09) మిజోరం గవర్నర్ పదవికి రాజీనామా చేసినది ఎవరు ?
జ: కుమ్మనం రాజశేఖరన్
10) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి నారీశక్తి పురస్కారం అందుకున్న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం (షార్) శాస్త్రవేత్త ఎవరు ?
జ: మునుస్వామి శాంతి
11) ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) కొత్త గుడ్ విల్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: పద్మా లక్ష్మి

అంతర్జాతీయం
12) చైనాలో భారత్ మూడో ఐటీ కారిడార్ ఎక్కడ ఏర్పాటు కానుంది ?
జ: జియాంగ్జు ప్రావిన్స్ లోని సుగ్జూ నగరంలో (చైనా)
13) పాకిస్థాన్ పార్లమెంటు సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి హిందూ మహిళా సెనేటర్ ఎవరు ?
జ: కృష్ణ కుమారి
14) బార్బీకి 60 యేళ్ళు నిండాయి. బార్బీని 1959లో ఎక్కడ జరిగిన బొమ్మల ప్రదర్శనలో మొదటిసారిగా ప్రపపంచానికి పరిచయం చేశారు ?
జ: అమెరికాలోని న్యూయార్క్ లో

తక్కువ టైమ్ లో మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేలా మా మాక్ టెస్టులు ఉపయోగపడతాయి. మెయిన్స్ కోసం (1) స్టేట్ మెంట్స్ (2) జతపరచండి (3) కాలక్రమంలో రాయండి మోడల్స్ లో ఇస్తున్నాం. (మెయిన్స్ ఎగ్జామ్స్ కంటే ముందే మాక్ టెస్టులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం.. )

SI/PC(M)/GR.1,2,3 - 325 TESTS ( Telugu Medium)

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/