Sunday, February 23

CURRENT AFFAIRS MAR 6

తెలంగాణ
01) దేశంలోనే వంద శాతం విద్యుదుత్పత్తి చేసిన థర్మల్ కేంద్రాల సరసన చేరిన సింగరేణి విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ?
జ: జైపూర్ దగ్గరున్న STPC ( మంచిర్యాల జిల్లా )
02) జైపూర్ STPC లో ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ?
జ: 600 మెగావాట్ల చొప్పున 2 ప్లాంట్లు
03) రాష్ట్రానికి చెందిన సాంబ మసూరి (BPT-5204) ధాన్యం విత్తనాలు నాణ్యంగా ఉంటాయని 30 వేల క్వింటాళ్ళు ఇవ్వాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: తమిళనాడు
04) 2019 సంవత్సరానికి ప్రపంచ వారసత్వ ప్రాంతంగా రాష్ట్రంలోని కాకతీయుల కాలం నాటి ఏ గుడిని కేంద్ర ప్రభుత్వం సిఫార్స్ చేసింది ?
జ: రామప్ప గుడి (ములుగు జిల్లా )
05) తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పోరేషన్ వైస్ ఛైర్మన్, ఎండీగా ఎవరిని ప్రభుత్వం నియమించింది ?
జ: పి.రఘువీర్ (సీనియర్ IFS అధికారి )
06) ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పథకానికి లబ్దిదారుడుగా ఎంపికై ప్రధాన చేతుల మీదుగా కార్డు అందుకున్న రాజేంద్రనగర్ నివాసి ఎవరు ?
జ: హరినాథ్ ( డ్రైవర్ )
07) బాలసాహిత్యంలో విశేష కృషి చేస్తున్న ఎవరికి సి.వి.రామన్ అకడామీ జాతీయ ఉగాది పురస్కారానికి ఎంపిక చేసింది ?
జ: రచయిత్రి కందేపి రాణి ప్రసాద్ ( సిరిసిల్ల )
08) తెలంగాణ ఆర్టీసికి 40 ఎలక్ట్రికల్ బస్సులను అందించిన విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ఏది ?
జ: ఒలెక్ట్రా-BYD

జాతీయం
09) ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడ ప్రారంభించారు ?
జ: అహ్మదాబాద్ ( గుజరాత్ )
10) ప్రపంచంలో 20 అత్యంత కాలుష్య పూరిత నగరాల్లో మన దేశానికి చెందిన ఎన్ని సిటీలు ఉన్నాయి ?
జ: 15 రాష్ట్రాలు
11) ప్రపంచంలో 20 అత్యంత కాలుష్యపూరిత నగారాల జాబితాను రూపొందించిన సంస్థ ఏది ?
జ: ఐక్యూ ఎయిర్ సంస్థ ( గ్రీన్ పీస్ ఆగ్నేసియా సహకారంతో రూపొందించింది )
12) ఐక్యూ ఎయిర్ సంస్థ రూపొందించిన నివేదిక పేరేంటి ?
జ: ప్రపంచ వాయు నాణ్యత
13) భారత్ తమ ఉత్పత్తులకు ఎక్కువ ట్యాక్సులు విధిస్తున్నందున ప్రాధాన్యతల సాధారణ వ్యవస్థ రద్దు ( ప్రాధాన్య హోదా ) రద్దు చేస్తామని ప్రకటించిన దేశం ఏది ?
జ: అమెరికా (టర్కీకి కూడా )
14) అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన క్యాకరెల్లీ సిమెండ్స్ ( QS) ప్రకటించిన ర్యాంకింగ్స్ లో స్థానం సంపాదించుకున్న ఉన్నత విద్యా సంస్థలు ఏవి ?
జ: ఢిల్లీ IIT (172 వర్యాంక్) బొంబాయి IIT( 162), బెంగళూరులోని IISC (170వ ర్యాంక్ )
15) ప్రయాణ సమాచారాన్ని వెల్లడించిన ప్రతిసారీ జైహింద్ అని బిగ్గరగా, దేశ భక్తిని తెలిపేలా నినాదం చేయాలని తన సిబ్బందికి సూచించిన విమాన యాన సంస్థ ఏది ?
జ: ఎయిర్ ఇండియా
16) ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో మన దేశంలో మొదటి స్థానంలో, ప్రపంచంలో 13వ స్థానంలో నిలిచినది ఎవరు ?
జ: ముకేశ్ అంబానీ ( సంపద 5000 కోట్ల డాలర్లు - రూ.3.5లక్షల కోట్లు )
17) ఫోర్బ్స్ మేగజైన్ రూపొందించిన కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్న నలుగురు తెలుగు వారు ఎవరు ?
జ: 1) దివీస్ లేబోరేటరీ వ్యవస్థాపకుడు - మురళీ దివి 3.4 బిలియన్ డాలర్లు (645 ర్యాంక్)
2) అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడు - సి.వి.రామ్ ప్రసాద్ రెడ్డి (2.8 బిలియన్ డాలర్లు - 804 వ ర్యాంక్)
3) మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థాపకుడు - పి.పి. రెడ్డి ( 2.3 బి.డాలర్లు 1008)
4) ఎండీ పి.వి.కృష్ణారెడ్డి ( 2.2 బి.డాలర్లు 1057)
18) అమెరికాలో క్యాన్సర్ ఔషధాన్ని విక్రయించుకోడానికి అనుమతి పొందిన మన దేశీయ సంస్థలు ఏవి ?
జ: లుపిన్ లిమిటెడ్, నాట్కో ఫార్మా సంయుక్తంగా
19) లుపిన్, నాట్కో ఫార్మా ఏ క్యాన్సర్ రకానికి అమెరికాలో ఔషధాన్ని విక్రయించనున్నాయి ?
జ: క్రానిక్ మైలాయిడ్ లుకేమియా

