Wednesday, May 22

CURRENT AFFAIRS – JUNE 24

రాష్ట్రీయం

1) జాతీయ ఆరోగ్య ముఖ చిత్రం-2018 ప్రకారం తెలంగాణలో ఒక కుటుంబానికి సగటున వైద్యానికి ఎంత ఖర్చవుతోంది ?

జ: రూ.26,092 (ఏపీలో రూ.33,671)

2) రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యానికి సగటు ఎంత ఖర్చవుతోంది ?

జ: రూ.13,698

3) ఆరోగ్య రంగంలో ప్రభుత్వాలు చేస్తున్న తలసరి ఖర్చు లెక్కిస్తే తెలంగాణలో ఎంత ?

జ: రూ.1,322 (ఏపీలో రూ.1,013)

4) కేంద్రం ప్రకటించిన  స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారాల్లో ఘనవ్యర్థాల నిర్వహణలో తెలంగాణలోని ఏ మున్సిపల్ కార్పొరేషన్ కు దేశంలోనే మొదటి స్థానం దక్కింది ?

జ: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (GHMC)

5) స్వచ్ఛ్ సర్వేక్షణ్ లో దక్షిణాదిలో ఉత్తమ స్వచ్ఛ పట్టణంగా ఏది ఎంపికైంది

జ: సిద్ధిపేట

6) ప్రజల మన్ననలు పొందిన పట్టణం కేటగిరీలో ఉత్తమ పురస్కారం దేనికి దక్కింది ?

జ: బోడుప్పల్

7) స్వచ్ఛ్ సర్వే క్షణ్ ఉత్తమ రాష్ట్రాల ర్యాంకుల్లో తెలంగాణకి ఎన్నో స్థానం దక్కింది ?

జ: ఏడో స్థానం

8) వ్యవసాయ రంగంలో వేగంగా ప్రగతి సాధిస్తున్నందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖకి అగ్రి పురస్కారాన్ని ఇచ్చిన సంస్థ ఏది ?

జ: ఇండియాటుడే గ్రూప్

(నోట్: స్కోచ్ సంస్థ కూడా వ్యవసాయ శాఖ ప్రగతికి ఒకటి, రైతు బంధుకు మరో రెండు పురస్కారాలు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర తూనికలు, కొలతల శాఖకి కూడా స్కోచ్ అవార్డు లభించింది )

9) ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ హైదరాబాద్ లో జరిగింది.  ఏ అంశంపై ఇక్కడ సదస్సు నిర్వహించారు ?

జ: సుస్థిరాభివృద్ది లక్ష్యాలతో భారతదేశ అభ్యున్నతి - కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక 2019

10) జర్మనీలో జరుగుతున్న కెమిస్ట్రీ కప్ బాక్సింగ్ టోర్నీలో  స్వర్ణం గెలుచుకున్న హైదరాబాదీ బాక్సర్ ఎవరు ?

జ: మహమ్మద్ హుసాముద్దీన్

జాతీయం

11) ఉగ్రవాదులను ఏరివేయడం ద్వారా శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు 4డీ విధానం ( డిఫెండ్, డెస్ట్రాయ్, డిఫీట్, డినై) ఏ రాష్ట్రంలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?

జ: జమ్ము కశ్మీర్ లో

12) 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో వ్యవసాయంలో నిమగ్నమైన ప్రధాన వృత్తిదారుల్లో హిందువులే అధికం. వారి శాతం ఎంత ?

జ: 45.40 శాతం

13) పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్నవారిలో 60శాతం మంది ఏ మతానికి చెందిన వారు ఉన్నారు ?

జ: ముస్లింలు

14) పునర్వినియోగానికి వీలు కాని క్యారీ బ్యాగులు, థర్మోకోల్ సహా అన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులపై 2018 జూన్ 23 నుంచి నిషేధాన్ని అమల్లోకి తెచ్చిన రాష్ట్రం ఏది ?

జ: మహారాష్ట్ర

15) దేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాల్లో ప్లాస్టిక్ పై సంపూర్ణ నిషేధం అమల్లో ఉంది ?

జ: 20 రాష్ట్రాల్లో

16) మెసోకార్డియో సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసినందుకు అమెరికాకి చెందిన కార్డియాక్ సర్జరీ జర్నల్ లో స్థానం దక్కించుకున్న NRI ఎవరు ?

జ: ప్రతీక్ భట్నాగర్

17) భారత్ లో దీపావళి నుంచి ఆన్ లైన్ వస్తు విక్రయాలు ప్రారంభించాలని నిర్ణయించిన ఇంటర్నెట్ దిగ్గజం ఏది ?

జ: గూగుల్

18) ప్రస్తుతం ఇ-కామర్స్ మార్కెట్ భారత్ లో ఎన్ని డాలర్లు ?

జ: 3850 కోట్లు

(నోట్: 2020 కల్లా 10 వేల కోట్ల డాలర్లు చేరుతుందని అంచనా )

 

అంతర్జాతీయం

19) అమెజాన్, ప్లిప్ కార్ట్ కు పోటీగా వస్తువుల అమ్మకాన్ని మొదలుపెడుతున్న ఇంటర్నెట్ దిగ్గజం ఏది ?

జ: గూగుల్

20) కనీసం 10 లక్షల డాలర్లు అమెరికాలో పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలకు ఏ వీసా పథకం కింద గ్రీన్ కార్డులు ఇవ్వాలని ప్రెసిడెంట్ ట్రంప్ సర్కార్ భావిస్తోంది ?

జ: EB-5

 

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్ (8 బుక్స్) డిటైల్స్ కోసం క్లిక్ చేయండి  https://telanganaexams.com/books/

Telangana Exams మాక్ టెస్టుల డిటైల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి   https://telanganaexams.com/mock-tests/