Friday, September 20

CURRENT AFFAIRS – JUNE 29

తెలంగాణ
01) రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహిళా పారిశ్రామికవేత్తల కేంద్రం ( వీహబ్) పై నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ ప్రశంసలు కురిపించారు. దీన్ని ఏ సమావేశం సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు ?
జ: 2017లో జరిగిన ప్రపంచ మహిళా పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా
02) రాష్ట్రంలోని 138మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిరంతర విద్యుత్ సరఫరా కోసం హైదరాబాద్ లోని ఏ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా స్మార్ట్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించారు ?
జ: జీడిమెట్లలో
03) ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, మానవతామూర్తి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అబ్బూరి ఛాయాదేవి (86) హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆమె రాసిన ఏ సాహిత్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది ?
జ: తన మార్గం అనే కథా సంకలనం (2005)
04) అబ్బూరి ఛాయాదేవికి చెందిన ఏ సంపుటి గురించి 2000 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా పెట్టింది ?
జ: బోన్సాయ్ బతుకులు

జాతీయం
05) మొక్క జొన్న, వేరు సెనగల్లో ఏ విషపూరిత పదార్థం ఉండటం వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపం వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ?
జ: అఫ్లోటాక్సిన్
06) యాక్సిస్ బ్యాంక్, MSME మంత్రిత్వ శాఖ ప్రకటించిన 2018-19 సంవత్సరం ఉత్తమ SME అవార్డు హైదరాబాద్ కు చెందిన ఏ కంపెనీకి దక్కింది ?
జ: షణ్ముఖ అగ్రిటెక్ లిమిటెడ్
07) చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్ర ప్రబుత్వం వడ్డీ రేటు ఎంత శాతం తగ్గించింది ?
జ: 0.1 శాతం
08) ఆస్ట్రేలియా సాంకేతిక సహకారంతో రూ.650కోట్ల పెట్టుబడితో థర్మల్ సెల్ తయారీ పరిశ్రమను ఎక్కడ నెలకొల్పనున్నారు ?
జ: హైదరాబాద్ లో
09) ఒక్కసారి ఛార్జింగ్ తో 800 కిమీలు ప్రయాణించే సామర్థ్యం ఉన్న థర్మల్ సెల్ (హై ఎనర్జీ డెన్సిటీ స్టోరేజ్ డివైజ్ - హెడ్స్) ను ఆవిష్కరించిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్త ఎవరు ?
జ: డాక్టర్ పాట్రిక్ గ్లిన్
10) ప్రస్తుతం మార్కెట్లో ఉన్న లిథియాన్ బ్యాటరీ (దీని తయారీకి కోబాల్ట్, లిథియం వాడతారు ) కి బదులుగా వస్తున్న హెడ్స్ బ్యాటరీల్లో దేన్ని వాడతారు ?
జ: గ్రాఫైట్, సిలికాన్
11) గ్లోబల్ కన్సల్టింగ్ లీడర్ మెర్సర్ నిర్వహించిన కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేలో మన దేశంలోనే అత్యంత ఖరీదైన నగరంగా ఏది నిలిచింది ?
జ: ముంబై
12) ఆసియా పరంగా చూస్తే ముంబై ఎన్నో స్థానంలో ఉంది ?
జ: 67 వ ర్యాంక్
13) మెర్సర్ సంస్థ నిర్వహించిన అత్యంత ఖరైదన నగరాల్లో మిగతా నగరాలకు వచ్చిన ర్యాంకులు ఏవి ?
జ: ఢిల్లీ (118), చెన్నై (154), బెంగళూరు (179), కోల్ కతా (189)
14) భారత బ్యాడ్మింటన్ జాతీయ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్ కు గౌరవ డాక్టరేట్ ప్రకటించిన IIT ఏది ?
జ:IIT కాన్పూర్

అంతర్జాతీయం
15) ఐఫోన్, ఐపాడ్, ఐమ్యాక్ లాంటి యాపిల్ ఉత్పత్తులకు ఆకర్షణీయమైన డిజైన్స్ ఇచ్చిన చీఫ్ డిజైనర్ ఆ సంస్థ నుంచి వైదొలిగి సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయన పేరేంటి ?
జ: జానీ ఈవ్
16) గ్లోబల్ కన్సల్టింగ్ లీడర్ మెర్సర్ నిర్వహించిన కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా ఏది నిలిచింది?
జ: హాంకాంగ్ (వరుసగా రెండోసారి )
(నోట్ : మొత్తం 209 నగరాల్లో నిర్వహించిన సర్వేలో 8 నగరాలు ఆసియాలోనే ఉన్నాయి )
17) ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు, వాటికి వచ్చిన ర్యాంకులు తెలపండి ?
జ: టోక్యో (2), సింగపూర్ (3), సియోల్ (4), జ్యూరిక్ (5), షాంఘై (6)
18) ప్రపంచంలో తక్కువ ఖరీదైన నగరాల్లో ఏవి నిలిచాయి ?
జ: టునిస్ (209), తాష్కెంట్ (208), కరాచీ (207)
19) ఆస్ట్రేలియా అందాల పోటీల్లో మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియాగా నిలిచిన భారతీయ సుందరి ఎవరు ?
జ: ప్రియా సెరావ్
(నోట్: ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో సెరావ్ ఆస్ట్రేలియా తరపున ప్రాతినిధ్యం వహిస్తుంది )
20) జలాంతర్గామి నుంచి ప్రయోగించే JL3 అత్యాధునిక ఖండాంతర క్షిపణిని జూన్ 2న విజయవంతంగా ప్రయోగించినట్టు ప్రకటించిన దేశం ఏది ?
జ: చైనా
21) 2022లో జరిగే వింటర్ ఒలింపిక్ గేమ్స్ చరిత్రలో కొత్త అధ్యాయం సృష్టించనున్నాయి. ఈ పోటీల సందర్భంగా సహజ కార్బన్ డై ఆక్సైడ్ శీతలీకరణ వ్యవస్థను ఉపయోగించనున్నారు. ఈ పోటీలు ఎక్కడ జరగబోతున్నాయి ?
జ: బీజింగ్ (చైనా)
22) శని గ్రహం చుట్టూ తిరుగుతున్న భారీ చందమామ టైటన్ ను పరిశోధించడానికి అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ఏ డ్రోన్ ని పంపాలని నిర్ణయించింది ?
జ: డ్రాగన్ ఫ్లై
(నోట్: 2026లో ఈ డ్రోన్ ను ప్రయోగిస్తారు. ఇధి 2034లో టైటన్ ను చేరుకుంటుంది )
23) డేటా ఆధారంగా పనిచేసే IOT పరికరాలే లక్ష్యంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్ ఏది ?
జ: సైలెక్స్

 

Telangana Exams యూట్యూబ్ ఛానెల్ ద్వారా కరెంట్ ఈవెంట్స్, జనరల్ నాలెడ్జ్, TSPSC, APPSC, RRB, BANKS, LIC, ARMY, POLICE తదితర ఉద్యోగాలకు సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్, సబ్జెక్ట్ మెటీరియల్ క్లాసులు, సబ్జెక్ట్ నిపుణులు, విజేతల ఇంటర్వ్యూలు అందిస్తాం.

Please Subscribe our Channels for more updates & forward your friends, relatives

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true

మాస్టర్స్ టీవీ - For a Real News ( అన్ని వార్తలకు ఈ ఛానెల్ ను subscribe చేయండి)
https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