Friday, September 20

CURRENT AFFAIRS MAR 3 & 4

తెలంగాణ
01) రాష్ట్రంలో ఎప్పటి నుంచి 32 జిల్లా పరిషత్ లు ఏర్పాటు అవుతాయని పంచాయతీ రాజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ?
జ: 2019 జులై 5 నుంచి
02) రాష్ట్రంలో కొత్తగా ఎప్పటి నుంచి 535 మండల పరిషత్ లు ఏర్పాటు అవుతాయి ?
జ: 2019 జులై 4 నుంచి
03) స్మార్ట్ ఇండియా హాకథాన్ మన రాష్ట్రంలో ఏ విద్యాలయంలో జరుగుతోంది ?
జ: వరంగల్ నిట్
04) ఏడుపాయల జాతర ఎక్కడ జరుగుతుంది ?
జ: మెదక్ జిల్లాలోని పాపన్న పేట మండలం నాగసాని పల్లి

జాతీయం
05) పట్టణీకరణతో అధికమవుతున్న ఇళ్ళ కొరతను తీర్చేందుకు ఆధునిక సాంకేతికతలను నిర్మాణ రంగంలో కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. అందుకోసం 2019 ఏప్రిల్ - 2020 మార్చి ని ఏ ఏడాదిగా ప్రకటించారు ?
జ: నిర్మాణం - సాంకేతికత
06) కుంభమేళాలో మరో ప్రపంచ రికార్డు జరిగింది. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో పారిశుధ్య కార్మికులు చరిత్ర సృష్టించారు. ఒకే చోట ఎంతమంది 3 నిమిషాల్లో రోడ్లని శుబ్రం చేశారు ?
జ: వెయ్యి మంది
07) భారత్ - పాక్ సరిహద్దుల్లో 400 అదనపు వ్యక్తిగత బంకర్లను జమ్ము కశ్మీర్ ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని ఎక్కడ నిర్మిస్తారు ?
జ: ఫూంచ్, రాజౌరీ జిల్లాల పరిధిలో
08) ఇటీవల జమ్ముకశ్మీర్ లో ఏ సంస్థను కేంద్ర ప్రభుత్వ నిషేధించింది ?
జ: జమాత్ ఎ ఇస్లామీ
09) రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) ఛైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డికి 2019 సంవత్సరానికి మిసైల్ సిస్టమ్స్ అవార్డును ప్రకటించిన సంస్థ ఏది ?
జ: అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరో నాటిక్స్ అండ్ ఆస్త్రనాటిక్స్

అంతర్జాతీయం
10) ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల జాబితా (బ్లాక్ లిస్ట్ ) లో ఎవరి పేరును కొత్తగా చేర్చారు ?
జ: హమ్జా బిన్ లాడెన్
11) 2022 ఆసియా క్రీడల్లో మళ్లీ చోటు దక్కించుకుంటున్న పాపులర్ గేమ్ ఏది ?
జ: క్రికెట్
12) 2010, 2014 ఆసియా క్రీడల్లో నిర్వహించిన క్రికెట్ ను ఎప్పుడు తొలగించారు ?
జ: 2018 ఆసియా క్రీడల్లో