Friday, May 24

CURRENT AFFAIRS – JUNE 27

రాష్ట్రీయం
01) ఏ ప్రాంతంలో 350 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఐటీ పరిశ్రమకు 28 కంపెనీలు తరలివస్తాయని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు ?
జ: బుద్వేల్ - కిస్మత్ పూర్
02) యాదాద్రికి కూడా MMTS రైలు అందుబాటులోకి వచ్చేందుకు ఘట్ కేసర్ - రాయగిరి వరకూ పొడిగింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతమొత్తం నిధులు మంజూరు చేసింది ?
జ: రూ.150 కోట్లు
03) పాస్ పోర్ట్ వెరిఫికేషన్ ను రికార్డు స్థాయిలో నాలుగు రోజుల్లోనే పూర్తి చేస్తున్నందుకు విదేశాంగశాఖ వరుసగా మూడోసారి రాష్ట్ర పోలీస్ శాఖకు ఏ అవార్డును ప్రదానం చేసింది ?
జ: పోలీస్ ఇనిస్టిట్యూషనల్ అవార్డు
04) కాళేశ్వరం ప్రాజెక్టు కింద అటవీ భూమికి బదులు ఎన్ని ఎకరాల్లో ప్రత్యామ్నాయ అడవిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 8417 ఎకరాలు

జాతీయం
05) పాస్ పోర్టు సేవలను మరింత సరళతరం చేసేందుకు కొత్తగా తెచ్చిన యాప్ ను విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రారంభించారు. ఆ యాప్ పేరేంటి ?
జ: మొబైల్ పాస్ పోర్ట్ అప్లికేషన్
06) ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ చంద్ర గ్రహణంగా చరిత్రలో నిలిచిపోయే బ్లడ్ మూన్ ఎప్పుడు ఏర్పడ నుంది ?
జ : 2018 జులై 27
07) ఆహార కల్తీకి పాల్పడితే ఏ శిక్ష విధించాలని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ సిఫార్సు చేసింది ?
జ: జీవిత ఖైదు, రూ.10లక్షల జరిమానా
08) మెర్సర్ సంస్థ నిర్వహించిన కాస్ట్ ఆఫ్ లివింగ్ లో ప్రపంచంలోనే ముంబై నగరం ఎన్నో స్థానం ఆక్రమించింది ?
జ: 55వ స్థానం
09) ప్రపంచంలోనే అతి తేలికైన ఉపగ్రహాన్ని చెన్నైకి చెందిన యువకులు రూపొందించారు. దాని బరువు ఎంత ?
జ: 33 గ్రాములు
(నోట్: చెన్నైలోని హిందుస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (హిట్స్) లో ఇంజనీరింగ్ చదువుతున్న హరికృష్ణన్, అమర్ నాథ్; గిరి ప్రసాద్, సుధీ రూపొందించారు )
10) జీఎస్టీ అమల్లోకి వచ్చి వచ్చే జులై 1 కి ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఢిల్లీలో GST వార్షికోత్సవాన్ని ఎక్కడ నిర్వహించనున్నారు ?
జ: అంబేద్కర్ భవన్
11) మహిళల విషయంలో అత్యంత ప్రమాదకరమైన దేశం భారత్ అని ఏ సర్వేని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది ?
జ: థాంప్సన్ రాయిటర్స్ ఫౌండేషన్
12) ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ లో ఏ యోగా గురు మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు ?
జ: బాబా రామ్ దేవ్
13) పాలస్తీనా శరణార్ధుల సంక్షేమం కోసం భారత్ ఎంత మొత్తం ఏర్పాటు అందించింది ?
జ: 50 లక్షల డాలర్లు ( రూ.34.16 కోట్లు )
14) సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తున్నట్టు ప్రకటించిన క్రికెట్ సంఘం ఏది ?
జ: ఢిల్లీ క్రికెట్ సంఘం
15) ISSF జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్ లో ప్రపంచ రికార్డు నెలకొల్చిన భారత షూటర్ ఎవరు ?
జ: సౌరభ్ చౌదరీ

అంతర్జాతీయం
16) ఎలిజిబెత్ రాణి ఆమోదం ద్వారా ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ ఎప్పటి లోగా వైదొలిగేందుకు బ్రెగ్జిట్ బిల్లు చట్ట రూపం దాల్చింది ?
జ: 2019 మార్చి
17) యూరోపియన్ యూనియన్ అదనపు టారిఫ్స్ నుంచి తప్పించుకోడానికి విదేశాల్లోనూ ప్లాంటు నెలకొల్పాలని నిర్ణయించిన అమెరికాకి చెందిన మోటార్ సైకిల్ తయారీ సంస్థ ఏది ?
జ: హార్లే డేవిడ్ సన్
18) భారత్ సహా నాలుగు ఆసియా దేశాల నుంచి దిగుమతి అయ్యే సోయాబీన్, ఇతర వస్తువులపై ట్యాక్సులు తగ్గించాలని నిర్ణయించిన దేశం ఏది ?
జ: చైనా
19) మెర్సస్ సంస్థ విడుదల చేసిన కాస్ట్ ఆఫ్ లివింగ్ నగరాల జాబితాలో మొదటి స్థానం దేనికి దక్కింది ?
జ: హాంకాంగ్

 

SI/PC/VRO/GR.IV FREE MOCK TEST
మేము ఇస్తున్న ప్రశ్నల సరళి గురించి తెలుసుకోడానికి ఆదివారం నాడు ఇచ్చే స్పెషల్ టెస్ట్ ఒకటి ఉచితంగా అందిస్తున్నాం. ప్రాక్టీస్ చేసుకోండి. 100 నిమిషాలు కూర్చొని రాసే విధంగా సిద్ధమైన తర్వాతే టెస్ట్ ఓపెన్ చేసుకోండి. ఈ లింక్ ద్వారా ఎగ్జామ్ రాయొచ్చు.
https://telanganaexams.com/category/pc-vro-mock/

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
https://telanganaexams.com/mockmaterial/

Comments are closed.