Friday, May 24

CURRENT AFFAIRS – JUNE 19

రాష్ట్రీయం
1) పోలీస్ శాఖలో DGP నుంచి కానిస్టేబుల్ దాకా 63 వేల మంది ఒకే యాప్ ద్వారా గ్రూపులో ఉండేలా కొత్త మెసెంజర్ వ్యవస్థను డీజీపీ మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. దాని పేరేంటి ?
జ: కాప్ - కనెక్ట్ యాప్
2) రాష్ట్రంలోని జైళ్ళల్లో ఉన్న ఖైదీలను సంస్కరించే ఉద్దేశంతో జైళ్ళ శాఖ డీజీ వి.కే.సింగ్ ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు ?
జ: ఉన్నతి పథకం

జాతీయం
3) 2018-19 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు ఎంతశాతానికి పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 3.3శాతం
4) వీడియో కాన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ICICI CEO చందాకొచ్చర్ సెలవుపై వెళ్తున్నారు. ఆమె స్థానంలో COO గా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారు ?
జ: సందీప్ బక్షి
5) భారత తీర గస్తీ దళ సేవలను 2023 నాటికి 200 నౌకలతో శక్తివంతం చేయనున్నారు. విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ నిర్మించిన ఏ నౌకను ICG అదనపు డైరక్టర్ జనరల్ వి.ఎస్.ఆర్. మూర్తి ప్రారంభించారు ?
జ: రాణి రాష్మోణి
6) భారతీయ తీర గస్తీ దళానికి ప్రస్తుతం ఎన్ని నౌకలు ఉన్నాయి ?
జ: 136 నౌకలు
7) తేయాకు తోటల్లో వాడటానికే అనుమతి ఉన్న ఏ పురుగు మందును బీటీ-3 పత్తి విత్తనాల్లో వాడకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధించింది ?
జ: గ్లైఫొసేట్

అంతర్జాతీయం
8) సైన్యంలో కొత్తగా స్పేస్ ఫోర్స్ (అంతరిక్ష దళం) ఏర్పాటు చేయాలని నిర్ణయించిన దేశం ఏది ?
జ: అమెరికా ( ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలిచ్చారు )
9) అమెరికాలో అక్రమ వలసదారుల నుంచి వారి పిల్లలను వేరు చేయడానికి సంబంధించిన వలస నిబంధనలపై విమర్శలు వస్తున్నాయి. ఈ విధానం పేరేంటి ?
జ: జీరో టాలరెన్స్