Wednesday, March 20

CURRENT AFFAIRS – JULY 11

రాష్ట్రీయం
1) 2017 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ప్రకటించిన స్టేట్ బిజినెస్ రిఫామ్స్ అసెస్ మెంట్ కింద తెలంగాణకి ఎన్నో ర్యాంకు వచ్చింది ?
జ: రెండో ర్యాంక్ (98.33శాతం)
(నోట్: మొదటి ర్యాంక్ ఆంధ్రప్రదేశ్ కి(98.42శాతం)
2) సంస్కరణల విభాగంలో నూటికి నూరు శాతం మార్కులు సాధించిన రాష్ట్రాలు ఏవి ?
జ: తెలంగాణ, ఝార్ఖండ్
3) ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకులను ఈసారి ఏ పేరుతో ప్రకటించారు ?
జ: స్టేట్ బిజినెస్ రిఫామ్స్ అసెస్ మెంట్
4) నాలుగో విడత హరితహారంను సీఎం కేసీఆర్ ఎక్కడ ప్రారంభించనున్నారు ?
జ: జయశంకర్ జిల్లాలో (ఘన్ పూర్ మడలం మైలారం అటవీ ప్రాంతంలో )
5) ఆర్టీసీ కార్మికులకు సకల జనుల సమ్మెకాలాన్ని సాధారణ సెలవుగా పరిగణిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సకలజనుల సమ్మె ఎప్పుడు జరిగింది ?
జ: 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకూ
6) తెలంగాణలో ప్రతి యేటా జులై 11న ఇంజినీర్స్ డేని నిర్వహిస్తున్నారు. ఎవరి జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే నిర్వహిస్తారు ?
జ: ప్రఖ్యాత ఇంజనీర్ నవాబ్ జంగ్ (141 వ జయంతి)
7) బీజీ-3 పత్తి విత్తనాలకు ఉపయోగించే ఏ కలుపు మందును రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది ?
జ: గ్లైపోసేట్

జాతీయం
8) భారత్ దక్షిణ కొరియా మధ్య 11 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఏ ఏడాదిలోగా వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించారు ?
జ: 2030
9) ఐటీ సేవల ఎగుమతుల్లో భారత్ ఏ స్థానంలో నిలిచింది ?
జ: మొదటి స్థానం
10) కార్నెల్ విశ్వవిద్యాలయం, ఇన్ సీడ్, ప్రపంచ మేధో సంపత్తి సంస్థ, జీఐఐ విజ్ఞాన కలసి ప్రకటించిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకుల్లో భారత్ స్థానం ఎంత ?
జ: 57 ( కిందటేడాది 60 వ స్థానంలో ఉంది )
11) సాధారణ రైలు టిక్కెట్లు కూడా ఇంటి నుంచే పొందేలా కొత్త మొబైల్ యాప్ ను రైల్వే శాఖ అందుబాటులోకి తెస్తోంది. దాని పేరేంటి ?
జ: యూటీఎస్ ఆన్ మొబైల్
12) ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే రాజ్యసభ వర్షాకాల సమావేశాల్లో సభ్యులు ఎన్ని భాషల్లో మాట్లాడేలా ఏర్పాట్లు చేసినట్టు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు?
జ: 22 భాషల్లో
13) భారత మహిళల క్రికెట్ కోచ్ గా ఎవరు రాజీనామా చేశారు ?
జ: తుషార్ అరోతే
14) స్వలింగ సంపర్కం నేరమా కాదా అనే అంశంపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. దీనికి సంబంధించి IPC లోని సెక్షన్ ఏది ?
జ: సెక్షన్ 377
15) స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్ ) పేరును ఇటీవల ఏ విధంగా మార్చారు ?
జ: స్పోర్ట్స్ ఇండియా
(నోట్: 1984లో సాయ్ ను ఏర్పాటు చేశారు )

అంతర్జాతీయం
16) ట్విట్టర్ లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న లీడర్ గా ఎవరు నిలిచారు ?
జ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
(నోట్: 2,3 స్థానాల్లో పోప్ ఫ్రాన్సిస్, ప్రధాని నరేంద్రమోడీ నిలిచారు )
17) అమెరికా సుప్రీంకోర్టు జడ్జిగా ప్రెసిడెంట్ ట్రంప్ ఎవర్ని నామినేట్ చేశారు ?
జ: బ్రెట్ కవానో

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
https://telanganaexams.com/mockmaterial/