Wednesday, February 26

CURRENT AFFAIRS – JULY 24

తెలంగాణ
01) రాష్ట్రంలో కొత్త మున్సిపల్ చట్టానికి ఒక మార్పుతో గవర్నర్ నరసింహన్ ఎప్పుడు ఆమోదం తెలిపారు ?
జ: 2019 జులై 21 నాడు
02) వచ్చే ఏడాది మేలో అమెరికాలోని నెవెడాలో జరుగుతున్న వరల్డ్ ఎన్విరాన్ మెంటల్, వాటర్ కాంగ్రెస్ సదస్సుకు రాష్ట్రంలో ఎవరికి ఆహ్వానం అందింది ?
జ: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
03) ఏయే వ్యాధి గ్రస్తులకు జీవితాంతం మెడిసన్స్ ఉచితంగా ఇవ్వాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది ?
జ: లివర్, గుండె మార్పిడి, కిడ్నీ వ్యాధి బాధితులు
04) డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిష్ట్రార్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: డాక్టర్ జి.లక్ష్మా రెడ్డి
05) అమెరికాకి చెందిన పేమెంట్స్ సేవల సంస్థ తన మూడో టెక్నాలజీ సెంటర్ ను హైదరాబాద్ లో ప్రారంభించింది... ఆ సంస్థ ఏది ?
జ: పే పాల్
06) నాబార్డ్ 38వ వ్యవస్థాపక దినోత్సవాల్లో రాష్ట్రానికి చెందిన ఏది ఉత్తమ సంస్థగా జాతీయ అవార్డు పొందింది ?
జ: పాలెం కృషి విజ్ఞాన కేంద్రం
07) బొగ్గు గనుల శాఖ జాతీయ స్థాయి బోర్డు స్వతంత్ర డైరెక్టెర్ గా ఎవరు నిమితులయ్యారు ?
జ: డాక్టర్ ఉప్పునూతల మురళీధర్ గౌడ్
08) గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఏ అడవిని దత్తత తీసుకుంటున్నట్టు టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రకటించారు ?
జ: కీసర అడవిని

జాతీయం
09) కర్ణాటకలో సీఎం కుమార స్వామి సర్కార్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్ లో ఓడిపోయింది. అనుకూలంగా, వ్యతిరేకంగా ఎన్ని ఓట్లు వచ్చాయి ?
జ: అనుకూలం 99, వ్యతిరేకం 105 ఓట్లు
10) అసోంలో నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ ఫైనల్ జాబితాను ప్రకటించడానికి సుప్రీంకోర్టు ఎప్పటిదాకా డెడ్ లైన్ విధించింది ?
జ: 2019 ఆగస్టు 31 వరకూ
11) భారత స్థూల దేశీయోత్పత్తి (GDP)లో గతంలో ప్రకటించిన అంచనాల్లో కోత విధించింది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF). ప్రస్తుతం ఎంతగా నిర్ణయించింది ?
జ: 2019 కి 7శాతం 2020 కి 7.2 శాతం
12) ద్రవ్యోల్భణం లాంటి స్థూల ఆర్థి అంశాలకు సంబంధించి తన అత్యుత్తమ నిర్వహణ, నియంత్రణ, పర్యవేక్షణ, ద్రవ్య వ్యవస్థపై జనంలో విశ్వసనీయత పెంపొందించేందుకు 3 యేళ్ళ కాల పరిమితికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రేమ్ వర్క్ ను రూపొందించింది. దాని పేరేంటి ?
జ: ఉత్కర్ష్ 2022
13) PSB లోన్స్ ఇన్ 59 మినిట్స్ ద్వారా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 59 నిమిషాల్లో ఎన్ని కోట్లు రుణం మంజూరు చేయాలని ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ణయించాయి ?
జ: రూ.5 కోట్లు
14) 59 నిమిషాల్లో రూ.5కోట్లు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవి ?
జ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియెంల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, కార్పోరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్
(నోట్: 2018 నవంబర్ లోఈ పథకం పోర్టల్ ను ప్రధాన నరేంద్రమోడీ ప్రారంభించారు. రూ.కోటి వరకూ ఆఫర్ తో ఈ స్కీమ్ మొదలైంది)
15) ఫార్చూన్ ఇండియా 500లో భారత్ నుంచి అత్యంత విలువైన కంపెనీగా (ఆదాయపరంగా ) నిలిచినది ఏది ?
జ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ( RIL)
16) ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ర్యాంక్ నిలబెట్టుకున్నా భారతీయ క్రికెటర్ ఎవరు ?
జ: విరాట్ కోహ్లీ
17) భారత క్రికెటర్ల సంఘం (ICA) ఏర్పాటు చేసుకునేందుకు BCCI అధికారికంగా ఆమోదం తెలిపింది. కంపెనీల చట్టంలోని ఏ నిబంధన ప్రకారం ఈ సంఘం ఏర్పాటు కానుంది ?
జ: కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 8 ప్రకారం

అంతర్జాతీయం
18) బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తున్నారు ?
జ: బోరిస్ జాన్సన్
(నోట్: లండన్ మాజీ మేయర్, బ్రెగ్జిట్ కు హార్డ్ కోర్ సపోర్టర్ )
19) బ్రిటన్ ప్రధానిగా థెరిసా మే తప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఏ పార్టీ అధికారంలో ఉంది ?
జ: కన్సర్వేటివ్ పార్టీ
20) తియనన్మెన్ స్క్వేర్ లో వేల మంది ఊచకోతకు కారకుడైన చైనా మాజీ ప్రధాని చనిపోయారు. ఆయన పేరేంటి ?
జ: లీపెంగ్ (90)
21) తొలిసారిగా ఆటగాళ్ళ నెంబర్లు కలిగిన జెర్సీలతో టెస్టు మ్యాచ్ ఆడుతున్న జట్టు ఏది ?
జ: ఐర్లాండ్

 

100 రోజుల మాక్ టెస్టులు వచ్చే సోమవారం జులై 30 నుంచి ప్రారంభం అవుతాయి. ఈ లాంగ్ టర్మ్ కోర్సుతో నోటిఫికేషన్లు పడకముందే సబ్జెక్ట్ లపై గ్రిప్ పెంచుకోవచ్చు. వెంటనే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి... పూర్తి వివరాలకు ఈ కింది లింకులో ఉన్నాయి.
http://telanganaexams.com/mock-tests-2/