Wednesday, June 19

CURRENT AFFAIRS JULY 17

రాష్ట్రీయం
01) ఎకరానికి 8 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం చేసే రైతు బంధు పథకంనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఏ పత్రిక దీనిపై కథనం రాసింది ?
జ: ది ఎకనమిస్ట్ ( లండన్ )

జాతీయం
02) ఆధార్ లాగే వేటికి కూడా యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (విశిష్ట గుర్తింపు సంఖ్య) ను పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది ?
జ: ఓటర్ గుర్తింపు కార్డులకు ( బోగస్ ఓట్లు ఏరివేతకు )
03) ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ను భారత్ ఎక్కడ విజయవంతంగా ప్రయోగించింది ?
జ: ఒడిశాలోని బాలాసోర్ లో (290 కిమీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు )
04) కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి ఎవరు ?
జ: శివ్ ప్రతాప్ శుక్లా
05) 2018 లో భారత్ వృద్ది రేటు అంచనాల్లో IMF కోత విధించింది. అయితే ప్రస్తుత ఆర్థికరేటును ఎంతగా ఫిక్స్ చేసింది ?
జ: 7.3 శాతం
06) ప్రపంచంలోనే తొలిసారిగా రిమోట్ కంట్రోల్ మైక్రోస్కోప్ ను ఎక్కడ తయారు చేశారు ?
జ: మద్రాస్ ఐఐటీలో
07) IDBI బ్యాంకును ఏ సంస్థ కొనుగోలు చేయనుంది ?
జ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
08) రఘునాధ్ మహాపాత్రను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇటీవల రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆయన ఏ రంగానికి చెందిన వారు ?
జ: శిల్ప కళ
09) ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు ఇంగ్లీషులో ప్రావీణ్యం కల్పించేందుకు I am not afraid of English అనే కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: హర్యానా
10) బన్సాగర్ డ్యామ్ ప్రాజెక్ట్ ను ఏ మూడు రాష్ట్రాలు కలసి నిర్మిస్తున్నాయి ?
జ: మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బిహార్
11) 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 24,821 మంది సంస్కృతం మాతృభాషగా ఎంచుకున్నారు. అయితే దేశంలో సంస్కృతాన్ని అధికార భాషగా ప్రకటించిన రాష్ట్రం ఏది ?
జ: ఉత్తరాఖండ్
12) భారత మహిళల క్రికెట్ జట్టు తాత్కాలిక కోచ్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: రమేష్ పొవార్ (టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ )

అంతర్జాతీయం
13) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎక్కడ సమావేశం అయ్యారు ?
జ: హెల్సింకీ (ఫిన్ లాండ్ )
14) ప్రపంచంలోనే అతిపెద్ద వీసా సెంటర్ ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?
జ: ఢాకా
15) 47 మంది సభ్య దేశాలున్న ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ లో ఇటీవల సభ్య దేశంగా ఏకగ్రీవంగా ఎన్నికైన దేశం ఏది ?
జ: ఐస్ లాండ్

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
https://telanganaexams.com/mockmaterial/

Note: తెలంగాణ ఎగ్జామ్స్ నుంచి వస్తున్న కరెంట్ ఎఫైర్స్ ను మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు.  ఒక్కోరోజు CA ఇవ్వకపోతే వేలల్లో మెస్సేజ్ లు వస్తున్నాయి.  కరెంట్ ఎఫైర్స్ ను నేను మాత్రమే తయారు చేస్తాను. నేను V6 ఛానల్ లో పనిచేస్తాను. మధ్యాహ్నం వరకూ టైమ్ సరిపోకపోవడం లేదా కొన్ని వ్యక్తిగత కారణాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ రోజు ఇవ్వలేకపోతున్నాను.  వాటిని మళ్లీ 2,3 రోజుల్లో కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను.  అర్థం చేసుకోగలరు.  అలాగే 15,16 మిస్ అయిన కరెంట్ ఎఫైర్స్ ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం లోపు పోస్ట్ చేస్తాను. సహకరించగలరు.