Wednesday, May 22

CURRENT AFFAIRS – JUNE 28

రాష్ట్రీయం
1) ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: జస్టిస్ టి.బి. రాధాకృష్ణన్
(నోట్: ప్రస్తుతం రాధాకృష్ణన్ ఛత్తీస్ గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు)
2) ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టుకు ఎవరు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు ?
జ: రమేశ్ రంగనాథన్
3) తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
జ: హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.కె. జైశ్వాల్
4) తులసి మొక్క నుంచి క్యాన్సర్ ఔషధాన్ని తయారు చేస్తున్న సంస్థ ఏది ?
జ: వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ( NIT)
5) రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించనున్నారు ?
జ: జులై 2 నుంచి
6) తొలి విడతలో రూ.3600 కోట్లతో రాష్ట్రంలో ఎంతమందికి గొర్రెల పంపిణీ చేశారు ?
జ: 2.87లక్షల కుటుంబాలకు
7) గర్భిణి దశలో బాలింతల ఆరోగ్యంపై రాష్ట్ర సర్కారు అవలంభిస్తున్న మాతృత్వ పరిరక్షణకు ఏ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ?
జ: మాతృత్వ పురస్కారం (నేను 9కి కట్టుబడి ఉన్నాను అనే నినాదంతో ఏర్పాటు చేసిన పురస్కారం ఇది )
8) దేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగు ఎన్నో స్థానంలో నిలిచింది ?
జ: నాలుగో స్థానం
(నోట్: 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 7.19 శాతం మంది తెలుగును మాతృభాషగా ఎంచుకున్నారు. గతంలో తెలుగు మూడో స్థానంలో ఉండేది )

జాతీయం
9) భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ( UIDAI) ఛైర్మన్, గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ నిపుణుల కమిటీ సభ్యుడు ఎవరు ?
జ: జె.సత్యనారాయణ
10) సుఖోయ్ (SU 30MKI) రకానికి చెందిన యుద్ధ విమానాన్ని ఏ సంస్థ తయారు చేసింది ?
జ: HAL
11) దేశంలో ఉన్నత విద్య నియంత్రణకు ఉద్దేశించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్థానంలో ఏ సంస్థను తీసుకొచ్చేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ చట్టాన్ని తయారు చేసింది ?
జ: ఉన్నత విద్యా కమిషన్
12) భారత్ పేదరికాన్ని అధిగమిస్తుందని ఏ పేరుతో అమెరికాకి చెందిన బ్రూకింగ్స్ నివేదిక ఇచ్చింది ?
జ: ద స్టార్ట్ ఆఫ్ ఏ న్యూ పావర్టీ నరేటివ్
13) జాతీయ గణాంక దినంతో పాటు ఎవరి 125వ జయంతి సందర్భంగా రూ.125 స్మారక నాణెం, రూ.5 నాణేలను వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు 2018 జూన్ 29న విడుదల చేయనున్నారు ?
జ: పీసి మహల్ నోబిస్
14) జర్మనీలో జరిగిన ISSF జూనియర్ ప్రపంచ కప్ లో ప్రపంచ రికార్డు ప్రదర్శనతో స్వర్ణం గెలుచుకున్న భారత యువ షూటర్ ఎవరు ?
జ.: మను బాకర్

అంతర్జాతీయం
15) జీవం పుట్టుక గుట్టును తేల్చేందుకు జపాన్ ప్రయోగించిన హయబుసా-2 అంతరిక్ష నౌక ఏ గ్రహశకలానికి చేరుకుంది ?
జ: ర్యుగు
16) రాజీనామా చేసిన పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు ఎవరు ?
జ: నాసర్ జన్ జువా

SI/PC/VRO/GR.IV FREE MOCK TEST
మేము ఇస్తున్న ప్రశ్నల సరళి గురించి తెలుసుకోడానికి ఆదివారం నాడు ఇచ్చే స్పెషల్ టెస్ట్ ఒకటి ఉచితంగా అందిస్తున్నాం. ప్రాక్టీస్ చేసుకోండి. 100 నిమిషాలు కూర్చొని రాసే విధంగా సిద్ధమైన తర్వాతే టెస్ట్ ఓపెన్ చేసుకోండి. ఈ లింక్ ద్వారా ఎగ్జామ్ రాయొచ్చు.
https://telanganaexams.com/category/pc-vro-mock/

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
https://telanganaexams.com/mockmaterial/