Friday, February 28

CURRENT AFFAIRS JUNE 25

తెలంగాణ
01) మరుగుదొడ్ల వినియోగం, ఆకర్షణీయ రీతిలో మరుగు దొడ్ల నిర్మాణం, పరిశుభ్రత అంశాలపై స్వచ్ఛ మహోత్సవ్ 2019 పోటీల్లో ఎన్ని అవార్డులతో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది ?
జ: ఐదు అవార్డులతో
02) బహిరంగ మల విసర్జన రహిత జిల్లాల్లో దేశంలోనే మూడో స్థానం, రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిన జిల్లా ఏది ?
జ: పెద్ద పల్లి జిల్లా (కలెక్టర్ శ్రీదేవసేన)
03) జిల్లాల ప్రత్యేక విభాగంలో ఏ జిల్లా నిలిచింది ?
జ: వరంగల్ అర్బన్ జిల్లా
04) ప్రత్యేక వ్యక్తిగత విభాగంలో ఎవరికి అవార్డు దక్కాయి ?
జ: సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లికి చెందిన మొండి భిక్షపతి, జగిత్యాల జిల్లా శాంతక్కపల్లికి చెందిన మెరుపు రమ
05) భారత దేశంలోని వివిధ పర్యాటక ప్రదేశాల గురించి సమాచారం తెలిపే పుస్తకాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం ఆవిష్కరించారు. ఆ పుస్తకం పేరేంటి ?
జ: విహారి బుక్ 2019
06) కొత్త సచివాలయం, శాసన సభ నిర్మాణాలపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు ?
జ: ఛైర్మన్ గా రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
07) ఆకాశవాణి స్వాతంత్ర్య సమరయోధురాలు, కన్యాశుల్కం బుచ్చమ్మగా పిలిచే రిటైర్డ్ నాటక ప్రయోక్త హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆమె ఎవరు ?
జ: ఎంజీ శ్యామలాదేవి
(నోట్: 1960నుంచి హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో సుదీర్ఘకాలం పనిచేశారు )

జాతీయం
08) విదేశాల్లో భారతీయులు దాచిన బ్లాక్ మనీ ఎంతగా ఉన్నట్టు పార్లమెంటరీ స్థాయీ సంఘం అంచనా వేసింది. ?
జ: రూ.34, లక్షల కోట్లు
09) ఇకపై ఆధార్ కార్డును గుర్తింపు కార్డుగా వాడుకునేందుకు వీలు కల్పించే ఏ చట్టాన్ని సవరించడానికి లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది ?
జ: ఆధార్ చట్టం 2016
10) ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్నది ఎవరు ?
జ: విరాల్ ఆచార్య
11) బ్యాంకులు, NBFC సంస్థలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు దాఖలు చేసేందుకు వీలుగా RBI తన వెబ్ సైట్ లో ఓ అప్లికేషన్ ప్రవేశపెట్టింది. దాని పేరేంటి ?
జ: కంప్లయింట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (CMS)
12) 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ఏ విమానాల వల్లే భారత్ గెలిచిందని ఎయిర్ చీఫ్ మార్షల్ బి.ఎస్.ధనోవా తెలిపారు ?
జ: మిరాజ్ 2000
13) విదేశాంగమంత్రి జయ్ శంకర్ ను ఎక్కడి నుంచి రాజ్యసభ ఎంపీగా పంపాలని బీజేపీ నిర్ణయించింది ?
జ: గుజరాత్ నుంచి
14) నోయిడాలోని తమ SEZ క్యాంపస్ లో HR సేవల కోసం హ్యుమనాయిడ్ ను ప్రవేశపెట్టిన కంపెనీ ఏది ?
జ: టెక్ మహీంద్రా