అంతర్జాతీయం
20) 2019 ఫిబ్రవరి చివరి వరకూ లెక్కలోకి తీసుకొని ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో మొదటి స్థానం ఎవరికి దక్కింది ?
జ: అమెజాన్ అధిపతి బెజోస్ (సంపద 13100 కోట్ల డాలర్లు - రూ.9లక్షల కోట్లు )
21) ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో రెండో స్థానం ఎవరికి దక్కింది ?
జ: బిల్ గేట్స్ (మైక్రో సాఫ్ట్ అధినేత )
22) ఫోర్బ్స్ ధనవంతు జాబితాలో 3 వ స్థానం ఎవరికి దక్కింది ?
జ: వారెన్ బఫెట్
23) ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ సంపద గత ఏడాదితో పోలిస్తే 900 కోట్ల డాలర్లు తగ్గింది. దీంతో ఆయన ర్యాంకు గత ఏడాది 5 ఉండగా... ఇప్పుడు ఎంతగా ఉంది ?
జ: 8వ ర్యాంక్
24) డ్రైవర్ లేకుండా నడిచే విద్యుత్ బస్సులను వోల్వో సంస్థ సింగపూర్ లో ఆవిష్కరించింది. అయితే వోల్వో ఏ దేశానికి చెందిన కంపెనీ ?
జ: స్వీడన్
25) 2019 కి జీడీపీ వృద్ధి రేటును చైనా ఎంతకు తగ్గించుకుంది ?
జ: 6-6.5 శాతం (2018 లో 6.5లక్ష్యంగా నిర్ణయించారు )
26) కృత్రిమ సూర్యుడిని ఏ పేరుతో చైనా ఆవిష్కరించనుంది ?
జ: HL-2 M టొకమాక్
27) కృత్రిమ సూర్యుడిగా పిలిచే HL-2 M టొకమాక్ పరికరం నుంచి ఎన్ని డిగ్రీ సెల్షియస్ ఉష్ణోగ్రతలు వెలువడుతాయి ?
జ: 10 కోట్ల డిగ్రీల సెల్షియస్

తక్కువ టైమ్ లో మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేలా మా మాక్ టెస్టులు ఉపయోగపడతాయి. మెయిన్స్ కోసం (1) స్టేట్ మెంట్స్ (2) జతపరచండి (3) కాలక్రమంలో రాయండి మోడల్స్ లో ఇస్తున్నాం. (మెయిన్స్ ఎగ్జామ్స్ కంటే ముందే మాక్ టెస్టులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం.. )

SI/PC(M)/GR.1,2,3 - 325 TESTS ( Telugu Medium)

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/