Friday, May 24

CURRENT AFFAIRS – JULY 10

రాష్ట్రీయం
1) స్థిరాస్తి నియంత్రణ చట్టం (రెరా)ని రాష్ట్రంలో ఎప్పటి నుంచి అమల్లోకి తేనున్నారు ?
జ: 2018 ఆగస్టు 1
2) నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటంతో పాటు గోవా విముక్తి పోరాటంలో పనిచేసిన స్వాతంత్ర్య సమరయోధుడు చనిపోయారు. ఆయన పేరేంటి ?
జ: ఎన్ బి శ్రీహరి
3) రాష్ట్రంలోని యువతలో నైపుణ్యాలను కల్పన, పెంపుదల కోసం ఏర్పాటు చేసిన టాస్క్ యొక్క పూర్తి పేరేంటి ?
జ: Telangana Academy for Skill Knowledge
4) 2016-17 సం. నుంచి మన రాష్ట్రం ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ ను కొనుగోలు చేస్తోంది. యూనిట్ ను ఎంతగా నిర్ణయించారు ?
జ: రూ.3.71 పైసలు

జాతీయం
5) దక్షిణకొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ శామ్ సంగ్ ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ ప్లాంట్ ను ఎక్కడ నిర్మించింది ?
జ: నోయిడాలో
6) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఛైర్మన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
జ: జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్
7) 2018 జులై 6న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైర్డ్ అయినది ఎవరు ?
జ: జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్
8) ఏపీ బ్రాండ్ గా ఏ బిర్యానీని ప్రచారంలోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ నిర్ణయించింది ?
జ: బొంగు (బ్యాంబూ) బిర్యానీ
9) 60యేళ్ళు పైబడిన వృద్ధులకు సీఎం తీర్థయాత్ర యోజన ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: ఢిల్లీ సర్కార్
10) విన్నింగ్ లైక్ సౌరవ్ : థింక్ అండ్ సక్సీడ్ లైక్ గంగూలీ - పుస్తకాన్ని రచించింది ఎవరు ?
జ: అభిరూప్ భట్టాచార్య
11) బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేషన్ కు చెందిన కోనప్పన అగ్రహార మెట్రో స్టేషన్ నిర్మాణానికి ఇన్ఫోసిస్ ఎంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వనుంది ?
జ: రూ.200 కోట్లు
12) బ్రాడ్ కాస్టింగ్ కంటెంట్ కంప్లయింట్స్ కౌన్సిల్ ( BCCC) సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: ఉదయ్ కుమార్ వర్మ
13) గుడ్ విల్ విజిట్ లో భాగంగా 8 జులై 2018 నాడు శ్రీలంక చేరుకునన భారతీయ యుద్ధ నౌక ఏది ?
జ: INS త్రికండ్
14) సోహాగి బర్వా జంతు సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది ?
జ: ఉత్తరప్రదేశ్
15) భాక్రా డ్యామ్ ను ఏ నది ఒడ్డుపై నిర్మించారు ?
జ: సట్లెజ్ నది
16) ఆంధ్రబ్యాంక్ ట్యాగ్ లైన్ ఏంటి ?
జ: Where India Banks

అంతర్జాతీయం
17) పబ్లిక్ ఓటింగ్ ద్వారా బుకర్ ప్రైజ్ గెలుచుకున్న పుస్తకం ఏది ?
జ: ద ఇంగ్లిష్ పేషెంట్ ( రచయిత మైకేల్ అందాజీ - కెనడా )
18) 17వ ప్రపంచ సంస్కృతం సదస్సు ఏ దేశంలో జరిగింది ?
జ: కెనడా
( 2018 జులై 9 నాడు వాంకోబర్ లో జరిగిన ఈ సదస్సులో 40 దేశాలకు చెందిన 500 మంది విద్యావేత్తలు పాల్గొన్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవ్ దేక్ దీన్ని ప్రారంభించారు )
19) కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరు ?
జ: Dr. Luise Martin CBE

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
https://telanganaexams.com/mockmaterial/

2 Comments

Comments are closed.