Wednesday, May 22

CURRENT AFFAIRS – JUNE 26

రాష్ట్రీయం
1) 2014-18 మధ్య నాలుగేళ్ళ కాలంలో తెలంగాణ ఎంతశాతం వృద్ధి రేటు నమోదు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్టు కాగ్ రిపోర్టులు చెబుతున్నాయి ?
జ: 17.2శాతం
(నోట్: రెండో స్థానంలో హరియాణా, 3 మహారాష్ట్ర నిలిచాయి )
2) ఏ ప్రాంతంలో మరో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయాలని నిపుణుల కమిటీ సూచించింది ?
జ: వనపర్తి
3) బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు ?
జ: ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా
4) కేంద్రం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ పై ఒక కోర్సును ప్రవేశపెట్టాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఏ సంస్థను ఆదేశించింది ?
జ: జాతీయ గ్రామీణ సంస్థల మండలి ( NCRI) హైదరాబాద్
(నోట్: మహాత్మాగాంధీ 150వ జయంతి (2018 అక్టోబర్ 2) నాడు దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు )
5) తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఎమ్మెస్కే జైస్వాల్
6) సీ షెల్స్ అధ్యక్షుడు డేనీ ఫార్ భారత్ కు సమర్పించిన ఏ రకం తాబేళ్ళ జతను త్వరలో హైదరాబాద్ జూకి తరలించనున్నారు ?
జ: భారీ అల్దాబ్రా తాబేళ్ళ జత
7) ఇటీవల హైదరాబాద్ లో మరణించిన కోకా రామచంద్రరావు ఏ రంగానికి చెందినవారు ?
జ: న్యాయ వ్యవస్థ
(నోట్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి )
8) ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకి ఎంపికైన ఆనంద లోకం కవితా సంపుటిని రచించినది ఎవరు ?
జ: నాదం శెట్టి ఉమామహేశ్వరరావు

జాతీయం
9) ఏ దేశంలో ఉమ్మడి నౌకా స్థావరంపై కలసి పనిచేయాలని భారత్ నిర్ణయించింది ?
జ: సీ షెల్స్
10) సీ షెల్స్ దేశంలోని ఏ దీవిలో భారత నౌకాదళ స్థావరం ఏర్పాటు చేయనున్నారు ?
జ: అసంప్షన్ దీవిలో
(నోట్: ఈ దీవి హిందూ మహా సముద్రంలో ఉంది )
11) రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమైన సీ షెల్స్ అధ్యక్షుడు ఎవరు ?
జ: డేనీ ఫార్
12) రక్షణ సామర్థ్యం బలోపేతం చేసుకునేందుకు సీ షెల్స్ కు భారత్ ఎంత రుణం ప్రకటించింది ?
జ: 10 కోట్ల డాలర్లు
13) సీ షెల్స్ దేశానికి ఇప్పటికే ఓ విమానాన్ని భారత్ బహుకరించింది. ఈనెల 29న మరో విమానాన్ని ఇవ్వనున్నారు. దాని పేరేంటి ?
జ: డోర్నియర్ విమానం
14) భారతీయ విద్యార్థులు చదువుకోడానికి అవకాశమిస్తూ స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిన దేశం ఏది ?
జ: కెనడా
15) వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం థర్డ్ జనరేషన్ EVM లను సిద్ధం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. వీటి తయారీ బాధ్యతను ఏయే సంస్థలకు అప్పగించింది ?
జ: ECIL (HYD), BEL ( BENGALORE)
16) EVM లకు సంబంధించి ఓటు వేసిన తర్వాత ఎవరికి ఓటు వేశామో చూసుకునేందుకు VVPAT మిషన్లను వాడనున్నారు. VVPAT అంటే విస్తరించండి ?
జ: ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ - VVPAT
17) ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీల్లో ఒకటైన ఫ్లెక్స్ ట్రానిక్స్ ఏ రాష్ట్రంలో రూ.585 కోట్లతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది ?
జ: ఆంధ్రప్రదేశ్
18) దేశంలో ఎమర్జన్సీ విధించి జూన్ 25 నాటికి 43 యేళ్ళు పూర్తయ్యాయి. ఏ ఏడాదిలో ఈ అత్యవసర పరిస్థితిని విధించారు ?
జ: 1975 జూన్ 25న
19) ఎమర్జన్సీ ఇండియన్ డెమోక్రసీస్ డార్కెస్ట్ అవర్ - పేరుతో పుస్తకం రాసినది ఎవరు. ( ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ పుస్తకాన్ని ఢిల్లీలో ఆవిష్కరించారు )
జ: ప్రసారభారతి ఛైర్మన్ ఎ.సూర్యప్రకాశ్
20) అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీలో జరిగిన ప్రపంచ కప్ స్టేజ్ 3 ఆర్చరీలో మహిళ రికర్వ్ విభాగంలో స్వర్ణం సాధించిన భారతీయ క్రీడాకారిణి ఎవరు ?
జ: దీపికా

అంతర్జాతీయం
21) టర్కీ అధ్యక్షుడిగా మళ్లీ ఎవరు ఎన్నికయ్యారు ?
జ: రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్
( నోట్: పార్టీ పేరు జస్టిస్ అండ్ డెవలప్ మెంట్ పార్టీ- ఏకేపీ)
22) ఆసియా క్రీడల్లో ఏ రెండు దేశాలు ఒక టీమ్ గా పోటీ పడాలని నిర్ణయించాయి ?
జ: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్ (8 బుక్స్) డిటైల్స్ కోసం క్లిక్ చేయండి  https://telanganaexams.com/books/

Telangana Exams మాక్ టెస్టుల డిటైల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి   https://telanganaexams.com/mock-tests/