Wednesday, June 26

CURRENT AFFAIRS – JULY 14

రాష్ట్రీయం
01) హైదరాబాద్ లో డిఫెన్స్ ఇంక్యుబేటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ నిర్ణయించింది. ఏ పథకంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేయనున్నారు ?
జ: ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్స్ లెన్స్ (ఐడెక్స్)
02) సునామీలు, సముద్రంలో తలెత్తే ఇతరత్రా విపత్తుల సమాచారాన్ని ఖచ్చితంగా పసిగట్టేందుకు ఉద్దేశించిన సముద్ర సమాచార కేంద్రం హైదరాబాద్ లో ఉంది. దాని పేరేంటి ?
జ: ఇన్ కాయిస్ ( భారత జాతీయ సముద్ర సమాచార సేవా కేంద్రం )
03) గిరిజ్యోతి పురస్కార గ్రహీత జంగుబాయి కుమురం భీం జిల్లా సిర్పూర్ లో చనిపోయారు. ఆమె ఏ రంగంలో కృషి చేశారు ?
జ: గిరిజనుల్లో చైతన్యానికి( ఆధ్యాత్మిక, సామాజిక సేవలు అందించిన మొదటి ఆదివాసీ మహిళగా గుర్తింపు) (2010లో ఆమెకు గిరిజ్యోతి పురస్కారం లభించింది )

జాతీయం
04) 2019 జనవరి 26 రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఎవరిని భారత్ ఆహ్వానించింది ?
జ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
05) గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులను అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని 2018 ఆగస్టు 1 నుంచి అమలు చేయనుంది ?
జ: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ - 2018
06) భారత్ -అమెరికా మధ్య 2+2 కేంద్ర మంత్రిత్వ స్థాయి చర్చలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి ?
జ: సెప్టెంబర్ లో
07) ఈ శతాబ్దంలోనే సుదీర్ఘ చంద్ర గ్రహణం (గంటా 43 నిమిషాలు) ఎప్పుడు ఏర్పడనుంది ?
జ: 2018 జులై 27
08) ఆసియాలోనే అత్యంత ధనికుడుగా ఎవరు నిలిచారు ?
జ: ముకేశ్ అంబానీ
(నోట్: రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు జీవిత కాలపు గరిష్ట స్థాయికి చేరుకుంది. రూ.1,101కి చేరుకోవడంతో కంపెనీ మార్కెట్ క్యాపిటిలైజేషన్ రూ.7లక్షలు కోట్లు దాటింది )
09) ఆసియాలో అత్యంత ధనికుడిగా ముకేశ్ అంబానీ నిలవడంతో, రెండో స్థానానికి పడిపోయినది ఎవరు ?
జ: అలీబాబా గ్రూపు వ్యవస్థాపకుడు జాక్ మా
10) డైరక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ ఎఫైర్స్ ( ICWA) గా ఎవరు నియమితులయ్యారు ?
జ: TCA రాఘవన్
11) ఇండియన్ ఆర్మీలో పనిచేసేవారికి డిఫెన్స్ సాలరీ ప్యాకేజీ కోసం MOU కుదుర్చుకున్న ప్రభుత్వ రంగ బ్యాంకు ఏది ?
జ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
12) యూరోపియన్ బ్యాంక్ ఆఫ్ రీకనస్ట్రక్షన్ అండ్ డెవలప్ మెంట్ ( EBRD) లో కొత్తగా భారత్ కు సభ్యత్వం లభించింది. ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
జ: లండన్
13) సరిహద్దు పర్యాటకంలో భాగంగా సీమా దర్శన్ పేరుతో పర్యాటకులకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: గుజరాత్
14) అల్యూమినియం : ది ఫ్యూచర్ మెటల్ : గ్రంథ కర్త ఎవరు?
జ: తాపన్ కుమార్ ఛంద్
15) క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన భారత మాజీ క్రికెటర్ ఎవరు ?
జ: మొహమ్మద్ కైఫ్

అంతర్జాతీయం
16) పనామా పత్రాల కుంభకోణంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మర్యం అరెస్ట్ అయ్యారు. ఏ అక్రమాస్తుల కేసులో వీరికి పాక్ సుప్రీం కోర్టు శిక్ష విధించింది ?
జ: అవెన్ ఫీల్డ్ హౌస్

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
https://telanganaexams.com/mockmaterial/