Wednesday, November 13

CURRENT AFFAIRS JUNE 23 & 24

తెలంగాణ
01) నదీ జలాల వినియోగాలు, సమస్యలపై చీఫ్ ఇంజనీర్ ఎస్. నరసింహారావు రాసిన పుస్తకాన్ని ముఖ్యంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఆ పుస్తకం పేరేంటి ?
జ: అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాలు (ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ )
02) తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరితో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు ?
జ: జస్టిస్ ఆర్.ఎస్. చౌహాన్ తో
03) కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛ సుందర శౌచాలయ అవార్డు ఏ జిల్లాకి దక్కింది ?
జ: పెద్దపల్లి జిల్లా ( జిల్లా కలెక్టర్: శ్రీదేవసేన)
04) రాష్ట్రంలో ఆధునిక గొర్రెల పరిశోధనా కేంద్రంను ఎక్కడ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి పశు సంవర్ధక శాఖ ప్రతిపాదనలు పంపింది ?
జ: సిద్ధిపేట లేదా మహబూబ్ నగర్ జిల్లాలో
05) గతంలో పెళ్ళిళ్ళను సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో రిజిష్టర్ చేసేవారు. అయితే ఇప్పుడు ఎక్కడ రిజిష్టర్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది ?
జ: గ్రామ పంచాయతీల్లో
06) రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఆదిమానవుడి ఆనవాళ్ళని తెలంగాణ జాగృతి పరిశోధకులు గుర్తించారు ?
జ: మంచిర్యాల జిల్లా జైపూర్ ప్రాంతంలో
07) రాష్ట్రంలో వాహనాల వేగానికి కళ్ళెం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం వాణిజ్య వాహనాల గరిష్ట వేగం ఇకపై ఎంతగా నిర్ణయించబోతున్నారు ?
జ: 80 కిలోమీటర్లు

జాతీయం
08) ఏ హైకోర్టు జడ్జిని పదవి నుంచి తొలగించేందుకు అభిశంసన ప్రక్రియ ప్రారంభించాలని ప్రధాని నరేంద్రమోడీకి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ లెటర్ రాశారు ?
జ: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎన్. శుక్లా
(నోట్: 2017-18 విద్యా సంవత్సరంలో ప్రైవేటు వైద్య కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశానికి సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించినట్టు ఆరోపణలున్నాయి )
09) సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పెండింగ్ కేసుల పరిష్కారానికి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద తాత్కాలిక ప్రాతిపదికన రిటైర్డ్ న్యాయమూర్తులను నియమించాలని CJI జస్టిస్ రంజన్ గొగొయ్ కేంద్రానికి లెటర్లు రాశారు ?
జ: 128, 224 ఎ అధికరణాలు

అంతర్జాతీయం
10) ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు ఇదే రకంగా కొనసాగితే ఈ శతాబ్దం అంతానికి గ్రీన్ ల్యాండ్ లో ఎంతశాతం మంచు కరుగుతుందని లేటెస్ట్ సర్వేలో వెల్లడైంది ?
జ: 4.5శాతం
11) విదేశీయులకు శాశ్వత నివాస పథకాన్ని సౌదీ అరేబియా ప్రకటించింది. అయితే ఈ కొత్త పథకంలో భాగంగా ఎంత్త మొత్తం సౌదీ ప్రభుత్వానికి చెల్లిస్తే పర్మినెంట్ రెసిడెన్స్ సౌకర్యం కల్పిస్తారు ?
జ: 8 లక్షల రియాద్ లు...( రూ.21 కోట్లు లేదా 2.313 లక్షల అమెరికా డాలర్లు )
12) హాలే ఓపెన్ గ్రాస్ టోర్నీ టైటిల్ ను పదోసారి గెలుచుకున్న టెన్నిస్ దిగ్గజం ఎవరు ?
జ: రోజర్ ఫెదరర్
13) వెయ్యి కోట్లతో (145 మిలియన్ అమెరికన్ డాలర్లు ) అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కొత్త కార్యాలయం ఎక్కడ ప్రారంభమైంది ?
జ: లుసానె (స్విట్జర్లాండ్ )
(నోట్: ఈ కార్యాలయాన్ని IOC అధ్యక్షుడు థామస్ బాచ్ 2019 జూన్ 23న ప్రారంభించారు. ఒలింపిక్ క్రీడలను పునరుద్దరించి 125యేళ్ళయిన సందర్భంగా ఈ భవనం ప్రారంభించారు )
14) శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని పొడిగిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏ నెలలో జరిగిన ఆత్మాహుతి దాడి తర్వాత శ్రీలంకలో ఎమర్జన్సీ విధించారు ?
జ: 2019 ఏప్రిల్ లో