Wednesday, May 22

CURRENT AFFAIRS – JUNE 20

రాష్ట్రీయం
1) పద్మశ్రీ నేరేళ్ళ వేణు మాధవ్ వరంగల్ లో చనిపోయారు. ఆయన ఏ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ ప్రముఖుల గొంతులను అనుకరించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు ?
జ: 1971లో
2) ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ ఆహార పానీయాల సంస్థ జార్జెస్ మొనిన్ సాస్ తెలంగాణలోని ఏ జిల్లాలో వంద కోట్ల పెట్టుబడితో పరిశ్రమ స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: మేడ్చల్ జిల్లాలో
3) వ్యవసాయ రంగంలో అభివృద్ధి, రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలును గుర్తిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖకి అగ్రి అవార్డు ప్రకటించిన సంస్థ ఏది ?
జ: ఇండియా టుడే గ్రూప్
4) ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు - 2018 కి ఎంపికైన రాష్ట్రానికి చెందిన కూచిపూడి నృత్య కళాకారిణి ఎవరు ?
జ: దీపికా రెడ్డి

జాతీయం
5) బీజేపీ మద్దతు ఉపసంహరణతో జమ్ము కశ్మీర్ లో బీజేపీ-పీడీపీ ప్రభుత్వం పడిపోయింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర గవర్నర్ ఎవరు ?
జ: N.N. వోరా
6) దేశంలో ఏ రాష్ట్రంలోనైనా శాంతి భద్రతల పరిస్థతులు బాగోలేకపోతే 356 ఆర్టికల్ కింద రాష్ట్రపతి పాలన విధిస్తారు. కానీ గవర్నర్ పాలన మాత్రమే విధించే రాష్ట్రం ఏది ?
జ: జమ్ము కశ్మీర్
7) జమ్ము కశ్మీర్ లో గవర్నర్ పాలన విధించే ఏర్పాటు ఆ రాష్ట్ర రాజ్యాంగంలోని ఏ సెక్షన్ లో ఉంది ?
జ: 92 వ సెక్షన్
(నోట్: 370వ అధికరణం ప్రకారం జమ్ము కశ్మీర్ పై కేంద్ర ప్రభుత్వానికి పరిమిత అధికారాలు ఉన్నాయి )
8) జమ్ము కశ్మీర్ లో 1965 వరకూ ఆ రాష్ట్రానికి ప్రభుత్వాధినేతగా గవర్నర్ కు బదులు ఎవరు ఉండేవారు ?
జ: సదర్ రిసాయత్
(నోట్: ముఖ్యమంత్రికి బదులు ప్రధానమంత్రి అనేవారు )
9) ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన ప్రపంచంలోని అపర కుబేరుల జాబితాలో భారత్ కి ఎన్నో స్థానం దక్కింది ?
జ: 11వ స్థానం (మొత్తం 2.63లక్షల మంది కోటీశ్వరులు ఉన్నారు )
10) తెలుగు, తమిళం సహా ఆరు ప్రాంతీయ భాషల్లో జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించిన సాంకేతిక దిగ్గజం ఏది ?
జ: గూగుల్
11) రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ లో ఉన్న ఏ ఆర్టికల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో కిసాన్ పుత్ర ఆందోళన్ పిటిషన్ వేసింది ?
జ: 31బి
(నోట్: ఈ ఆర్టికల్ కింద చేర్చిన చట్టాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావు )

అంతర్జాతీయం
12) అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచుల్లో 481 పరుగులు చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన క్రికెట్ జట్టు ఏది ?
జ: ఇంగ్లండ్
(నోట్: నాటింగ్ హామ్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఈ రికార్డు సృష్టించింది )
13) గతంలో ఇంగ్లండ్ పేరిట ఉన్న 444 పరుగుల ప్రపంచ రికార్డును ఏ దేశంపై సాధించింది ?
జ: పాకిస్తాన్ (2016లో )
14) మానవులతో అనర్గళంగా చర్చాగోష్టిని జరిపే కంప్యూటర్ ను కృత్రిమ మేథ ద్వారా IBM అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఆవిష్కరించింది. దాని పేరేంటి ?
జ: ప్రాజెక్ట్ డిబేటర్
15) ఫోర్బ్స్ ప్రకటించిన అపర కుబేరుల జాబితాలో మొదటి స్థానం ఎవరికి దక్కింది ? (141.9బిలియన్ డాలర్లు అంటే దాదాపు 9.5లక్షలన కోట్లు)
జ: జెఫ్ బెజోస్ ( అమెజాన్ వ్యవస్థాపకుడు )
16) ఫోర్బ్స్ జాబితాలో రెండో అపర కుబేరుడుగా ఎవరు నిలిచారు ?
జ: మైక్రో సాఫ్ట్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్
(92.9 బిలియన్ డాలర్లు)

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్ (8 బుక్స్) డిటైల్స్ కోసం క్లిక్ చేయండి  https://telanganaexams.com/books/

Telangana Exams మాక్ టెస్టుల డిటైల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి   https://telanganaexams.com/mock-tests/