Friday, February 28

CURRENT AFFAIRS JULY 3

తెలంగాణ
01) రాష్ట్రంలో తాజాగా ఎక్కడ భారీగా బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు బయటపడ్డాయి ?
జ: జయశంకర్ జిల్లా మహదేవ్ పూర్ మండలం చండ్రుపల్లిలో
02) అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ (ఇస్టా) ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తెలంగాణ శాస్త్రవేత్త ఎవరు ?
జ: కేశవులు
(నోట్: ఈయన జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త, రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్. 2019-22 వరకూ ఈ పదవిలో కొనసాగుతారు)
03) అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ (ఇస్టా) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
జ: స్విట్జర్లాండ్ లో
04) నివాస గృహ మార్కెట్లో ఈ ఏడాది తొలి అర్థ భాగంలో హైదరాబాద్ గరిష్ట వార్షిక వృద్ధి ఎంత శాతంగా ఉంది ?
జ: 65శాతం
(నోట్: JLL సంస్థ రెసిడెన్షియల్ మార్కెట్ అప్ డేట్ 2019 తొలి భాగం నివేదికలో ఏడు నగరాల్లో నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది )

జాతీయం
05) భారత్ కు నాటోతో సమాన హోదా ఇచ్చేందుకు ఉద్దేశించిన శాసనసభ నిబంధనను ఆమోదించిన దేశం ఏది ?
జ: అమెరికా సెనేట్
06) రిజర్వ్ బ్యాంక్ రూ.8వేల కోట్ల మిగులు నిధులు ప్రభుత్వానికి బదిలీ చేయొచ్చని అంచనా వేసిన ప్యానెల్ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు ?
జ: బిమల్ జలాన్
07) భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) నిర్వహణలో ఆధార్ సేవా కేంద్రాలను మొదటిసారిగా ఎక్కడెక్కడ ప్రారంభించారు ?
జ: ఢిల్లీ, విజయవాడ
08) ప్రభుత్వ రంగం ఇంజనీరింగ్ సంస్థ BHEL ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: నలిన్ షింగల్
09) సూక్ష్మ రుణ సంస్థల నెట్ వర్క్ ( MFIN) ఛైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: అరోహన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండీ కుమార్ నంబియార్
10) 2019 అక్టోబర్ లో మన దేశానికి చెందిన ఎవర్ని పునీత (సెయింట్) గా వాటికన్ సిటీ ప్రకటించనుంది ?
జ: కేరళ నన్ మరియం త్రేసియా చిరమేల్ మన్ కిడియాన్

అంతర్జాతీయం
11) బయటకు ఏమీ చెప్పకుండానే మనసుతో మనసు గుస గుసలాడే సరికొత్త వ్యవస్థను ఏ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఆవిష్కరించారు ?
జ: వాషింగ్టన్ విశ్వవిద్యాలయం
12) నదులు ఆక్రమణలకు గురి కాకుండా వాటికి సజీవ అస్తిత్వ హోదాను కల్పించిన హైకోర్టు ఏ దేశంలో ఉంది ?
జ: బంగ్లా దేశ్ లో
13) చరిత్రలోనే అతి ఖరీదైన విడాకుల ఒప్పందంగా ఏది నిలిచిపోనుంది ?
జ: అమెజాన్ బెజోస్ భార్యతో కుదుర్చుకున్న ఒప్పందం
(నోట్: రూ.2.62 లక్షల కోట్ల భరణం ఇవ్వనున్నారు )