Friday, February 28

CURRENT AFFAIRS- MAR 5

తెలంగాణ
01) తెలంగాణకు చెందిన విత్తనాలు ఆఫ్రికా దేశంలో వాతావరణానికి అనుకూలంగా ఉంటాయని బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు చెప్పారు. అయితే ఈ రాష్ట్రం నుంచి ఏయే విత్తనాలు దిగుమతి చేసుకుంటామని ప్రకటించారు ?
జ: వరి, పొద్దు తిరుగుడు విత్తనాలు
02) తెలంగాణ కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఎన్ని రోజుల్లో జడ్పీ సమావేశాన్ని ఒక్కసారైనా నిర్వహించకపోతే ఛైర్మన్ అనర్హుడు అవుతాడు ?
జ: 90 రోజులు
03) జడ్పీ ఛైర్మన్ పై అనర్హత వేటు పడితే మళ్ళీ ఎప్పటి వరకూ ఎన్నికయ్యే అవకాశం ఉండదు ?
జ: మరో ఏడాది పాటు
04) వేరు సెనగ పరిశోధనా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రొ.జయశంకర్ వర్సిటీని ఆదేశించింది ?
జ: వనపర్తిలో
05) ద్వేషపూరిత నేరాల నివేదనలో చట్టాన్ని అమలు చేసే సంస్థల పాత్ర అనే అంశంపై అమెరికాకి చెందిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ చీఫ్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలోని పోలీస్ చీఫ్ మేగజైన్ లో చోటు దక్కించుకున్న రాష్ట్రానికి చెందిన సీపీ ఎవరు ?
జ: రాచకొండ సీపీ మహేశ్ భగవత్
06) రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కి కిందటేడాది లభించిన అంతర్జాతీయ బహుమతి పేరేంటి ?
జ: 2018 IACP లీడర్షిప్ ఇన్ హ్యూమన్ అండ్ సివిల్ రైట్స్

జాతీయం
07) దేశవ్యాప్తంగా మెట్రో, బస్, టోల్ పార్కింగ్ తదితర రవాణా సంబంధిత ఛార్జీల చెల్లింపునకు నేషనల్ కామన్ మొబలిటీని కార్డును ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడ ఆవిష్కరించారు ?
జ: అహ్మదాబాద్
08) మన దేశ గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ నిఘా డ్రోన్ ను భారత్ ఎక్కడ కూల్చి వేసింది ?
జ: బికానేర్ సెక్టార్ లో ( రాజస్థాన్)
(నోట్ : సుఖోయ్-30 యుద్ధవిమానంతో కూల్చేశారు)
09) తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఈషా ఫౌండేషన్ మహాశివరాత్రి ఉత్సవాలకు ఎవరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ?
జ: రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్
10) ఈషా యోగా కేంద్రం వ్యవస్థాపకుడు ఎవరు ?
జ: సద్గురు జగ్గీ వాసుదేవ్
11) లాటిన్ అమెరికా దేశాల పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏయే దేశాల్లో పర్యటిస్తున్నారు ?
జ: పరాగ్వే, కోస్తారికా
12) రోగులకు వైద్య సేవలు, సపర్యలు అందించడంలో కీలకంగా ఉండే నర్సులకు ఏ పేరుతో అవార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ 2019
13) సిఫ్ట్ మేనేజింగ్ సాఫ్ట్ వేర్ నిబంధనలు పాటించకపోవడంతో ఏయే బ్యాంకులపై రూ.11 కోట్ల జరిమానాను ఆర్బీఐ విధించింది ?
జ: కర్ణాటక బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్

అంతర్జాతీయం
14) మానసిక, శారీరక దివ్యాంగుల కోసం నిర్వహించే ప్రత్యేక ఒలింపిక్స్ 2019 మార్చి 14 నుంచి ఎక్కడ జరగనున్నాయి ?
జ: అబుదాబిలో
15) అబుదాబిలో జరిగే ప్రత్యేక ఒలింపిక్స్ లో భారత్ నుంచి ఎంతమంది క్రీడాకారులు పాల్గొంటారు ?
జ: 289 అథ్లెట్స్ ( కోచ్ లతో కలిపి 378 మంది బృందం)
16) ప్రత్యేక ఒలింపిక్స్ లో భారత్ తరపున వెళ్తున్న 289మంది అథ్లెట్స్ మొత్తం ఎన్ని క్రీడాంశాల్లో పాల్గొంటారు?
జ: 14 క్రీడాంశాలు
17) ఆసియా క్రీడల చరిత్రలోనే మొదటిసారిగా ఏ దేశ జట్టుకు పాల్గొనే అవకాశం కల్పిస్తూ ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది ?
జ: ఆస్ట్రేలియా
18) 2022 ఆసియా క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయి ?
జ: చైనాలోని హాంగ్జౌలో

తక్కువ టైమ్ లో మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేలా మా మాక్ టెస్టులు ఉపయోగపడతాయి. మెయిన్స్ కోసం (1) స్టేట్ మెంట్స్ (2) జతపరచండి (3) కాలక్రమంలో రాయండి మోడల్స్ లో ఇస్తున్నాం. (మెయిన్స్ ఎగ్జామ్స్ కంటే ముందే మాక్ టెస్టులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం.. )

SI/PC(M)/GR.1,2,3 - 325 TESTS ( Telugu Medium)

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/