Monday, October 21

CURRENT AFFAIRS – JULY 18

తెలంగాణ
01) తెలంగాణలో పెంచిన కొత్త ఫించన్లు జూన్ నెల నుంచి వర్తిస్తాయి. ఫించన్లు ఇవ్వడానికి వయో పరిమితిని 65 యేళ్ళ నుంచి ఎంతకు తగ్గించారు ?
జ: 57 ఏళ్ళకు
02) కొండాపూర్ లోని CR ఫౌండేషన్ వృద్దాశ్రమంలో ఉంటున్న కమ్యూనిస్టు యోధుడు జాలాది వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఆయన పేరేంటి ?
జ: జాలాది వెంకటేశ్వరరావు (102)
03) దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నీతి ఆయోగ్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మూడు లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేసే సంస్థలు తెలంగాణలో ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తున్నాయి. మొదటి దశలో ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు ?
జ: రూ.1500 కోట్లు
04) భారత వ్యవసాయ పరిశోధనా మండలి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో బెస్ట్ సైంటిఫిక్ పబ్లికేషన్స్ ఇన్ హిందీలో అవార్డు పొందిన రాష్ట్రానికి చెందిన సంస్థ ఏది ?
జ: రాజేంద్ర నగర్ లోని జాతీయ వ్యవసాయ పరిశోధనా నిర్వహణ సంస్థ ( నార్మ్)

జాతీయం
05) పాకిస్తాన్ చెరలో బందీగా ఉన్న కుల్ భూషణ్ మరణశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానం నిలిపివేసింది. మొత్తం 16 మంది న్యాయమూర్తుల్లో ఎంతమంది భారత్ కు అనుకూలంగా రూలింగ్ ఇచ్చారు ?
జ: 15 మంది
06) కుల భూషణ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానంలో ఒక్క రూపాయి ఫీజు తీసుకొని భారత్ తరపున వాదించిన ప్రముఖ న్యాయవాది ఎవరు ?
జ: హరీశ్ సాల్వే
07) ఉపాధి హామీ పథకాన్ని రైల్వే అభివృద్ధి పనులకు వినియోగించుకుంటున్న రైల్వే ఏది ?
జ: దక్షిణ మధ్య రైల్వే
08) ఆర్బీఐ దగ్గర ఉన్న రూ.9 లక్షల కోట్ల అదనపు మూలధనాన్ని కేంద్ర ప్రభుత్వానికి 3-5యేళ్ళల్లో బదిలీ చేయాలని సూచించిన కమిటీ ఏది ?
జ: బిమల్ జలాన్ కమిటీ
09) 2018 సంవత్సరానికి సంగీత నాటక అకాడమీ ఫెలోలుగా ఎవరిని ఎంపిక చేశారు ?
జ: జాకీర్ హుస్సేన్, సోనాల్ మాన్ సింగ్ (మొత్తం 44 మంది కళాకారులు ఉన్నారు )
10) అసోం వరద బాధితులను ఆదుకునేందుకు రూ.2కోట్లు ఆర్థిక సాయం ప్రకటించిన బాలీవుడ్ నటుడు ఎవరు ?
జ: అక్షయ్ కుమార్
11) అత్యాధునిక నావల్ MRశామ్ ( ఉపతితర నుంచి గగనతలంలోకి ప్రయోగించే మధ్యశ్రేణి క్షిపణి) వ్యవస్థను భారత్ నౌకాదళం, మజ్ గావ్ డాక్ షిప్ బిల్డర్స్ కు సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ ఏది ?
జ: ఇజ్రాయెల్ ఏరో స్పేస్ ఇండస్ట్రీస్
12) నావల్ MRశామ్ ( ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే మధ్యశ్రేణి క్షిపణి) ను ఇజ్రాయెల్ కంపెనీ నుంచి కొనుగోలు చేస్తారు. ఈ ఒప్పందం విలువ ఎంత ?
జ: రూ.345 కోట్లు
13) భారతీయులపై, విదేశాల్లోని భారతీయ ఆస్తులపై ఉగ్రవాద దాడులు జరిగితే దర్యాప్తు చేసే అధికారాన్ని ఏ సంస్థకు అప్పగించే బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది ? (గతంలో లోక్ సభ ఆమోదం తెలిపింది )
జ: జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)

అంతర్జాతీయం
14) ముంబై బాంబు దాడుల సూత్రధారి, జమాత్ -ఉద్ దవా అధిపతి హఫిజ్ సయీద్ ను పంజాయ్ ప్రావిన్స్ కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక దళం అదుపులోకి తీసుకుంది. ఆయన్ని ఏ జైలుకి తరలించారు ?
జ: కోట్ లఖ్ పత్ జైలుకి