Friday, July 19

CURRENT AFFAIRS – JUNE 21 & 22

తెలంగాణ
01) కాళేశ్వరం మహా ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ?
జ: మేడిగడ్డ బ్యారేజ్
02) కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న మూడు రాష్ట్రాల సీఎంలు ఎవరు ?
జ: తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
03) దక్షిణ కొరియాలోని బుసాన్ నగరంలో 2019 జులై 11న జరిగే 9వ ప్రపంచ యువజన మంత్రుల సమ్మేళనంలో పాల్గొనేందుకు భారత్ తరపున మన రాష్ట్రానికి చెందిన ఏ మంత్రికి ఆహ్వానం అందింది ?
జ: మంత్రి శ్రీనివాస్ గౌడ్
04) రాష్ట్రంలో ఐదో విడత హరిత హారాన్ని ఎప్పుడు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 2019 జులై 5 నుంచి
05) న్యూయార్క్ లో క్రిస్టీ సంస్థ వేసిన వేలంలో గోల్కొండ వజ్రం ఆర్కాట్ 2 ఎంతకు అమ్ముడు పోయింది ?
జ: రూ.23.5 కోట్లు

జాతీయం
06) 2019 జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఎక్కడ జరిగిన యోగా వేడుకల్లో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు ?
జ: రాంచీలోని ప్రభాత్ తారా మైదానంలో
07) కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి తమ శాఖలో ఏయే వ్యవహారాలను అప్పగించారు ?
జ: జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలు
08) భారత వృద్ధి రేటులో డీబీఎస్ బ్యాంక్ కోత విధించింది. 2019-20లో ఎంత శాతం ఉంటుందని బ్యాంక్ అంచనా వేసింది ?
జ: 6.8 శాతం
09) అధునాతన పరిజ్ఞానంతో దేశంలో ఆరు జలంతర్గాములను నిర్మించేందుకు భారత నౌకాదళం సిద్ధమైంది. P75(i) ప్రాజెక్ట్ కింద చేపట్టే ఈ కార్యక్రమానికి ఎంత బడ్జెట్ అవుతుంది ?
జ: రూ.45 వేల కోట్లు
10) బాలాకోట్ పై వైమానిక దాడులకు భారత వైమానిక దళం ఏమని పేరు పెట్టింది ?
జ: ఆపరేషన్ బందర్ (కోతి)
11) బూజు పట్టిన తిండి గింజలు, మసాలా దినుసులు తింటే జబ్బులు వస్తాయన్న అంశంపై లోతైన అధ్యయనానికి హైదరాబాద్ లోని జాతీయ పోషకాహార సంస్థ ( NIN) ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: బ్రిటన్ కు చెందిన అబెర్డీన్ వర్సిటీ

అంతర్జాతీయం
12) 2022 కామన్వెల్త్ క్రీడల నుంచి భారత్ కు పతకాల పంట పండించే ఏ ఆటను తీసేశారు ?
జ: షూటింగ్
13) 2022 కామన్వెల్త్ క్రీడల్లో కొత్తగా వేటిని చేర్చాలని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య ఎగ్జిక్యూటివ్ బోర్డ్ నిర్ణయించింది ?
జ: మహిళల క్రికెట్, బీచ్ వాలీబాల్, పారా టేబుల్ టెన్నిస్