Friday, February 21

CURRENT AFFAIRS – MAR 12-13

తెలంగాణ
01) పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్న ప్రాంతంలో నేల స్వభావంపై అధ్యయనం చేసేందుకు ఏ సంస్థ సహకారం తీసుకోవాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది ?
జ: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ ( NIRM)
02) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జ్యుడీషియల్ అకాడమీ పేర్లను ఏవిధంగా మార్చారు ?
జ: తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ
03) ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని ఏ సెక్షన్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ ఏర్పడింది ?
జ: సెక్షన్ 75
04) 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల నియమావళిని సరిగా పాటించని 62 మందిపై అనర్హత వేటు వేశారు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్. అయితే వీళ్ళు ఎప్పటి దాకా తిరిగి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారు ?
జ: 2020 జూన్ వరకూ

జాతీయం
05) వివిధ రంగాల్లో స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన ఎంతమందికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రదానం చేశారు ?
జ: 47 మందికి
06) విదేశీ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అర్జెంటీనాలో పర్యటిస్తున్నారు. ఆ దేశ ఉపాధ్యక్షురాలితో సమావేశం అయ్యారు. ఆమె పేరేంటి ?
జ: గాబ్రియెలా మిషెట్టి
07) దేశంలోని పిల్లల్లో పౌష్టికాహార లోపంపై నీతి ఆయోగ్ తయారు చేసిన నివేదిక పేరేంటి ?
జ: నవీన భారత్ @75
08) దేశంలో 6-13 నెలల చిన్నారుల్లో ఎంతశాతం మందికి పౌష్టికాహారం అందుతున్నట్టు నివేదిక పేర్కొంది ?
జ: 10శాతం మందికి
09) స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన గెడెడ్ రాకెట్ వ్యవస్థ పినాకను భారత్ ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది ?
జ: రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో
10) అధునాతన మార్గ నిర్దేశ వ్యవస్థ కలిగిన పినాకను అభివృద్ధి చేసిన సంస్థ ఏది ?
జ: హైదరాబాద్ లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్
11) పినాక ప్రాజెక్టుకు ఎవరు డైరక్టెర్ గా వ్యవహరించారు ?
జ: ఎంవీ రాజశేఖర్ ( ఈ ప్రయోగానికి BHVS నారాయణ మూర్తి నాయకత్వం వహించారు )
12) గుజరాత్ లోని కచ్ జిల్లా ఖటియా గ్రామంలో దాదాపు 4,600-5,200 యేళ్ళ నాటి శ్మసాన వాటిక వెలుగులోకి వచ్చింది. ఇది ఏ సంస్కృతి నాటిదని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ?
జ: హరప్పా సంస్కృతి
13) దేశంలోనే అతి వేగంగా ఏడు నెలల కాలంలోనే నిర్మాణం పూర్తి చేసుకున్న విద్యుత్ సబ్ స్టేషన్ ను మేఘా ఇంజనీరింగ్ ఎక్కడ నిర్మించింది ? ( లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది )
జ: అనంతపురం జిల్లా నంబూలపూలకుంట
14) నాగ్ పూర్ విమానాశ్రయ నిర్వహణ పనులను దక్కించుకున్న సంస్థ ఏది ?
జ: GMR ఎయిర్ పోర్ట్స్
15) భద్రతాపరమైన సమస్యలతో ఏ విమానాలను భారత్ లో పక్కన పెట్టాలని DGCA నిర్ణయించింది ?
జ: బోయింగ్ 737 మాక్స్
16) ఇప్పటిదాకా బోయింగ్ 737 మాక్స్ విమానాలను ఏయే దేశాలను నిలిపివేశాయి ?
జ: బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ
17) పెప్సీకో సంస్థకు చెందిన కుర్ కురే బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: నటి సమంత

అంతర్జాతీయం
18) దశాబ్ద కాలంలోనే మొదటిసారిగా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యలోకి కూరుకుపోయింది ?
జ: టర్కీ ( గడచిన 3 నెలల్లో ఆర్థికాభివృద్ధి : 2.4శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది )
19) ఏనుగు కంటే ఆరింతలు పెద్దదైన ఏ జంతువు యొక్క గడ్డకట్టిన కణాలను జపాన్ లోని కిందాయ్ విశ్వవిద్యాలయానికి చెందిన కెయ్ మియోమోటా శాస్త్రవేత్తల బృందం సైబీరియా మంచు ప్రాంతంలో కనుగొన్నది ?
జ: మామోత్
20) మామోత్ కు చెందిన గడ్డకట్టిన కణజాలలు ఎన్నేళ్ళ సంవత్సరాల కిందవిగా భావిస్తున్నారు ?
జ: 28 వేల సంవత్సరాలు
21) ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పేరుతో 50 పెన్స్ నాణేలను విడుదల చేసిన దేశం ఏది ?
జ: బ్రిటన్
22) కృష్ణ బిలాలపై అధ్యయనం చేసిన హాకింగ్ పేరుతో వెండి, బంగారంతో తయారు చేసిన నాణేలను బ్రిటన్ ఏ పేరుతో విడుదల చేసింది ?
జ: బ్లాక్ హోల్ కాయిన్స్ ( వీటి ధర 55, 795 పౌండ్లు)

తక్కువ టైమ్ లో మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేలా మా మాక్ టెస్టులు ఉపయోగపడతాయి. మెయిన్స్ కోసం (1) స్టేట్ మెంట్స్ (2) జతపరచండి (3) కాలక్రమంలో రాయండి మోడల్స్ లో ఇస్తున్నాం. (మెయిన్స్ ఎగ్జామ్స్ కంటే ముందే మాక్ టెస్టులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం.. )

SI/PC(MAINS) - 325 TESTS ( Telugu Medium)

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/

కొంతమంది off line టెస్టులు అడుగుతున్నారు.  బయట ఇనిస్టిట్యూట్స్ లో నిర్వహించే OFF LINE టెస్టులన్నీ గ్రాండ్ టెస్టులే.  అందువల్ల గ్రాండ్ టెస్టుల్లో అన్ని లెసన్స్, అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యే అవకాశం ఉండదు.  మేం  సబ్జెక్ట్ వారీగా లెసన్స్ కవర్ చేయడం వల్ల... మీరు ఓ ప్రణాళిక ప్రకారం చదువుకొని మాక్ టెస్టులు రాసుకోడానికి అవకాశం ఉంటుంది.  దాంతో మీరు చదివే ప్రతి లెసన్ కీ ఎగ్జామ్ రాసిన ఫీలింగ్ ఉంటుంది.  దయచేసి ఈ తేడాని గమనించండి.  Offline టెస్టులు గ్రాండ్ టెస్టులు రాసినప్పటికీ... ఈ ఆన్ లైన్ టెస్టులతో ఉన్న ప్రయోజనాన్ని గుర్తించండి.

మా మాక్ ఎ గ్జామ్స్ ఎలా ఉంటాయి ? ఈ వీడియో చూడండి

https://www.youtube.com/watch?v=grZO1YKRUfU