Wednesday, May 22

CURRENT AFFAIRS JUNE 21

రాష్ట్రీయం
1) జినోమ్ వ్యాలీలో భారీ ఔషధ పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఫెర్రింగ్ సంస్థ ఏ దేశానికి చెందినది ?
జ: స్విట్జర్లాండ్
2) 19వ అఖిల భారత వేలిముద్రల సంస్థ (ఫింగర్ ప్రింట్ బ్యూరో ) సంచాలకుల సదస్సు ఎక్కడ జరగనుంది ?
జ: హైదరాబాద్ లో
3) నల్గొండ జిల్లాలో బుద్ధుని జాడలు ఉన్నాయనడానికి ఇటీవల ఏ గుట్టపై బౌద్ధ నాగ ముచుళింద విగ్రహం దొరికింది ?
జ: పరడలో
4) ఏడాదికి 5లక్షలకు పైగా పాస్ పోర్టులు అందిస్తున్న ఏ కేటగిరీ పాస్ పోర్ట్ ఆఫీసుల్లో నెంబర్ 1గా నిలిచినది ఏది ?
జ: హైదరాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్
(ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి డాక్టర్ విష్ణు వర్ధన్ రెడ్డి )

జాతీయం
5) నాలుగేళ్ళ పాటు కేంద్ర ఆర్థిక శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా వ్యవహరిస్తున్న ఎవరు ఆ పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నారు ?
జ: అరవింద్ సుబ్రమణియన్
6) LRS స్కీమ్ కింద అప్లయ్ చేసుకునేవారికి PAN నెంబర్ ను తప్పనిసరి చేస్తూ RBI ఆదేశాలిచ్చింది. LRS అంటే ఏంటి ?
జ: Liberalised Remittance Scheme
7) సిక్కిం ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్ గా ఎవర్ని నియమించింది ?
జ: ఎ.ఆర్. రెహమాన్
8) మానవ వనరుల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాని అభివృద్ధి చేసిన IIT ఏది ?
జ: IIT ఖరగ్ పూర్
9) ఇన్సూరెన్స్ మార్కెటింగ్ సంస్థలకు సంబంధించి నియమ నిబంధలను పరిశీలించేందుకు IRDAI ఏర్పాటు చేసిన కమిటీ ఏది ?
జ: సురేష్ మాథూర్ కమిటీ
10) ఈ ఏడాదిని దేశ రక్షణలో ఉండగా గాయపడిన సైనికుల కోసం కేటాయించిన భారత సైనిక దళం ఏది ?
జ: ఇండియన్ ఆర్మీ
11) దేశంలో వరద పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ఏ ఐటీ దిగ్గజంతో టైఅప్ అయింది ?
జ: గూగుల్
12) భారత్ లోని జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఇంటర్నెట్ దిగ్గజం ఏది ?
జ: గూగుల్
13) కఝిముగమ్ అనే నవల రాసిన పెరుమాళ్ మురుగన్ ఏ భాషకు చెందిన రచయిత ?
జ: తమిళం
14) మిస్ ఇండియా అందాల పోటీలో విజేతగా నిలిచిన తమిళనాడు అమ్మాయి ఎవరు ?
జ: అనుక్రీతి
(నోట్: రెండో స్థానంలో మీనాక్షి చౌధరి, మూడో స్థానంలో శ్రేయా )
15) NCERT ఆధ్వర్యంలో నేషనల్ యోగా ఒలింపియాడ్ ఢిల్లీలో జరిగింది. ప్రస్తుతం ఈ సంస్థ డైరక్టర్ ఎవరు ?
జ: హృషికేష్ సేనాపతి
16) ప్రజా వ్యతిరేకతతో భారత సైనిక శిబిరం ఏర్పాటును తిరస్కరించి, ఇటీవల వార్తల్లోకి ఎక్కిన దీవి పేరేంటి ?
జ: సేచెల్లెస్ ( Seychelles)
17) 23వ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏ నగరంలో ప్రారంభమైంది ?
జ: న్యూ ఢిల్లీ
18) లింబారామ్ కి రూ.5 లక్షలు ప్రత్యేక ఆర్థికసాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయన ఏ క్రీడాకారుడు ?
జ: ఆర్చరీ

అంతర్జాతీయం
19) ఐక్యరాజ్య సమితి హక్కుల మండలి నుంచి వైదొలిగిన అగ్ర రాజ్యం ఏది ?
జ: అమెరికా
20) గుండెపోటు నివారణ కోసం హృదయంలో రక్త ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు స్మార్ట్ స్టంట్ ను ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు ?
జ: బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ
21) రిక్రియేషన్ కోసం మారిజూనా మత్తు మందు వాడకాన్ని న్యాయబద్ధం చేసిన G7 దేశం ఏది ?
జ: కెనడా
22) 118వ యూఎస్ ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ 2018 ని గెలుచుకున్నది ఎవరు ?
జ: బ్రూక్స్ కోప్కా
23) కొలంబియా కొత్త అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
జ: ఇవాన్ డుక్యూ మార్ఖూజ్ (Ivan Duque Marquez)

Comments are closed.