Tuesday, January 21

CURRENT AFFAIRS MAR 10

తెలంగాణ
01) రాష్ట్రంలో ఇప్పటి దాకా ఇసుక విక్రయిస్తున్న తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఇకపై ఏ బిజినెస్ కూడా చేయాలని నిర్ణయించింది ?
జ: గ్రానైట్
02) రాష్ట్రంలో 12 చోట్ల గ్రానైట్ వెలికితీయడానికి అనువైన ప్రాంతాలను TSMDC గుర్తించింది. వీటి నుంచి ఎన్ని క్యూబిక్ మీటర్ల గ్రానైట్ తీయొచ్చని భావిస్తోంది ?
జ: 4.40 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్
03) 2018-19 సంవత్సరానికి రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన ఎంత మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించనుంది ?
జ: రూ.534 కోట్లు
04) అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధ విశ్వవిద్యాలయంను ఎక్కడ నిర్మించడానికి మలేసియా ముందుకు వచ్చింది?
జ: నాగార్జున సాగర్ లో ( మలేసియాకి చెందిన DXN గ్రూపు రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టనుంది )
05) బౌద్ధ యూనివర్సిటీ నిర్మాణానికి ఎన్ని ఎకరాల స్థలం కావాలని మలేసియా కంపెనీ కోరుతోంది ?
జ: 40 ఎకరాల స్థలం

జాతీయం
06) పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారా సందర్శనకు వెళ్ళే భారతీయ భక్తుల కోసం ఎన్ని కోట్లతో కర్తార్ పుర్ టెర్మినల్ నిర్మించనుంది ?
జ: రూ.190 కోట్లు
07) సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ వి రమణ
08) సత్యభామ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డీమ్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: మరియాజీనా జాన్సన్
09) పిల్లలకు ట్యూటర్ గా పనికివచ్చే బోలో యాప్ ను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందించిన టెక్ దిగ్గజం ఏది ?
జ: గూగుల్
10) ఛత్తీస్ గఢ్ లోని నక్సల్స్ ఏరియాల్లో గిరిజనులపై పెట్టిన కేసులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఏది ?
జ: ఏ కె పట్నాయక్
11) గోండి గిరిజన జిల్లాల్లో ఆ భాషను బోధించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: మధ్యప్రదేశ్
12) నేషనల్ సెంటర్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
జ: న్యూఢిల్లీ
13) అల్ నగా 2019 సంయుక్త సైనిక విన్యాసాలు భారత్, ఏ దేశం మధ్య జరుగుతున్నాయి ?
జ: ఒమన్
14) ఇటీవల వార్తల్లోకి వచ్చిన రైస్ నాలెడ్జ్ బ్యాంక్ కు ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
జ: అసోం
15) తన మొదటి అటల్ బిహారీ వాజ్ పేయి లైఫ్ టైమ్ అవార్డ్ ను త్రిపుర ప్రభుత్వం ఎవరికి ప్రదానం చేసింది ?
జ: తంగా డార్లోంగ్ ( మ్యూజిషీయన్)
16) ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ( FAO) సంస్థకి భారత్ తరపున ఎవర్ని నామినేట్ చేశారు ?
జ: రమేష్ చంద్

తక్కువ టైమ్ లో మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేలా మా మాక్ టెస్టులు ఉపయోగపడతాయి. మెయిన్స్ కోసం (1) స్టేట్ మెంట్స్ (2) జతపరచండి (3) కాలక్రమంలో రాయండి మోడల్స్ లో ఇస్తున్నాం. (మెయిన్స్ ఎగ్జామ్స్ కంటే ముందే మాక్ టెస్టులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం.. )

SI/PC(M)/GR.1,2,3 - 325 TESTS ( Telugu Medium)

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/