Friday, February 28

CURRENT AFFAIRS – JULY 12

తెలంగాణ
01) రాష్ట్రంలో కొత్త సెక్రటరియేట్ నిర్మాణం కోసం పనులు సాగుతున్నాయి. అందులో భాగంగా ప్రస్తుత సచివాలయాన్ని ఏ బిల్డింగ్ లోకి మారుస్తున్నారు ?
జ: BRKR భవన్
02) లాభసాటి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించడానికి తెలంగాణ వ్యవసాయం - దిక్సూచి అనే పుస్తకాన్ని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఎవరు రూపొందించారు ?
జ: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం
03) ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్ లో భాగంగా తెలంగాణలో ఎన్ని లక్షలమందిని డిజిటల్ అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది ?
జ: 20.28లక్షల మందిని
(నోట్: ఇప్పటికే 3,94,762 మందిని డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దినట్టు కేంద్రం తెలిపింది )
04) రాష్ట్రంలో ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా ఇసుకను అధికారికంగా అమ్ముతున్న సంస్థ ఏది ?
జ: తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ( TSMDC)
05) బాసరలోని రాజీవ్ గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ( RGUKT) కి ఛాన్సలర్ గా ఎవరు ఉండేలా వర్సిటీల కొత్త చట్టంలో మార్పులు తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: గవర్నర్
06) ఆరు నుంచి 10 తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం ప్రతి శుక్రవారం టీ-శాట్ టీవీలో ఏ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ సంస్థ ప్రకటించింది ?
జ: అభ్యసనం ఆనందంగా
07) రాష్ట్రంలో కొత్తగా వాక్ ఇన్ ఏవియరీ, ఆయుష్ వనంను ఎక్కడ ప్రారంభించారు ?
జ: దూలపల్లిలో - ఆయుష్ వనం
కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ లో - వాక్ ఇన్ ఏవియరీ

జాతీయం
08) ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని షార్ లో చంద్రయాన్ - 2 ప్రయోగాన్ని 2019 జులై 15న ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏ రాకెట్ నుంచి దీన్ని ప్రయోగించనున్నారు ?
జ: GSLV - MARK 3
09) ఢిల్లీ, ముంబై నుంచి సింగపూర్ కి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించిన సంస్థ ఏది ?
జ: విస్తారా
(నోట్: టాటా, సింగపూర్ ఎయిర్ లైన్స్ సంయుక్త సంస్థ ఇది )
10) జాతీయ మెగా లోక్ అదాలత్ ను దేశవ్యాప్తంగా ఎప్పుడు నిర్వహిస్తున్నారు ?
జ: 2019 జులై 13న
11) దేశంలో అద్దె ఇళ్ళ యజమానులు, కిరాయిదారుల పరిరక్షణ కోసం కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది... ఈ చట్టం ప్రకారం ఇంటి అద్దె అడ్వాన్స్ ఎంత వరకు నిర్ణయించనుంది ?
జ: రెండు నెలలు మాత్రమే
(నోట్: నివాసేతర సముదాయాలు (షాపులు) కు ఒక నెల అద్దె మాత్రమే కనీస సెక్యూరిటీ డిపాజిట్ గా తీసుకోవాలి )
12) ఉగ్రవాదులు, నక్సలైట్లు, సంఘ విద్రోహ శక్తుల నుంచి ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోడానికి రైల్వేలు సొంతంగా దళాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాయి... ఈ దళాన్ని ఏ పేరుతో పిలుస్తారు ?
జ: కోరాస్ ( కమెండో ఫర్ రైల్వే సెక్యూరిటీ )
13) కేవలం రూ.127కే వేడి వేడి బిర్యానీని ఆన్ లైన్ ద్వారా అందించేందుకు ఏ జైలులో ఏర్పాటు చేస్తున్నారు ?
జ: కేరళలోని వియ్యూరు సెంట్రల్ జైలులో

అంతర్జాతీయం
14) ఇంగ్లండ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్స్ లోకి ప్రవేశించిన జట్లు ఏవి ?
జ: ఇంగ్లండ్ - న్యూజిలాండ్
15) భారతీయ ఐటీ నిపుణులకు ప్రయోజనం కలిగించే గ్రీన్ కార్డు బిల్లును అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఆమోదించింది. ఈ బిల్లు పేరేంటి ?
జ: ఫెయిర్ నెస్ ఫర్ హై-స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ యాక్ట్ 2019

 

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true