Thursday, February 27

CURRENT AFFAIRS – MAR 2

తెలంగాణ
01) దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఏయే రైల్వే స్టేషన్లను ఎకో స్మార్ట్ ( పర్యావరణ హిత) స్టేషన్లుగా మారుస్తున్నట్టు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది ?
జ: సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ
02) ఐక్యరాజ్యసమితి - గ్లోబల్ కాంపాక్ట్ సంస్థ ఢిల్లీలో నిర్వహించిన లింగ సమానత్వంపై భవిష్యత్తులో మహిళల పని విధానం అనే అంశంపై మాట్లాడిన రాష్ట్ర ఎంపీ ఎవరు ?
జ: నిజామాబాద్ ఎంపీ కవిత
03) రాష్ట్రంలో మొదటి మహిళా పోలీస్ కమెండోల బృందం ఏ పోలీస్ కమీషనరేట్ లో ప్రారంభించారు ?
జ: కరీంనగర్
04) దేశంలోనే ఉత్తమ దర్యాప్తు అధికారిగా అవార్డు అందుకున్నది ఎవరు ?
జ: ఏసీపీ రంగారావు
(నోట: 2016లో 9యేళ్ళ చిన్నారి అత్యాచారం, హత్యకేసు దర్యాప్తునకు ఈ అవార్డు లభించింది. ఆయన అప్పట్లో బేగంపేట ఏసీపీ )

జాతీయం
05) విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించే పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు ?
జ: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
06) వాయుసేన, నౌకాదళ చీఫ్ లకు పొంచి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వారికి జడ్ ప్లస్ భద్రతను పెంచింది. ఈ రెండు విభాగాల అధిపతులు ఎవరు ?
జ: వాయుసేన అధిపతి - ఎయిర్ మార్షల్ బీఎస్ ధనోవా
07) నౌకాదళ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా
(నోట్: ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ - ఈయనకు ఇప్పటికే జడ్ ప్లస్ భద్రత ఉంది )
08) ఎస్ బ్యాంక్ MD, CEO గా ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
జ: రవ్ నీత్ గిల్
09) హైదరాబాద్ లో ఉన్న రక్షణ మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) CMD గా ఎవరు నియమితులయ్యారు ?
జ: సిద్ధార్థ మిశ్రా
10) 2019, 2020 లో భారత వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని అంతర్జాతీయ సంస్థ మూడీ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనా వేసింది ?
జ: 7.3శాతం
11) ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు ?
జ: సునీల్ అరోడా

అంతర్జాతీయం
12) అల్ ఖైదా అగ్రనేత లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ పై 1మిలియన్ డాలర్లు ( రూ.7కోట్లు) రివార్డు ప్రకటించిన దేశం ఏది ?
జ: అమెరికా
13) ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (IOC) సమావేశంలో మొదటిసారిగా భారత్ తరపున పాల్గొన్న కేంద్ర మంత్రి ఎవరు ?
జ: విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్
14) IOC లో ఎన్ని ముస్లిం దేశాలకు సభ్యత్వం ఉంది ?
జ: 57 ముస్లిం దేశాలు
15) IOC లో భారత్ కి ఆహ్వానాన్ని పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకించి, బైకాట్ చేసింది. గతంలో 1969లో ఎక్కడ జరిగిన సమావేశాల్లో భారత్ కు ఆహ్వానం అందింది ?
జ: మొరాకో రాజధాని రబత్ లో
16) రబత్ లో జరిగిన IOC సమావేశాలకు వెళ్ళి, పాక్ అభ్యంతరం పాల్గొనకుండేనే తిరిగి వచ్చిన భారత కేంద్ర మంత్రి ఎవరు ?
జ: ఫక్రుద్దీ అలీ అహ్మద్ ( ప్రధాని : ఇందిరాగాంధీ )
17) జైష్ ఏ మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ తమ దేశంలోనే ఉన్నాడని పాకిస్థాన్ ఎట్టకేలకు ఒప్పుకుంది. ఆ దేశ విదేశాంగమంత్రి ఎవరు ?
జ: షా మహమూద్ ఖురేషీ

తక్కువ టైమ్ లో మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేలా మా మాక్ టెస్టులు ఉపయోగపడతాయి. మెయిన్స్ కోసం (1) స్టేట్ మెంట్స్ (2) జతపరచండి (3) కాలక్రమంలో రాయండి మోడల్స్ లో ఇస్తున్నాం. (మెయిన్స్ ఎగ్జామ్స్ కంటే ముందే మాక్ టెస్టులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం.. )

SI/PC(M)/GR.1,2,3 - 325 TESTS ( Telugu Medium)

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/