Wednesday, May 22

CURRENT AFFAIRS JUNE 23

రాష్ట్రీయం
01) తెలంగాణలో తొలి సైనిక్ పాఠశాలను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు.
జ: వరంగల్ జిల్లా ఎల్కుర్తి గ్రామంలో
02) పాస్ పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను నాలుగు రోజుల్లో పూర్తి చేస్తునందుకు గాను రాష్ట్ర పోలీస్ శాఖకు ఏ అవార్డు అందిస్తున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది ?
జ: ది బెస్ట్ వెరిఫికేషన్ అవార్డు (2017-18)
03)కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు దక్కించుకున్న ఇద్దరు తెలుగు వారు ఎవరు ?
జ: నారంశెట్టి ఉమా మహేశ్వర్ రావు ( ఆనందలోకం కవితా సంపుటి)
బాల సుధాకర్ మౌళి (ఆకు కదలని చోటు కవితా సంపుటి )
04) జాతీయ మహిళా కమిషన్ సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు ?
జ: త్రిపురాన వెంకట రత్నం
(నోట్: తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ )

జాతీయం
05) అల్ ఖైదాతో పాటు ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖోరాసన్ ప్రొవిన్స్ (ISKP) లను భారత ప్రభుత్వ ఏ చట్టం కింద నిషేధించింది ?
జ: Unlawful Activities (Prevention) act, 1967
06) బెస్ట్ ఫెర్ఫార్మింగ్ సోషల్ సెక్టార్ మినిస్ట్రీ కింద స్కోచ్ అవార్డు ఏ శాఖకు దక్కింది ?
జ: కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ
07) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగో మేనేజింగ్ డైరక్టర్ గా ఎవరిని ప్రభుత్వం నియమించింది ?
జ: అర్జిత్ బసు
08) 2018 అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి ?
జ: Yoga for Harmony and Peace
09) Asian Infrastructure Investment Bank (AIIB) యొక్క మూడో వార్షిక సమావేశం ఎక్కడ జరుగుతోంది ?
జ: ఇండియా (ముంబైలో జూన్ 25-26, 2018)
10) 2018 అంబు బాచి మేళా ఏ రాష్ట్రంలో జరుగుతుంది ?
జ: అసోం
11) Sports Illustrated's Sportsperson (2017) అవార్డు అందుకున్న భారతీయ క్రీడాకారుడు ఎవరు ?
జ: కిదాంబి శ్రీకాంత్

అంతర్జాతీయం
12) ప్రపంచంలో ఆకలితో బాధపడుతున్న వారి నివేదికను ఐక్యరాజ్యసమితి ఏ పేరుతో విడుదల చేసింది ?
జ: ఐరాస సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDG) 2018
13) ఐరాస నివేదిక ప్రకారం 2016లో ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లేమితో బాధపడుతున్న వారి సంఖ్య ఎంత ?
జ: 81.5 కోట్లు
(నోట్: 2015లో 77.7 కోట్లు ఉండగా, 3.8కోట్లు అదనంగా పెరిగింది)
14) ఏ దేశంతో జాతీయ అత్యవసర పరిస్థితిని మరో ఏడాది పొడిగిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది ?
జ: ఉత్తరకొరియాతో
15) ప్రముఖ ఉర్దూ విమర్శకుడు ముస్తాఖ్ అహ్మద్ యూసుఫీ ఇటీవల చనిపోయారు. ఆయన ఏ దేశానికి చెందినవారు ?
జ: పాకిస్తాన్
16) పులిట్జర్ అవార్డు గ్రహీత, కాలమిస్ట్ చార్లెస్ క్రాథమ్మర్ ఇటీవల చనిపోయారు. ఆయన ఏ దేశానికి చెందిన వారు ?
జ: అమెరికా
17) వరల్డ్ మ్యూజిక్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు ?
జ: జూన్ 21

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్ (8 బుక్స్) డిటైల్స్ కోసం క్లిక్ చేయండి  https://telanganaexams.com/books/

Telangana Exams మాక్ టెస్టుల డిటైల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి   https://telanganaexams.com/mock-tests/