Wednesday, May 22

CURRENT AFFAIRS – JUNE 22

రాష్ట్రీయం
1) ఫింగర్ ప్రింట్ బ్యూరో 19వ జాతీయ స్థాయి సమావేశాలు హైదరాబాద్ లో ఎక్కడ జరిగాయి ?
జ: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ
2) రైతు బంధు జీవిత బీమా పథకానికి రాష్ట్రప్రభుత్వం ఎంతమొత్తం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ?
జ: రూ.500 కోట్లు
3) ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కంపా నిధులు జారీ చేస్తుంది. కంపా పూర్తి పేరేంటి ?
జ: కాంపన్సెటరీ ఎఫారెస్టేషన్ మేనేజ్ మెంట్ ప్లానింగ్ అథారిటీ
4) కృష్ణా నది నీటి కొలతలకు సంబంధించి తెలంగాణ, ఏపీల్లో ఎన్ని చోట్ల టెలీమెట్రీలను ఏర్పాటు చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది ?
జ: 14 చోట్ల
5) హైదరాబాద్ లో పర్యటించిన కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్ ఎవరు ?
జ: రాధాకృష్ణ మాధుర్
6) 100శాతం LED వెలుగులతో దేశంలోనే మొదటి రైల్వే జోన్ గా గుర్తింపు పొందినది ఏది ?
జ: దక్షిణ మధ్య రైల్వే
7) ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారం అందుకున్న సుప్రసిద్ధ కూచిపూడి నాట్య కళాకారిణి ఎవరు ?
జ: భావనా రెడ్డి

జాతీయం
8) 2018 జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు ?
జ: డెహ్రాడూన్
9) ఇంటర్నేషనల్ యోగా డే సందర్బంగా భారీ సంఖ్యలో యోగా చేసి గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కిన సిటీ ఏది?
జ: కోటా ( రాజస్థాన్ )
(నోట్: ఇక్కడ 60 వేల మంది యోగాసనాలు వేశారు )
10) యోగాని అభివృద్ధి చేయడంలో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఏ సంస్థకు 2018 ప్రైమ్ మినిస్టర్స్ అవార్డు లభించింది ?
జ: ది యోగ ఇనిస్టిట్యూట్ ఇన్ ముంబై
(నోట్: దీన్ని 1918లో స్థాపించారు )
11) రైళ్ళల్లో ప్రయాణీకుల సమస్యలను తీరుస్తూ సౌకర్యవంతమైన ప్రయాణం చేయడానికి ఏ విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు ?
జ: ట్రైన్ కెప్టెన్
12) అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఎన్ని వస్తువులపై కేంద్ర ప్రభుత్వం ట్యాక్సులు పెంచింది ?
జ: 29 ఉత్పత్తులు
13) ఇండియా-INC టాప్ 100 పేరుతో విడుదల చేసిన వందమంది జాబితాలో చోటు దక్కించుకున్న ప్రముఖ NRI వ్యాపారవేత్త ఎవరు ?
జ: లార్డ్ కరణ్ బిలిమోరియో ( యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్ హామ్ ఛాన్స్ లర్, వ్యాపారవేత్త )
14) 2018 జూన్ 22 నాడు పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి ఎవరు ?
జ: జస్టిస్ జాస్తి చలమేశ్వర్
15) స్మార్ట్ సిటీస్ మిషన్ లో భాగంగా ఏ రాష్ట్ర రాజధానిని 100వ స్మార్ట్ సిటీగా గుర్తించారు ?
జ: షిల్లాంగ్ ( మేఘాలయ రాజధాని )
16) స్మార్ట్ సిటీల అభివృద్ధిలో దూసుకుపోతున్న ఈ సిటీ ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డ్ 2018 దక్కించుకుంది ?
జ: సూరత్
17) రాష్ట్రంలో పచ్చదనం పెంచుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు i-Hariyali పేరుతో స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: పంజాబ్
18) ఏడవ ఇండియా మినరల్స్ అండ్ మెటల్స్ ఫోరమ్ 2018 సదస్సు ఏ సిటీలో జరిగింది ?
జ.: న్యూ ఢిల్లీ ( 2018 జూన్ 21న)
19) మహిళలపై వేధింపులు, నేరాలను అడ్డుకునేందుకు 24x7 GPS మరియు వైర్ లెస్ బేస్డ్ మొబైల్ పోలిసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: త్రిపుర
20) భారత్ తయారీ ఆర్టిలరీ గన్ కు ఇటీవల తుది పరీక్షలు నిర్వహించి సైన్యానికి అందజేయాలని నిర్ణయించారు. దాని పేరేంటి ?
జ: ధనుష్
21) కంకారియా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: గుజరాత్
22) ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ఎవరు ?
జ: అనుపమ్ ఖేర్
23) భీమ్ శంకర్ ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: పుణె, మహారాష్ట్ర
24) FDI ని విస్తరించండి ?
జ: Foreign Direct Investment

అంతర్జాతీయం
25) అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ నుంచి ఇటీవల తప్పుకున్న దేశం ఏది ?
జ: అమెరికా
26) ఇటీవల చనిపోయిన పీటర్ థామ్సన్ ఏ క్రీడకు చెందిన ప్రముఖుడు ?
జ: గోల్ఫ్ ( ఆస్ట్రేలియా )
27) 2018 జూన్ 14, 15 తేదీల్లో 28వ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ప్లీనరీ మీటింగ్ ఎక్కడ జరిగింది ?
జ: జుర్మాల, లాట్వియా
28) ఇంటర్నేషనల్ పిక్ నిక్ డే ని ఎప్పడు నిర్వహించారు ?
జ: జూన్ 18

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్ (8 బుక్స్) డిటైల్స్ కోసం క్లిక్ చేయండి  https://telanganaexams.com/books/

Telangana Exams మాక్ టెస్టుల డిటైల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి   https://telanganaexams.com/mock-tests/