Friday, July 19

CURRENT AFFAIRS – JUNE 15

తెలంగాణ
01) బీసీల్లోకి ఎన్ని కులాలను చేర్చడంపై బీసీ కమిషన్ ముందుకు ప్రతిపాదనలు వచ్చాయి ?
జ: 30 కులాలు
02) 1890నాటికి తెలంగాణకి చెందిన విలువైన ఆభరణం (దాదాపు 10 కోట్ల విలువైనది) న్యూయార్క్ లో అమ్మకానికి పెట్టిన సంస్థ ఏది ?
జ: క్రిస్టీ సంస్థ
03) రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో ఆర్జిత సేవలు, అద్దె గదుల సౌకర్యం పొందేందుకు ఆన్ లైన్ సేవలను ప్రారంభించనున్నారు. అందుకోసం సిద్ధమవుతున్న మొబైల్ యాప్ ఏది ?
జ: TAAPFOLIO
04) కొంగవాలు కత్తి నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2019 అవార్డును గడ్డం మోహన్ రావు అందుకున్నారు. అయితే ఈ నవల ఎవరి జీవితాలను ఇతివృత్తం?
జ: చిందు కళాకారులకు సంబంధించినది.
05) గడ్డం మోహన్ రావు చిందు కళాకారులపై రాసిన ఇతర నవలలు ఏవి ?
జ: చిందు ఎల్లమ్మ, చిందుల హంస, నేను చిందేస్తే, కొంగువాలు కత్తి (2017)

జాతీయం
06) కిర్గిజిస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశాధ్యక్షుడు సూరోన్ బే జీన్ బెకోవ్ తో సమావేశం అయ్యారు. రెండు దేశాల మధ్య 15 ఒప్పందాలు కుదిరాయి. కిర్గిజిస్తాన్ కి ఎంతమొత్తం రుణాన్ని మోడీ ప్రకటించారు ?
జ: రూ.1400 కోట్లు ( 200 మిలియన్ డాలర్లు )
07) ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన మూడో దశ కింద దేశంలోని అన్ని గ్రామాలను వాటికి దగ్గర్లోని వ్యవసాయ మార్కెట్లను అనుసంధానించేందుకు ఎంత మొత్తం నిధులను కేటాయించాలని నిర్ణయించింది ?
జ: రూ.70వేల కోట్లు
08) ఏ నగరంలోని మెట్రో రైలులో ప్రయాణించే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ?
జ: ఢిల్లీలో (ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు )
09) అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న 29 రకాల ఉత్పత్తులపై అదనపు సుంకాన్ని వసూలు చేయనున్నారు. ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది ?
జ: 2019 జూన్ 16 నుంచి
10) అమెరికా నుంచి దిగుమతి అవుతున్న 29 వస్తువులపై అదనపు సుంకం వేయడం ద్వారా భారత్ కు అదనంగా ఏడాదికి ఎంత మొత్తం ఆదాయం లభించనుంది ?
జ: 217 మిలియన్ డాలర్లు ( దాదాపు రూ.1520 కోట్లు )
11) మన దేశ విదేశీ మారక నిల్వలు లైఫ్ టైమ్ లోనే గరిష్ట స్థాయికి చేరాయి. జూన్ 7తో ముగిసిన వారంలో దేశంలో ఎన్నికోట్ల రూపాయలు ఉన్నాయి ?
జ: రూ.29.64 లక్షల కోట్లు... 42,355.40 కోట్ల డాలర్లు
12) కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్ 2019, యువ పురస్కార్ 2019 అవార్డులను త్రిపుర రాజధాని అగర్తలో ప్రకటించింది. అకాడమీ అధ్యక్షుడు ఎవరు ?
జ: డాక్టర్ చంద్రశేఖర్ కంబారా
13) బాల సాహిత్య పురస్కారం అందుకున్న తెలుగు రచయిత ఎవరు ?
జ: బెలగం భీమేశ్వరరావు (తాత మాట వరాల మూట కథల పుస్తకం)
14) 35యేళ్ళ లోపు రచయితలకు ఇచ్చే సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2019 కి ఎవరు ఎంపికయ్యారు ?
జ: గడ్డం మోహన్ రావు ( కొంగవాలు కత్తి నవలకు అవార్డు దక్కింది )
15) కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని అందుకున్న సీనియర్ జర్నలిస్ట్, అసోసియేట్ ఎడిటర్ ఎవరు ?
జ: ఎ.కృష్ణారావు