Monday, August 19

CURRENT AFFAIRS – JULY 19

తెలంగాణ
01) రాష్ట్రంలో కొత్తగా 7 మున్సిపల్ కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో మొత్తం కార్పోరేషన్ల సంఖ్య ఎంతకు చేరుతుంది.
జ: 13 కి
02) రాష్ట్రంలో మొత్తం ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి ?
జ: 128 మున్సిపాలిటీలు
03) 2019 సంవత్సరానికి దాశరధి కృష్ణమాచార్యులు అవార్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేసింది ?
జ: కూరెళ్ళ విఠలాచార్య
04) రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే రెండు రెవెన్యూ డివిజన్లకు సంబంధించి ప్రభుత్వం తుది ప్రకటన జారీ చేసింది. అవి ఏంటి ?
జ: జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్
05) రాష్ట్రంలో కొత్తగా రెండు వ్యవసాయ మార్కెట్ కమిటీలను ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేసింది ?
జ: ఖమ్మం (ఖమ్మం జిల్లా), చెన్నూరు వ్యవసాయ మార్కెట్లు (మంచిర్యాల జిల్లా )

జాతీయం
06) ఏ పథకంలో భాగంగా దేశంలోని ప్రజల ఆరోగ్యానికి సంబంధించి నేషనల్ డిజిటల్ హెల్త్ బ్లూప్రింట్ ను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: ఆయుష్మాన్ భారత్
07) వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ఎప్పుడు చేపడుతున్నట్టు ఇస్రో ప్రకటించింది ?
జ: 2019 జులై 22న
08) జులై 15న చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని మోసుకెళ్ళాల్సిన ఏ వాహక నౌకలోని క్రయోజనిక్ ఇంజిన్ లో సాంకేతిక లోపంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు ?
జ: GSLV-మార్క్ 3M1
09) జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయంటూ ఏ రెండు సామాజిక మాధ్యమాలకు 24 ప్రశ్నలు సంధిస్తూ కేంద్ర నోటీసులు ఇచ్చింది ?
జ: హెలో, టిక్ టాక్
10) హైదరాబాద్ లో పర్యటించిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ ఛైర్మన్ ఎవరు ?
జ: పద్మభూషణ్ డాక్టర్ కె.కస్తూరి రంగన్
11) 2019-20 సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ (ADB) అంచనా వేసింది ?
జ: 7 శాతంగా (గతంలో 7.2శాతంగా అంచనా వేసింది... ఇప్పుడు తగ్గించింది )
12) దివంగత ప్రధాని ఇందిరాగాంధీ మొదటిసారి ఎప్పుడు 14 బ్యాంకులను జాతీయకరణ చేశారు ?
జ: 1969 జులై 19న
13) డిజిటల్ లావాదేవీల్లో భాగంగా కార్డుల ద్వారా చెల్లింపుల్లో దేశంలో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది ?
జ: బెంగళూరు మొదటి స్థానం, హైదరాబాద్ రెండో స్థానం
(నోట్: పేమెంట్స్ సొల్యూషన్ సంస్థ రేజర్ పే నిర్వహించిన సర్వేలో తేలింది )
14) అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (IAAF) నుంచి ప్రతిష్టాత్మక వెటరన్ పిన్ అవార్డుకు ఎంపికైన భారత మాజీ అథ్లెట్, ఒలింపియన్ ఎవరు ?
జ: పీటీ ఉష
15) ఇండియన్ ప్రీమియర్ లీగ్ హైదరాబాద్ జట్టు సన్ రైజర్స్ కి ఎవరు హెడ్ కోచ్ గా నియమితులయ్యారు ?
జ: ట్రెవర్ బేలిస్
16) ట్రెవర్ బేలిస్ ప్రస్తుతం ఏ దేశ క్రికెట్ జట్టుకు కోచ్ గా ఉన్నాడు ?
జ: ఇంగ్లండ్
17) ప్రొ.కబడీ లీగ్ (PKL) సీజన్ -7 ఎక్కడ ప్రారంభం అవుతోంది ?
జ: హైదరాబాద్ లో

అంతర్జాతీయం
18) ప్రపంచ కుబేరుల జాబితాను బ్లూమ్ బర్గ్ ప్రకటించింది. ఇందులో మొదటి రెండు స్థానాల్లో ఎవరు నిలిచారు ?
జ: మొదటి స్థానంలో జెఫ్ బెజోన్ (అమెజాన్ ), రెండో స్థానంలో బెర్నార్డ్ అర్నాల్డ్ (LVMH కంపెనీ-ఫ్రాన్స్)
19) ప్రపంచ కుబేరుల జాబితాలో ఏడేళ్ళలో మొదటిసారిగా మూడో స్థానానికి దిగిపోయిన అపర కుబేరుడు ఎవరు ?
జ: మైక్రో సాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్
20) క్రికెట్ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యానికి వ్యతిరేకంగా ఏ క్రికెట్ జట్టును ICC అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది ?
జ: జింబాబ్వే

 

(Note: ఈ నెలలో ఇవ్వని కరెంట్ ఎఫైర్స్ ... ఇవాళ్టి రేపట్లో పూర్తి చేస్తాను. సహకరించగలరు )